ఆదివారం నాడు సూర్యారాధన చేస్తే?

Webdunia
శనివారం, 11 ఏప్రియల్ 2020 (21:16 IST)
ఆదివారాన్ని ఉత్తరాదిలో రవి వారం అని పిలుస్తుంటారు. రవి అంటే సూర్యుడు అని అర్థం. కనుక ఆదివారం నాడు ఆదిత్యుడికి ఆరాధన చేస్తే ఆయన అనుగ్రహం కలుగుతుంది. సూర్యుని అనుగ్రహం లేకపోతే కోరిన విద్య లభించదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. 
 
జనకమహా రాజు గురువు యాజ్ఞవల్య్కుడు సూర్యుని అశుభ దృష్టి వల్ల వేదవిద్యను అభ్యసించలేకపోయాడు. అందువల్ల తపస్సు చేసి సూర్యుని శుభదృష్టి వల్ల సరస్వతిదేవి అనుగ్రహంతో శాస్త్రజ్ఞానం పొంది, యాజ్ఞవల్య్కస్మృతిని అందించాడు. 
 
అందుకే నవగ్రహాల్లో మొట్టమొదటైన సూర్యుడిని ఆరాధన చేయాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. ఆదివారం నాడు మాత్రమే కాకుండా ప్రతిరోజూ ఉదయం వేళ ''జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం'' అనే మంత్రాన్ని జపిస్తే సూర్యానుగ్రహం కలుగుతుంది. 
 
సూర్యుని అనుగ్రహం కోసం మాణిక్యాన్ని ధరించాలి. గోధుమలను, ఎర్రని వస్త్రాన్ని దానం చేయాలి. పాయసం నివేదించాలి. సూర్యాష్టకం లేదా ఆదిత్యహృదయం పఠించాలని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వెనిజులా వెన్ను విరిచిన ఉచిత పథకాలు, ప్రజలకు ఉచితాలు ఇచ్చి సర్వనాశనం

స్థానిక ఎన్నికల్లో కూడా ఏపీ ప్రజాస్వామ్యం ఖూనీ చేయబడుతోంది.. జగన్ ఫైర్

ఈ ఏడాది 51 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించాలి.. నాదెండ్ల మనోహర్

APSRTC: సంక్రాంతి పండుగ కోసం 8,432 ప్రత్యేక బస్సులు : ఏపీఎస్సార్టీసీ

ఇక్కడే.. మీ కోసం ఎదురు చూస్తున్నా.. ట్రంప్‌‍కు కొలంబియా అధ్యక్షుడు సవాల్

అన్నీ చూడండి

లేటెస్ట్

04-01-2026 ఆదివారం ఫలితాలు - మొండి బాకీలు వసూలవుతాయి.. ఖర్చులు సంతృప్తికరం...

సంక్రాంతి గీతల ముగ్గులు- రథం ముగ్గు

03-01-2026 శనివారం ఫలితాలు - ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు...

Betel Leaf: కలలో తమలపాకులు కనిపిస్తే.. ఫలితం ఏంటో తెలుసా?

Heavy Rush: వైకుంఠ ద్వార దర్శనం.. తిరుమలలో పోటెత్తిన జనం

తర్వాతి కథనం
Show comments