Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా మాజీ ప్రేమికుడు సహోద్యోగుడిగా వచ్చాడు... నాకేంటి ఈ కొత్త సమస్య... ఎలా డీల్ చేయాలి...?

కాలేజీలో చదువుకునే టైంలో అతడు నా ప్రేమికుడు. మేమిద్దరం సుమారు మూడేళ్లపాటు డీప్ లవ్‌లో పడిపోయాం. ఆ తర్వాత మనస్పర్థలు వచ్చి ఎవరికివారు విడిపోయాం. ఆ తర్వాత అతడు ఎటెళ్లాడో నాకు తెలియదు. నాకు పేరున్న సాఫ్ట

Webdunia
శుక్రవారం, 27 మే 2016 (13:16 IST)
కాలేజీలో చదువుకునే టైంలో అతడు నా ప్రేమికుడు. మేమిద్దరం సుమారు మూడేళ్లపాటు డీప్ లవ్‌లో పడిపోయాం. ఆ తర్వాత మనస్పర్థలు వచ్చి ఎవరికివారు విడిపోయాం. ఆ తర్వాత అతడు ఎటెళ్లాడో నాకు తెలియదు. నాకు పేరున్న సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. మూడేళ్లుగా చేస్తున్నాను. ఇప్పుడు నాకు షాకింగ్ న్యూస్ ఏంటంటే... వేరే కంపెనీలో పనిచేస్తూ నేను పనిచేస్తున్న కంపెనీలోకే వచ్చి చేరాడు నా మాజీ లవర్. అతడిని చూసిన దగ్గర్నుంచి పని మీద మనసును లగ్నం చేయలేకపోతున్నాను.


అతడు మాత్రం చిరునవ్వు నవ్వుతూ ఉన్నాడు. ఇప్పటివరకూ మేమిద్దరం కలిసి మాట్లాడుకున్నది లేదు. అతడితో ఏదైనా పని ఉంటే, కాగితంపై రాసి ఉంచి టేబుల్ పైన పెట్టేసి వచ్చేస్తున్నా. అతడు కూడా ఆ ఫైల్ పూర్తి చేసి పనివాళ్లతో పంపిస్తున్నాడు. నాకేంటి ఈ కొత్త సమస్య... ఎలా డీల్ చేయాలో తెలియడంలేదు.
 
ఇలాంటి సమస్య నూటికో కోటికో అన్నట్లు... చాలా అరుదుగా కొద్దిమందికి ఎదురవుతుంది. బ్రేకప్ తర్వాత ఎవరిదారిన వారు వెళ్లిపోతారు. కానీ కొద్దిమంది మాత్రం ఇలా తిరిగి ఎదురుపడే పరిస్థితి వస్తుంది. ప్రస్తుతం మీరు అవలంభిస్తున్న మార్గాన్నే అనుసరించండి. పాత జ్ఞాపకాలను మళ్లీ గుర్తు చేసుకుని అతడితో చర్చలు పెట్టుకోవద్దు. జస్ట్... సహ ఉద్యోగుడిగా మాత్రమే చూడండి. కొన్నాళ్లు పోతే మామూలుగా ఉంటుంది. దీన్ని గురించి పెద్దగా ఆలోచన చేయవద్దు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments