Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రియురాలి పేరు చెబితేనే చేస్తున్నాడు... ఈయనకేంటి ఈ పిచ్చి?

Advertiesment
ప్రియురాలి పేరు చెబితేనే చేస్తున్నాడు... ఈయనకేంటి ఈ పిచ్చి?
, శుక్రవారం, 9 నవంబరు 2018 (20:38 IST)
కాలేజీ డేస్‌లో ఆయనకు ఓ గర్ల్ ఫ్రెండ్ ఉండేదట. ఆమెను ఎంతగానో ప్రేమించాడట. కాకపోతే ఈయనది వన్ సైడ్ లవ్. తన లవ్ గురించి ఆమెకు చెబితే మరోసారి లవ్ అంటూ తన వద్దకు వస్తే ఏం జరుగుతుందో చూసేందుకు నువ్వండవు అని హెచ్చరించిందట. అప్పట్నుంచి ఆమెను మర్చిపోవాలనుకున్నా మర్చిపోలేకపోయారట. ఆమెనే తలచుకుంటూ ఏదేదో చేసుకునేవారట. 
 
పెళ్లయ్యాక నెల రోజుల తర్వాత ఈ చరిత్ర మొత్తం చెప్పేశారు. ఆయన చెప్పినదంతా భరించాను. కానీ ఇప్పుడు కొత్త కోర్కెతో వేధిస్తున్నారు. శృంగారం చేసే ముందు నేను నీ ప్రేయసిని.. అంటూ తన మాజీ ప్రియురాలి పేరు చెప్పమని అంటున్నాడు. అలా చెబితేనే శృంగారం చేస్తానంటున్నాడు. ఒకవేళ నేను చెప్పకపోతే ఆరోజు చేయడంలేదు. ఆయన మనస్తత్వం సరిగానే ఉందా...?
 
కొంతమంది యువకులు ఇలా మరీ ఎక్కువగా ఊహించుకుంటుంటారు. వారికి నచ్చిన అమ్మాయిని చేసుకోవాలని తప్పించి, ఆ అమ్మాయికి తను నచ్చానా లేదా అన్నది పట్టించుకోరు. ఒకవేళ ఇలా దూరమైపోయినా ఆ జ్ఞాపకాల్లో బతుకుతుంటారు. కానీ పెళ్లయ్యాక గత స్మృతులు లోపలే ఉంచేసి వర్తమానంలో జీవించేస్తుంటారు చాలామంది. కానీ ఇలా ఎక్కడో కొందరు మాత్రమే తను ప్రేమించిన అమ్మాయిని పదేపదే గుర్తుచేసుకుంటూ ఉంటారు. ఇది పడకగది వద్దకు కూడా వస్తేనే సమస్య. అతడితో మీ అసంతృప్తిని చెప్పండి. వినకపోతే మాత్రం ఖచ్చితంగా సైక్రియాట్రిస్టుకు చూపించాల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పురుషుల్లో ఆ శృంగార సమస్య... అక్కడ నిలబడితే చాలు...