హనుమా, నువ్వు రాముణ్ణి ఎక్కడ చూశావు? సీతమ్మ ప్రశ్న

Webdunia
మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (22:05 IST)
అమ్మా, రామభద్రుడు పద్మదళ విశాల నయనాలతో సర్వలోక మనోహరంగా వుంటాడు. దయార్ద హృదయుడు. సూర్యసమతేజస్వి, పృధ్వికున్నంత ఓరిమి వుంది. ధీశక్తిలో బృహస్పతి. కీర్తికి ఇంద్రుడు. 
 
సర్వభూత రక్షణతో తన పరిజన రక్షణ కూడా చూసుకునేవాడు. ముందు తన జీవనధర్మాన్ని నిర్వహిస్తూ లోకధర్మ రక్షణ చేస్తాడు. లోక మర్యాద వీడకుండా సర్వవర్ణాలనూ ధర్మపదాన నిలబెడతాడు. బ్రహ్మచర్య నియమంతో, సజ్జనులకు సాయపడుతూ, ఇహపరాలను చూసుకుంటూ వుంటాడు. రాజనీతి నిపుణుడు, విద్యాంసులను నిరంతరం ఆరాధిస్తాడు. వినయ, విద్యాసంపన్నుడు. శత్రుసంతాపకుడు. యజుర్వేదం అధ్యయనం చేసినవాడు. ధనుర్వేదం కరతలామలకం. వేదవేత్తల పూజలు పొందేవాడు. 
 
విపులాంసుడు, దీర్ఘబాహుడు, శంఖకంఠుడు, అరుణారుణ నయనుడు. ఆయన కంఠం దుందుభిస్వనంలా వుంటుంది. శరీరం అంతా తీర్చిదిద్ది హెచ్చుతగ్గులు లేకుండా వుంటుంది.  ఉరఃస్థలం, మణికట్టు, పిడికిలి చాలా దృఢంగా వుంటాయి. ఆయన నడక, నాభి, మాట బహుగంభీరాలు. సింహ, శార్దూల, గజ, వషభ గమనుడు. 
 
దేశ కాల పాత్రాలు గ్రహించి సంగ్రహానుగ్రహాలు చేయగలవాడు. సర్వజన ప్రియంగా మాట్లాడగలవాడు అని హనుమంతుడు చెపుతుండగా సీతాదేవికి ఆనంద బాష్పాలతో హృదయం సంతోష తరంగితం అయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీనియర్ ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారు.. మూడేళ్లలో రూ.2.41 కోట్లు సంపాదించాను.. ప్రశాంత్ కిషోర్

Malla Reddy: రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోవిడ్ కంటే దారుణమైనది.. మల్లారెడ్డి ధ్వజం

రాయదుర్గంలో రికార్డు స్థాయిలో భూమి ధర.. ఎకరం భూమి రూ.177 కోట్లు

Vijayawada: విజయవాడలో ఆ వర్గాలకు ప్రాతినిధ్యం ఇవ్వని వైకాపా.. ఎదురు దెబ్బ తప్పదా?

Polavaram: 2019లో టీడీపీ గెలిచి ఉంటే, పోలవరం 2021-22 నాటికి పూర్తయ్యేది-నిమ్మల

అన్నీ చూడండి

లేటెస్ట్

ఈ రోజు శని మహా ప్రదోషం.. శివాలయానికి వెళ్లి పూజ చేయడం తప్పనిసరి

04-10-2025 శనివారం దిన ఫలితాలు - ఖర్చులు సామాన్యం.. చెల్లింపుల్లో జాగ్రత్త...

Tirumala : శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. రూ.25 కోట్లకు పైగా కానుకలు

03-10-2025 శుక్రవారం దిన ఫలితాలు- మొండి బాకీలు వసూలవుతాయి

02-10-2025 గురువారం దిన ఫలితాలు - దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది...

తర్వాతి కథనం
Show comments