Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్త్రీ గర్భవతిగా ఉన్నప్పుడు ఇలా చేయొచ్చా..?

Webdunia
శుక్రవారం, 15 ఫిబ్రవరి 2019 (12:30 IST)
ఇంట్లో గర్భిణీ స్త్రీలు ఉన్నప్పుడు ఆ గృహస్తులు కొత్త ఇల్లు లేదా ప్లాట్స్ వంటి వాటివి కొనుగోలు చేయడం లేదా కట్టడం వంటివి చేయకూడదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. గృహ నిర్మాణ పనులు చేపట్టినప్పుడు అక్కడ వాతావరణం దుమ్ము, ధూళి కారణంగా కాలుష్యమౌతుంది. కనుక కచ్చితంగా గర్భిణీ స్త్రీలను, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని వాస్తుశాస్త్రం చెబుతోంది.
 
శిశువు పుట్టిన తరువాత కట్టడాల నిర్మాణాలు, ప్లాట్స్ కొనడం వంటివి చేయాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. అలానే నిద్రలేచిన వెంటనే గర్భిణీ స్త్రీలు పచ్చటి ప్రకృతి, జలపాతాలు వంటి దృశ్య పటాలను ఉదయాన్నే నిద్రలేస్తూనే చూడడం మంచిది. నిద్రలేచిన వెంటనే దేవుడు పటాల్ని చూడడం ద్వారా రోజంతా శుభదాయకంగా ఉంటుంది.
 
గర్భిణీ స్త్రీలు ఉండే ఇళ్లల్లో గృహస్థలం యొక్క దక్షిణం వైపున ఖాళీ స్థలాన్ని వదిలిపెట్టి ఉత్తరం వైపున ఇల్లు ఉండకుండా ఉండాలి. ఇటువంటి స్థలం గర్భిణీ స్త్రీలను మాత్రమే కాకుండా స్త్రీలకు బాధలను కలిగిస్తాయని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
మరోవైపు గర్భవతికి ఆరు మాసములు నిండిన తరువాత గృహారంభం, గృహప్రవేశం చేయకూడదని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. దీంతో పాటు సముద్ర ప్రయాణం, భర్త క్షవరం చేయించుకొనుట, శ్రాద్ధాన్న భోజనం చేయుట వంటివి కూడదు. 
 
ఇంకా గర్భిణీ స్త్రీ భర్త పుణ్యతీర్థములు సేవించుట, శవాన్ని మోయుట, శవం వెంట నడుచుట వంటివి చేయకూడదు. గర్భిణీ స్త్రీలైతే నదీ స్నానం, శవం వద్ద దీపమెలిగించడం, రక్తాన్ని చూడడం, శ్మశాన దర్శనం చేయడం శిశువుకు మంచిది కాదు. అలానే గర్భిణీ స్త్రీలుంటే ఇంటి నిర్మాణంలో మార్పులు, చేర్పులు చేయడం శ్రేయస్కరం కాదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ కేసు: జగన్‌ను అదానీ ఎప్పుడెప్పుడు కలిశారు.. అమెరికా అభియోగాల్లో ఏముంది?

24న డాక్టర్ గౌరీ లక్ష్మీబాయికి ఆధ్యాత్మిక పురస్కారం ప్రదానం

జగన్ 'గులక రాయి' డ్రామా.. వైకాపా గాలి తీసిన సీఎం చంద్రబాబు

పండమేరు వంతెన నిర్మాణానికి నిధులు ఇవ్వండి.. పవన్‌కు పరిటాల సునీత వినతి

కేన్సర్ 40 రోజుల్లో తగ్గిపోయిందన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు, నెటిజన్లు ఏమంటున్నారు?

అన్నీ చూడండి

లేటెస్ట్

2025లో ఈ రెండు రాశులకు శనీశ్వరుడి యోగం..? కింగ్ అవుతారు..!

22-11-2024 శుక్రవారం వారం ఫలితాలు - దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది...

2025లో ఏ రాశుల వారికి శుభకరంగా వుంటుందో తెలుసా?

21-11-2024 గురువారం ఫలితాలు - మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి...

భైరవ అష్టమి మహోత్సవం, 2024 రకాల మిఠాయిల భోగం, 84,000 చదరపు అడుగుల రంగోలీ ప్రపంచ రికార్డు

తర్వాతి కథనం
Show comments