Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ రాశి ఫలితాలు (29-07-2017)... ఇలా వుండబోతోంది...

మేషం : ఈరోజు ఆర్థిక వ్యవహారాల కారణంగా మనశ్శాంతి లోపిస్తుంది. చిన్నారులు, ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు. ఉద్యోగస్తులు మార్పుకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాభివృద్ధికై చేయు ప్రయత్నాలు

Webdunia
శనివారం, 29 జులై 2017 (04:50 IST)
మేషం : ఈరోజు ఆర్థిక వ్యవహారాల కారణంగా మనశ్శాంతి లోపిస్తుంది. చిన్నారులు, ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు. ఉద్యోగస్తులు మార్పుకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాభివృద్ధికై చేయు ప్రయత్నాలు అనుకూలించవు. దైవదర్శనం చేయు సూచనలు కలవు. వృత్తుల వారికి శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది.
 
వృషభం : మీ కార్యక్రమాలు, పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. విద్యార్థులకు చదువుల పట్ల ఏకాగ్రత ఎంతో ముఖ్యం. ఉద్యోగస్థులకు పై అధికారుల వల్ల ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. పెన్షన్, భీమా సమస్యలు పరిష్కారం అవుతాయి. దీర్ఘకాలంగా వాయిదా పడుతున్న పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు.
 
మిథునం : పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. దైవస్మరణ వలన మనశ్శాంతి కలుగుతుంది. బంధుమిత్రులను కలుసుకుంటారు. ఇరుగుపొరుగు వారి మధ్య కలహాలు అధికమవుతాయి. చేసే పనిలో ఏకాగ్రత, పట్టుదల ఎంతో ముఖ్యమని గమనించండి. మార్కెట్ రంగాల్లో వారికి ఒత్తిడి పెరుగుతుంది.
 
కర్కాటకం : ఇంట్లో మార్పులు చేర్పులు అసౌకర్యం కలిగిస్తాయి. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. రాజకీయాల్లో వారి కార్యక్రమాలు వాయిదా పడటం వల్ల ఆందోళనకు గురవుతారు. ఎప్పటి నుంచో కలవాలనుకున్న ఆత్మీయులను కలిసే అవకాశం ఉంది. హామీలు, మధ్యవర్తిత్వాలు ఇబ్బంది కలిగిస్తాయి.
 
సింహం : ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. స్త్రీలకు పనిభారం వల్ల ఆరోగ్యములో సమస్యలు తలెత్తుతాయి. సమావేశాలకు ఏర్పాటు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. మీ వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. కుటుంబ విషయాల్లో గతానుభవం ఉపయోగపడుతుంది.
 
కన్య: బంధుమిత్రులను కలుసుకుంటారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఒత్తిడి తప్పదు. ఆహార వ్యవహారాల్లో మెళకువ వహించండి. భాగస్వామ్య చర్చల్లో కొన్ని అవరోధాలు తలెత్తుతాయి. జాగ్రత్త వహించండి. కుటుంబ సౌఖ్యం కొంత తక్కువని చెప్పవచ్చు. పనులు మొదలెట్టే సమయానికి ఆటంకాలెదురవుతాయి.
 
తుల : కుటుంబంలో ఒకరి ధోరణి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. బ్యాంకింగ్ వ్యవహారాల పట్ల అప్రమత్తత అవసరం. నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతారు. ఒంటరిగానే లక్ష్యాలను సాధిస్తారు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. కంప్యూటర్, ఎలక్ట్రానికల్, టెక్నికల్ రంగాల్లో వారికి కలిసివస్తుంది.
 
వృశ్చికం : ఆదాయ వ్యయాలు ఫర్వాలేదనిపిస్తాయి. కొబ్బరి, పండ్ల, పూల, చిరు వ్యాపారులకు కలిసిరాగలదు. ప్రైవేట్ సంస్థల్లోని వారు మార్పులకై చేయు ప్రయత్వాల్లో విజయం సాధిస్తారు. దుబారా ఖర్చులు అధికం. కావలసిన వ్యక్తుల కలయిక అనుకూలించదు. ప్రయాణాల్లో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు.
 
ధనస్సు : వాయిదా పడిన పనులు పునఃప్రారంభిస్తారు. హోల్‌సేల్ వ్యాపారులకు కొత్త సమస్య తలెత్తే సూచనలున్నాయి. ముఖ్యులలో ఒకరి గురించి ఆందోళన చెందుతారు. విదేశాల నుంచి ప్రత్యేక విషయాలు విని సంతోషిస్తారు. మీ ఆంతరంగిక, కుటుంబ విషయాలు ఇతరుల ముందు ఏకరువు పెట్టడం మంచిదికాదు.
 
మకరం : ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. సేవా సంస్థలకు విరాళాలివ్వటం వల్ల మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. పనివారలతో ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ కృషికి ప్రోత్సాహం లభిస్తుంది. కోర్టు వ్యవహారాలు వాయిదా పడుట మంచిది అని గమనించండి. సంతానం భవిష్యత్తు కోసం పొదుపు పథకాలు చేపడతారు.
 
కుంభం : కీలకమైన విషయాల్లో జాగ్రత్త అవసరం. మీ ఆలోచనల్లో మార్పు వస్తుంది. సావకాశంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. రావలసిన ఆదాయంలో కొంత మొత్తం అందుతుంది. అవసరాలు, కోరికలు నెరవేరుతాయి. పనులు, కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి.
 
మీనం : సంఘంలో గుర్తింపు, రాణింపు లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. లక్ష్య సాధనలో సన్నిహితుల సహకారం కొరవడుతుంది. ఒక శుభకార్యం దిశగా యత్నాలు సాగిస్తారు. చిన్నతరహా పరిశ్రమలు, చిరువ్యాపారులకు ఆశాజనకం. హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

భక్తి-ముక్తి, శక్తి-యుక్తి ఈ 4 అవసరం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో శ్రీశ్రీ రవిశంకర్ (video)

మగవాళ్లపై గృహహింస: ‘పెళ్లైన 15 రోజులకే విడాకులన్నారు, ఇంటికి వెళితే దారుణంగా కొట్టి పంపించారు’

జగన్ థర్డ్ డిగ్రీ నుంచి బీజేపీలో ఉండటంతో తప్పించుకున్నా : విష్ణుకుమార్ రాజు

పెళ్లి బరాత్‌లో డ్యాన్స్ చేస్తూ.. గుండెపోటుతో యువకుడి మృతి..

రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కారు డ్రైవర్ నెల వేతనం ఎంతో తెలుసా?

అన్నీ చూడండి

లేటెస్ట్

ఏంజెల్ నంబర్ 1515 అంటే ఏమిటి? చూస్తే ఏం జరుగుతుంది?

క్షీరాబ్ధి ద్వాదశి.. సాయంత్రం పూట తులసీకోట ముందు దీపం తప్పనిసరి

నవంబర్ 17న తిరుమలలో కార్తీక వనభోజనం

13-11-2024 బుధవారం ఫలితాలు - కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి....

క్షీరాబ్ధి ద్వాదశి- తులసీ కోట వద్ద నేతి దీపం.. నువ్వుల నూనె వాడితే?

తర్వాతి కథనం
Show comments