మోసం చేయడం కంటే..
ఓటమిని పొందడమే గౌరవమైన విషయం..
తన మీద పడే రాళ్ళకు భయపడి పారిపోయేవాడు పిరికివాడు..
ఆ రాళ్ళను తప్పించుకుని ఎదురు తిరిగేవాడు ధైర్యవంతుడు..
ఆ రాళ్ళతోనే ఒక కోటను నిర్మించేవాడు మేధావి..
ఒక్క నిమిషం మనం నిర్లక్ష్యంగా ఉండడం వలన చేజారిన అవకాశం..
ఒక్కోసారి దశాబ్ద కాలం వేచి ఉన్నా దొరకకపోవచ్చు..
ఒకసారి మనల్ని ఎవరైనా మోసం చేస్తే.. అది వాళ్ళ తప్పవుతుంది..
రెండవసారీ మనం మోసపోతే కచ్ఛితంగా అది మన తప్పే అవుతుంది..
నీలో లోపాన్ని ఎవరైనా వేలెత్తి చూపితే ఆగ్రహించకు..
నీ మేలు కోరుకునేవారు ఒక్కరైనా ఉన్నారని ఆనందించు..
అందరిలోనూ మంచిని చూడడం నీ బలహీనత అయితే..
ఈ ప్రపంచంలో నీ అంత బలమైన వారు వేరొకరు ఉండరు..