Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్ళి కూతురికి మంగళస్నానాలు ఎందుకు చేయిస్తారో తెలుసా..?

Webdunia
మంగళవారం, 24 డిశెంబరు 2019 (13:20 IST)
వధూవరులకు మంగళ స్నానాలు చేయించడం ఆనవాయితీ. పెళ్ళి పీటల మాదకు రాబోయే వధువుకి ప్రత్యేకమైన స్నానం చేయిస్తే ఆ అమ్మాయి చర్మ సౌందర్యం కాంతిగా ఉండడమే కాకుండా శరీరం సుగంధాన్ని వెదజల్లుతూ ఉంటుందట. గులాబీ పూల రెకకలను శుభ్రమైన నీటిలో వేసి కొన్ని గంటల సేపు ఉంచుతారు.
 
పెళ్ళి కూతురు శరీరానికి వెన్నెతో కలిపిన పసుపు, చందనం బాగా మర్థిస్తారు ఆ తరువాత శెనగపిండితో మృదువుగా రుద్దుకున్నాక స్నానం చేయిస్తారు. పెళ్ళికూతురు స్నానం చేసే నీళ్ళలో గులాబీ రేకలు నానేసిన నీటిని పోస్తారు. కొంచెం పన్నీరు కూడా ఆ నీళ్ళలో కలపినట్లయితే ఆ అమ్మాయి చర్మం కాంతిగానూ, మృదువుగానూ, సువాసనలు వెదజల్లుతూ ఉంటుందట.
 
స్నానానికి ఉపయోగించే నీటిలో మరువం, దవనం లాంటి సువాసనలు వెదజల్లేవాటిని వేయవచ్చు. సంపంగి, మల్లె, జాజి, విరజాజి లాంటి పూలను చేసినట్లయితే ఆ నీళ్ళు మరింత పరిమళ భరితంగా ఉంటాయి. 
 
కమలాపండు తొక్కలను స్నానం చేసే నీటిలో వేసి కొంతసేపు అయిన తరువాత స్నానం చేస్తే చర్మం సువాసనగా హాయిగా రిలాక్సింగ్ గా ఉంటుంది. ఎంతో అందంగా అలంకరించిన పెళ్ళి కూతురు పెళ్ళిపీటల మీదకు రాగానే పరిమళాలు వ్యాపిస్తాయి. అందుకే పెళ్ళికూతురుకు ఇలా పెళ్ళికి ముందు స్నానం చేయిస్తారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

05-05 - 2024 నుంచి 11-05-2024 వరకు ఫలితాలు మీ వార రాశిఫలాలు

04-05-202 శనివారం దినఫలాలు - సోదరీ, సోదరులతో ఏకీభావం కుదరదు...

గురు గోచారం.. చతుర్‌గ్రాహి యోగం.. ఈ రాశులకు యోగం..

03-05-2024 శుక్రవారం దినఫలాలు - రావలసిన ధనం చేతికందుతుంది...

మే 1న గురు పరివర్తనం 12 రాశుల వారికి లాభం.. ఫలితాలేంటి?

తర్వాతి కథనం
Show comments