Webdunia - Bharat's app for daily news and videos

Install App

13-10-2019 నుంచి 19-10-2019 వరకు మీ వార రాశి ఫలితాలు

Webdunia
శనివారం, 12 అక్టోబరు 2019 (14:34 IST)
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
ఈ వారం ఒత్తిడి, శ్రమ అధికం. ఆర్థికలావాదేవీలతో తీరిక ఉండదు. సంప్రదింపులకు అనుకూలం. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. ఓర్పుతో వ్యవహరించాలి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. చెల్లింపుల్లో మెళుకువ వహించండి. కావలసిన పత్రాలు కనిపించవు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటంకాలను దీటుగా ఎదుర్కుంటారు. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు. వృత్తుల వారికి సామాన్యం. సన్మాన, సాహిత్య సభల్లో పాల్గొంటారు.
 
వృషభం: కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు.
గృహమార్పు కలిసివస్తుంది. పెట్టుబడులపై దృష్టి పెడతారు. పెద్దమొత్తం ధనసాయం తగదు. మీ ఇష్టాయిష్టాలను సున్నితంగా వ్యక్తం చేయండి. అనుకున్నది సాధిస్తారు. పరిచయాలు బలపడతాయి. ఉల్లాసంగా గడుపుతారు. ఖర్చులు అదుపులో ఉండవు. విలాసాలకు వ్యయం చేస్తారు. నోటీసులు అందుతాయి. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. మొండిగా పనులు పూర్తి చేస్తారు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. మీ జోక్యం అనివార్యం. సన్నిహితులకు చక్కని సలహాలిస్తారు. ఉద్యోగస్తులకు శుభయోగం. అధికారుల ప్రశంసలందుకుంటారు. నిరుద్యోగులకు ఉపాథి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. వాణిజ్య ఒప్పందాలకు అనుకూలం. వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి.
 
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు. 
కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఖర్చులు సామాన్యం. పొదుపు పథకాలు లభిస్తాయి. శనివారం నాడు అనవసర జోక్యం తగదు. విలువైన వస్తువులు మరమ్మత్తుకు గురవుతాయి. పత్రాల రెన్యువల్‌‌‌లో ఏకాగ్రత వహించండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. వివాహ యత్నాలు నిరుత్సాహపరుస్తాయి. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. సలహాలు, సాయం ఆశించవద్దు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. సంతానం కదలికలపై దృష్టి సారించండి. చెప్పుడు మాటలు పట్టించుకోవద్దు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. హోల్‌‌సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. ప్రయాణం తలపెడతారు.
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష.
ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దైవదీక్షలు స్వీకరిస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. నగదు, ఆభరణాలు జాగ్రత్త. గృహంలో స్తబ్ధత నెలకొంటుంది. ఆలోచనలు చికాకుపరుస్తాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. సమస్యలకు తాత్కాలిక పరిష్కారం లభిస్తుంది. మానసికంగా కుదుట పడతారు. ఆది, సోమ వారాల్లో పనులు మందకొడిగా సాగుతాయి. ఖర్చులు సామాన్యం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. అయినవారితో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలు దొర్లే ఆస్కారం ఉంది. అధికారులకు ధనప్రలోభం తగదు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. పూర్వ విద్యార్థులను కలుసుకుంటారు.
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం.
ఆర్థికంగా బాగుంటుంది. ఖర్చులు సామాన్యం. సమస్యలు సద్దుమణుగుతాయి. సన్నిహితులకు సాయం అందిస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. వ్యవహార దక్షతతో రాణిస్తారు. పదవుల స్వీకరణ అనుకూలం. గౌరవం పెరుగుతుంది. కుటుంబసౌఖ్యం, వాహనయోగం పొందుతారు. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. సోమ, మంగళ వారాల్లో ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. మీ నుంచి విషయ సేకరణకు యత్నిస్తారు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి.  సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. ఆశావహ దృక్పథంతో ఉద్యోగయత్నం సాగించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఉద్యోగస్తులకు సమయపాలన ప్రధానం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. కళాకారులకు ప్రోత్సాహకరం. సన్మాన, సంస్మరణ సభల్లో పాల్గొంటారు.
 
కన్యారాశి : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు. 
ఖర్చులు అదుపులో ఉండవు. ఆకస్మిక ఖర్చులుంటాయి. ధనం మితంగా వ్యయం చేయండి. సాయం చేసేందుకు అయినవారే వెనకాడుతారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. కుటుంబీకులు మీ అశక్తతను అర్థం చేసుకుంటారు. పట్టుదలతో ముందుకు సాగండి. విమర్శలు పట్టించుకోవద్దు. పనులు ముగింపు దశలో హడావుడిగా సాగుతాయి. బుధవారంనాడు ముఖ్యుల కలయిక సాధ్యపడదు. నోటీసులు, ఆహ్వానం అందుకుంటారు. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. వృత్తి ఉపాధి పథకాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. వ్యాపారాల్లో ఒడిదుడుకులెదురవుతాయి. బెట్టింగ్‌‌‌లకు పాల్పడవద్దు.
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు.
దుబారా ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. శ్రమాధిక్యత మినహా ఫలితం శూన్యం. మీ సమర్థత ఎదుటివారికి లభిస్తుంది. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. సన్నిహితులను కలుసుకుంటారు. గురు, శుక్ర వారాల్లో పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. సంప్రదింపులు వాయిదా పడతాయి. సంతానం విజయం ఉపశమనం కలిగిస్తుంది. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన అవసరం. పరిచయాలు బలపడతాయి. వ్యాపకాలు సృష్టించు కుంటారు. నిర్మాణాలు, మరమ్మతులు చురుకుగా సాగుతాయి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు.
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట.
ప్రేమానుబంధాలు బలపడతాయి. గృహంలో సందడి నెలకొంటుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. వాగ్ధాటితో నెట్టుకొస్తారు. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. శని, ఆది వారాల్లో పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం పట్ల అలక్ష్యం తగదు. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. సంతానానికి ఉన్నత విద్యావికాశం లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. పూర్వ విద్యార్థుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. సంతానం దూకుడు అదుపు చేయండి. వ్యాపారాల్లో లాభాలు. అనుభవం గడిస్తారు. ఉద్యోస్తులకు యూనియన్‌‌లో గుర్తింపు లభిస్తుంది. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం తగదు.
 
