Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమించేటపుడు శృంగారం చేస్కుంటారా...?

Webdunia
మంగళవారం, 8 జనవరి 2019 (15:27 IST)
నేను నా సీనియర్‌తో ప్రేమలో పడ్డాను. ఐతే మా ఇద్దరి చదువు పూర్తయి ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. కానీ ఈమధ్య నా బాయ్ ఫ్రెండ్ శృంగారం కావాలని గోల చేస్తున్నాడు. పెళ్లయ్యేదాకా చేయకుండా ఉండలేనని బతిమాలుతున్నాడు. అతడు మరీ అంతగా అడుగుతుంటే ఏదో ఒకరోజు ఒప్పుకుంటానేమోనన్న డౌట్ వస్తోంది. అసలు ప్రేమించేటపుడు శృంగారం చేసుకోవచ్చా...? దీనివల్ల ఇబ్బందులు ఏమయినా కలుగుతాయా...?
 
ప్రేమికుల్లో పెళ్లి చేసుకునే వరకూ శృంగారంలో పాల్గొనకుండా ఉండేవారు, పరిచయమైన కొద్ది రోజులకే ఆ సుఖాన్ని చవిచూసేవారు ఉంటుంటారు. ప్రేమికులు - శృంగారం అనే అంశంపై జరిపిన పరిశోధనలో ప్రేమికులయినవారిలో కొన్ని జంటలు తాము ప్రేమలో పడిన 45 రోజుల లోపు శృంగారంలో పాల్గొంటారని తేలింది. అంతేకాదు... అలా తొలిసారి ఆ అనుభవాన్ని చవిచూసిన లవర్స్ ఇంకా ఇంకా శృంగారంలో పాల్గొనాలన్న వాంఛతో ఉంటారట. 
 
ఐతే ఎక్కువమంది ఈ కార్యక్రమాన్ని పెళ్లి తర్వాతనే ఆస్వాదిస్తారని తేలింది. ఈ రెండు అంశాలలో పాల్గొన్నవారికి భిన్న ఫలితాలు కూడా సంప్రాప్తిస్తాయని పరిశోధనలో వెల్లడయింది. అవేంటంటే, పెళ్లికి ముందు శృంగారంలో పాల్గొనే జంటల్లో అధిక జంటలు పెళ్లయిన తర్వాత విడాకులు తీసుకునే సందర్భాలు అధికంగా ఉంటాయని చెపుతున్నారు. 
 
అదేవిధంగా పెళ్లి తర్వాత మాత్రమే పాల్గొనే జంటల్లో విడాకుల శాతం చాలా తక్కువగా ఉన్నట్లు తమ పరిశోధనలో తేలిందని వెల్లడించారు. కనుక పెళ్లికి ముందు శృంగారం వల్ల సమస్యలు ఉత్పన్నమవుతాయి. అతడు ఎంత బతిమాలినప్పటికీ పెళ్లికి ముందే ఆ కార్యక్రమాన్ని ముగించే దిశగా అడుగులు వేయరాదన్నది పరిశోధకుల మాట.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments