Webdunia - Bharat's app for daily news and videos

Install App

''ఆ రోజు చాలా తీయగా బావుంది... యువర్స్'', ఏంటంటే నా 'ఎక్స్' అంటున్నాడు...

Webdunia
మంగళవారం, 11 డిశెంబరు 2018 (15:58 IST)
మా పెళ్లయి రెండేళ్లు కావొస్తోంది. ఈ రెండేళ్లు ఎంతో సంతోషంగా ఎంజాయ్ చేశాము. మొన్నీమధ్య మా ఆయన సెల్ ఫోనులో ఓ టెక్ట్స్ మెసేజ్ చూసి షాక్ తిన్నాను. అందులో... ''ఆ రోజు చాలా తీయగా చాలాచాలా బావుంది... యువర్స్'' అని రాసి ఉంది. నేను ఆ మెసేజ్ చూడగానే వెంటనే నా భర్తను దాని గురించి అడిగాను. 
 
అదేమీ లేదు... నా ఎక్స్- గర్ల్ ఫ్రెండ్ కాలేజీ డేస్‌లో విహార యాత్రలకు సంబంధించి అలా రాసిందిలే అంటూ లైట్‌గా తీసి పారేశారు. ఆయన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పినందుకు ఆయన నిజాయితీ పైన నాకు నమ్మకం కుదిరింది కానీ, నాకెందుకో ఆయన మీద మరో డౌటు ఉంది. తన ఎక్స్-గర్ల్ ఫ్రెండుతో రహస్యంగా ఏమైనా డేటింగ్ చేస్తున్నాడేమోనని అనుమానంగా ఉంది. ఈ విషయాన్ని నేను కనిపెట్టాలంటే ఏం చేయాలి...?
 
ఇలాంటి విషయాలు మనిషి మనిషీకి తేడాగా ఉంటుంది. కొందరు తమకు ఇంతకుమునుపే గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ, కొన్ని ప్రత్యేక కారణాల వల్ల విడిపోయి మరొకర్ని పెళ్లి చేసుకోవడం జరుగుతుంటుంది. అలాంటప్పుడు ప్రేమికులుగా ఉన్నవారిలో చాలామంది జస్ట్ ఫ్రెండ్స్‌గా ఉండిపోతారు. మరికొందరు తాము పెళ్లాడినప్పటికీ తన ప్రియురాలిని మర్చిపోలేక మళ్లీ వారికోసమే పరితపిస్తుంటారు.
 
దీనితో తమ సంబంధాన్ని అలాగే కొనసాగిస్తుంటారు. ఇకపోతే ఇలాంటి విషయాన్ని డిటెక్టివ్ మాదిరిగా సంబంధం ఏమిటో తెలుసుకోవాలని అనుకునేకంటే మీ అసంతృప్తిని భర్తతో చెప్పేయడం మంచిది. ఆయన ముందు కాస్త అసంతృప్తిని వ్యక్తం చేసినా మెల్లమెల్లగా అర్థం చేసుకుంటారు. మీరనుకుంటున్నట్లు మళ్లీ డేటింగ్ వంటివేమైనా వుంటే మీరు వెలిబుచ్చిన అసంతృప్తితో క్రమంగా దూరమయ్యే అవకాశాలుంటాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

ఆ పూజారి కాలితో తన్నించుకుంటే మోక్షం కలుగుతుందట... ఎక్కడ?

మే నెలలో అమరావతిలో పర్యటించనున్న ప్రధాని మోడీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

తర్వాతి కథనం
Show comments