ధనస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. 
శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు అనుకూలం. ఖర్చులు విపరీతం. విలువైన వస్తువులు అమర్చుకుంటారు. రశీదులు, పత్రాలు జాగ్రత్త. వివాహయత్నం ఫలిస్తుంది. వేదికలు అన్వేషిస్తారు. గృహం సందడిగా ఉంటుంది. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. అనేక పనులతో సతమతమవుతారు. సోమ, మంగళ వారాల్లో అకాల భోజనం, విశ్రాంతి లోపం. ఆరోగ్యం పట్ల అలక్ష్యం తగదు. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. గత అనుభవాలు జ్ఞప్తికొస్తాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. భాగస్వామిక చర్చలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాల విస్తరణలకు అనుకూలం. ఉద్యోగస్తులకు శుభయోగం. అధికారులకు హోదా మార్పు, స్థానచలనం. వేడుకలకు హాజరవుతారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దీక్షలు స్వీకరిస్తారు.
 
మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు.
ఆదాయం బాగుంటుంది. రుణ సమస్యలు తొలుగుతాయి. మానసికంగా కుదుట పడతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ఆలయాలు, సేవా సంస్థలకు విరాళాలు అందిస్తారు. అనుకున్నది సాధిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. బాధ్యతలను విస్మరించవద్దు. బుధ, గురు వారాల్లో ప్రతి విషయం క్షణ్ణంగా తెలుసుకోవాలి. పరిచయం లేని వారితో జాగ్రత్త. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. పనులు సకాలంలో పూర్తికాగలవు. నిర్మాణాలు ఊపందుకుంటాయి. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. వ్యాపారాలు సామ్యాంగా సాగుతాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. 
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు.
ప్రతికూల పరిస్థితులెదురవుతాయి, పురోగతి లేక నిరుత్సాహం చెందుతారు. అకారణంగా మాటపడవలసి వస్తుంది. ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. పనులు మొండిగా పూర్తిచేస్తారు. శుక్ర, శని వారాల్లో ఆకస్మిక ఖర్చులుంటాయి. ధనం మితంగా వ్యయం చేయండి. కావలసిన వ్యక్తుల కలయిక వీలుపడదు. ఈ ఇబ్బందులు తాత్కాలికమే. త్వరలో శుభవార్తలు వింటారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. సంతానం కదలికలపై దృష్టి సారించాలి. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు అభ్యంతరాలెదురవుతాయి. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆశావహ దృక్పథంతో ఉద్యోగయత్నం సాగించండి. ఉద్యోగస్తులకు ఓర్పు ప్రధానం. ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. చిరువ్యాపారులకు ఆశాజనకం. జూదాలు, బెట్టింగ్‌‌‌లకు పాల్పడవద్దు.
 
మీనం: పూర్వాభాద్ర 4వ పాదం. ఉత్తరాభాద్ర, రేవతి.
దుబారా ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. ఆలోచనలు చికాకు పరుస్తాయి. పనుల ప్రారంభంలో ఆటంకాలెదుర్కుంటారు. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. మీపై శకునాల ప్రభావం అధికం. ఆది, సోమ వారాల్లో విమర్శలు, అభియోగాలు ఎదుర్కుంటారు. సన్నిహితుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఆహ్వానం అందుతుంది. పోగొట్టుకున్న వస్తువులు లభ్యమవుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. సంతానం వైఖరి విసుగు కలిగిస్తుంది. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు అనుకూలం. కాంట్రాక్టులు, ఏజెన్సీలు దక్కకపోవచ్చు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. నిరుద్యోగులకు ఉపాథి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. సభలు, సమావేశాల్లో ప్రముఖంగా పాల్గొంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీతో జగన్ మెడకు ఉచ్చు.. విచారణ ఖాయమేనా..?

పవన్ ప్రచారం ఫలించింది.. రేవంతన్న క్యాంపెయిన్ తప్పిపోయింది..

మోదీ నాయకత్వంపై ప్రజలకున్న నమ్మకమే గెలిపించింది.. బాబు, పవన్

పోసాని, శ్రీరెడ్డిలు పోయారు.. మా వారు తట్టుకుని నిలబడ్డారు.. నారా లోకేష్

చక్రం తిప్పిన పవర్ స్టార్.. ఆయన వల్లే గెలిచానన్న దేవేంద్ర బహిరంగ ప్రకటన (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

2025లో మిథునరాశి కెరీర్, వ్యాపారం ఎలా వుంటుందంటే? కష్టం ఫలిస్తుందా?

2025లో వృషభ రాశి కెరీర్, వ్యాపారం ఎలా వుంటుందంటే?

2025 మేషరాశి వారి కెరీర్, ఉద్యోగం, వ్యాపారం ఎలా వుంటుందంటే?

2025లో ఈ రెండు రాశులకు శనీశ్వరుడి యోగం..? కింగ్ అవుతారు..!

22-11-2024 శుక్రవారం వారం ఫలితాలు - దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది...

తర్వాతి కథనం
Show comments