Webdunia - Bharat's app for daily news and videos

Install App

తీర్థం సేవించిన తర్వాత తలపై రుద్దకూడదు.. ఎందుకు..?

తీర్థం యొక్క విశిష్టత ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంట్లోనూ, దేవాలయంలోనూ లేదా ఇంకెక్కడైనా దేవుడిని దర్శించుకున్న తర్వాత తీర్థం తీసుకుంటాం. కానీ తీర్థాన్ని మూడుసార్లు ఎందుకు తీసుకోవాలి అన్నది చాలామందిక

Webdunia
శనివారం, 29 జులై 2017 (12:52 IST)
తీర్థం యొక్క విశిష్టత ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంట్లోనూ, దేవాలయంలోనూ లేదా ఇంకెక్కడైనా దేవుడిని దర్శించుకున్న తర్వాత తీర్థం తీసుకుంటాం. కానీ తీర్థాన్ని మూడుసార్లు ఎందుకు తీసుకోవాలి అన్నది చాలామందికి తెలియదు.
 
దేవునికి పూజల చేసిన తర్వాత తీసుకునే తీర్థంలో పంచామృతాలు, తులసిదళాలు, సుగంధ ద్రవ్యాలు, మంత్రశక్తులు ఉంటాయి. దీంతో ఆ తీర్థం అత్యంత పవిత్రంగా మారుతోంది. తీర్థం తీసుకోవడం ద్వారా మన ఆరోగ్యం, ఆధ్మాత్మికత మెరుగవుతాయి. మొదటిసారి తీర్థం తీసుకుంటే శారీరక, మానసిక శుద్థి జరుగుతుంది.
 
రెండోసారి తీర్థం తీసుకుంటే న్యాయ ధర్మ ప్రవర్తనలు చక్కదిద్దుకుంటాయి. ఇక మూడవది పవిత్రమైన పరమేశ్వరుని పరమ పదం అనుకుని తీసుకోవాలి. మన పురాణాల ప్రకారం తీర్థం అంటే తరింపజేసేది అని అర్థం. దీన్ని మూడుసార్లు తీసుకుంటే భోజనం చేసినంత భక్తి వస్తుందని అంటారు. తీర్థం తీసుకునేటప్పుడు ఆరోగ్యకరమైన భావంతో తీసుకోవాలి.
 
ఈ తీర్థం నాకు మంచి చేస్తుంది. నా ఆరోగ్యానికి, నా ఆధ్మాత్మికతను మెరుగు పరుస్తుంది అని సద్భావంతో తీసుకోవాలని పురాణాలు చెబుతున్నాయి. అకాల మృత్యు హరణం సర్వవ్యాధి నివారణం. మూడుసార్లు కూడా కుడిచేయి కింద ఎడమచేయిని ఉంచి తీర్థం తీసుకోవాలి. కుడిచేయి చూపుడు వేలు మధ్యలోకి బొటన వేలిని మడిస్తే గోముఖం అనే ముద్ర వస్తుంది. ఈ ముద్రతో తీర్థాన్ని తీసుకోవాలి. తీర్థాన్ని తీసుకున్నాక తలపై తుడుకుంటారు. కానీ అలా చేయకూడదు. తలపైన బ్రహ్మదేవుడు ఉంటాడు. మన ఎంగిలిని బ్రహ్మకు అర్పణం చేసిన వారమవుతాం. కాబట్టి కళ్ళకు అద్దుకోవడం మాత్రమే మంచిది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)

పవన్ కళ్యాణ్ కాన్వాయ్ దెబ్బ - పరీక్షకు హాజరుకాలేకపోయిన విద్యార్థులు... (Video)

బట్టతలపై జుట్టు అనగానే క్యూ కట్టారు.. ఇపుడు లబోదిబోమంటున్నారు.. (Video)

క్రికెట్ బెట్టింగ్‌-ఐదు కోట్ల బెట్టింగ్ రాకెట్-హన్మకొండలో బుకీ అరెస్ట్

అమరావతికి కేంద్ర ప్రభుత్వం రూ.4,200 కోట్లు విడుదల

అన్నీ చూడండి

లేటెస్ట్

రూపాయి ఖర్చు లేకుండా వాస్తు దోషాలు మటాష్.. ఎలా?

04-04-2025 శుక్రవారం మీ రాశిఫలాలు : బాకీలను లౌక్యంగా వసూలు చేసుకోవాలి...

03-04-2025 గురువారం మీ రాశిఫలాలు : అనవసర విషయంలో జోక్యం తగదు....

పుట్టుమచ్చల ఫలితాలు.. నడుము ప్రాంతంలో స్త్రీపురుషులకు పుట్టుమచ్చ వుంటే?

02-04-2025 బుధవారం మీ రాశిఫలాలు : పనులు ఒక పట్టాన సాగవు...

తర్వాతి కథనం
Show comments