నాకలా అయ్యింది... నన్ను మర్చిపో అంటోంది... ఏం చేయాలి?

Webdunia
శనివారం, 10 నవంబరు 2018 (16:47 IST)
మా ఆఫీసులో ఓ అందమైన అమ్మాయి ఉద్యోగంలో చేరింది. ఆమె కంటే నా పోస్టు పెద్దదే. ఐనా నాకు స్త్రీలంటే చాలా గౌరవం. ఆమెకేదైనా చెప్పాలనుకుంటే మెసేజ్ చేసేవాణ్ణి. నా పద్ధతి పట్ల ఆమె ఎంతో ముచ్చటపడి ఓరోజు నన్ను అభినందించింది. ఆ తర్వాత నాతో మాట్లాడింది లేదు. కానీ నన్ను చూసినప్పుడు ఒక్క నవ్వు నవ్వుతుంది. చాలా కష్టపడి పనిచేస్తుంది. పెళ్లి చేస్కుంటే ఇలాంటి అమ్మాయినే చేసుకోవాలనిపించింది.
 
కానీ ప్రపోజ్ చేసేందుకు చాలా టైం పట్టింది. చివరకి ధైర్యం తెచ్చుకుని నేను ప్రేమిస్తున్నాను... పెళ్లి చేసుకుంటానని చెప్పాను. మళ్లీ ఆమె ఓ నవ్వు నవ్వింది. అదే రోజు సాయంత్రం తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని నాకు చెప్పింది. ఎందుకని అడిగితే... తను విడాకులు తీసుకున్నాననీ, అందువల్ల పెళ్లి చేసుకోదలచుకోలేదని అంటోంది. కానీ ఆమెను తప్ప ఇక వేరే ఎవర్నీ పెళ్లి చేసుకోదలచుకోలేదు. నాకామె ఇప్పుడు ప్రాణంతో సమానమైపోయింది. ఆమె జీవితంలో చేదు జ్ఞాపకాలను చెరిపేసి పెళ్లాడితే మా పెద్దలు అంగీకరిస్తారా...?
 
ఆమెను ప్రేమించారు. ఆమె తన జీవితంలో చోటుచేసుకున్న చేదు నిజాన్ని చెప్పేసింది. మీ పెద్దలకు చెప్పడం, ఆ తర్వాత నిర్ణయం తీసుకోవడం మీ చేతుల్లోనే ఉంది. ఐతే అంతకంటే ముందు ఆమె మిమ్మల్ని పెళ్లాడేందుకు సిద్ధంగా వున్నదో లేదో చెక్ చేసుకోండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

2,500 కిలోమీటర్ల వ్యాసార్థంలో విస్తరించి ఉన్న భారీ మేఘాల సమూహం, ఏం చేయబోతోంది?

నెల్లూరులో 1000 మంది నివాసితులకు వేదాంత పవర్ మీనాక్షి ఎనర్జీ సురక్షిత తాగునీటి సదుపాయం

కర్నాటక నుంచి రాజ్యసభకు వైఎస్ షర్మిల?

ఆస్తి వివాదం.. కుటుంబానికి చెందిన ఐదుగురి హత్య ... ఎక్కడ?

ఇక అమెరికా ఏం గెలుస్తుంది? రూ.150 కోట్ల విమానాన్ని చిన్న బాణంతో కూల్చేసిన ఇరాన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హైదరాబాద్‌లో సరికొత్త ఫార్మెట్ లో ఐమాక్స్ స్క్రీన్ : సునీల్ నారంగ్

Sandigdham Review: మిస్టరీ, థ్రిల్లింగ్ కథతో నిహాల్, ప్రియా దేశ్‌పాగ్ చిత్రం సందిగ్ధం మూవీ రివ్యూ

Sanjay Rao: హిట్ అండ్ రన్ ఫస్ట్ లుక్ తో సంజయ్ రావ్ క్రేజ్

మహేష్ బాబు అతిథి 4K థియేటర్లలో పాలాబిషేకంతో అభిమానుల సందడి

Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగా చిత్రానికి రోమాంచకం టైటిల్ ఖరారు

తర్వాతి కథనం
Show comments