Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

15-09-2019 నుంచి 21-09-2019 వరకు మీ వార రాశి ఫలితాలు.. (video)

webdunia
ఆదివారం, 15 సెప్టెంబరు 2019 (17:28 IST)
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
సమర్ధతను చాటుకుంటారు. అవకాశాలు కలిసివస్తాయి. ఖర్చులు సంతృప్తికరం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. పనుల సానుకూలతకు ఓర్పు ప్రధానం. గృహంలో స్తబ్ధత నెలకొంటుంది. పిల్లల చదువులపై దృష్టి పెట్టండి. సంప్రదింపులకు అనుకూలం. పెద్దల సలహా పాటించండి. ఒంటెద్దు పోకడ తగదు. దంపతుల మధ్య అవగాహన లోపం. ఆలోచనలు చికాకుపరుస్తాయి. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. పోగొట్టుకున్న వస్తువులు సంపాదిస్తారు. నిర్మాణాలు ఊపందుకుంటారు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. సంస్థల స్థాపనలకు అనుకూలం. ఉద్యోగస్తుల కృషి ఫలిస్తుంది. ప్రశంసలు అందుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు.
 
వృషభం: కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు.
ఈ వారం పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యవహార దక్షతతో రాణిస్తారు. మొండి బాకీలు వసూలవుతాయి. ఖర్చులు సామాన్యం. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు క్షేమం కాదు. పనులు హడావుడిగా సాగుతాయి. పదవులు, సభ్మత్వాలు స్వీకరిస్తారు. వ్యాపకాలు సృష్టించుకుంటారు. నగదు, పత్రాలు జాగ్రత్త. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. వేడుకులకు సన్నాహాలు సాగిస్తారు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. గృహమార్పు కలిసివస్తుంది. ఏజెన్సీలు, కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వృత్తుల వారికి సామాన్యం. ఉపాథి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ఉద్యోగస్తులకు పనిభారం. కంప్యూటర్ ప్రింటింగ్ రంగాల వారికి ఆదాయాభివృద్ధి. 
 
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు. 
మీ వైఖరిలో మార్పు వస్తుంది. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. అంచనాలు ఫలిసాయి. కుటుంబ విషయాలపై శ్రద్ధ వహిస్తారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఖర్చులు సామాన్యం. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. సహాయం, సలహాలు ఆశించవద్దు. అపరిచితులు మోసగించేందుకు యత్నిస్తారు. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. ఆది, సోమ వారాల్లో అనుకోని సంఘటనలెదురవుతాయి. ఆత్మీయుల కలయికతో కుదుటపడతారు. సంతానం విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది. సోదరులతో సత్సబంధాలు నెలకొంటాయి. స్థిరాస్తి కొనుగోలు దిశగా ఆలోచిస్తారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఆరోగ్యం సంతృప్తికరం. వృత్తి వ్యాపారాల్లో పురోభివృద్ధి, అనుభవం గడిస్తారు. చిరువ్యాపారులకు ఆశాజనకం. దైవకార్య సమావేశాల్లో పాల్గొంటారు.
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష.
ఉత్సాహంగా గడుపుతారు. ధనయోగం ఉంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. మాటతీరుతో ఆకట్టుకుంటారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. వ్యాపకాలు అధికమవుతాయి. మంగళ, బుధ వారాల్లో బాధ్యతగా వ్యవహరిచాలి. అనవసర జోక్యం తగదు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యం సంతృప్తికరం. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలుగుతుంది. సేవా సంస్థలకు సాయం అందిస్తారు. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. పత్రాల రెన్కువల్‌లో మెళుకువ వహించండి. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. సంతానం దూకుడు అదుపు చేయండి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నిర్మాణాలు చేపడతారు. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు.
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం.
లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం. పట్టుదలతో ముందుకు సాగండి. దుబారా ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. గురువారం నాడు ప్రముఖుల కలయిక అనుకూలించది. మీ శ్రీమతి వైఖరి చికాకు పరుస్తుంది. ఆలోచనులు పలు విధాలుగా ఉంటాయి. సన్నిహితుల కలయికతో కుదుటపడతారు. పిల్లల భవిష్యత్తుపై శ్రద్ధ అవసరం. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. స్థిరాస్తి క్రయ విక్రయంలో పునరాలోచన శ్రేయస్కరం. పెద్దల సలహా పాటించండి. పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొంటారు. గత సంఘటనలు అనుభూతిస్తాయి. పత్రాలు, నోటీసులు అందుకుంటారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. సహోద్యోగులతో జాగ్రత్త. వ్యాపారాలు ఊపందుకుంటాయి. చిరువ్యాపారులకు సామాన్యం. సంస్థల స్థాపనలకు అనుమతులు మంజూరవుతాయి.
 
కన్యారాశి : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు. 
ఆర్థికస్థితి సామాన్యం. పురోగతి లేక నిరుత్సాహం చెందుతారు. రుణ ఒత్తిడి అధికం. ఆలోచనలు చికాకుపరుస్తాయి. సన్నిహితులను కలుసుకుంటారు. శుక్రవారం నాడు పనులు సాగవు. ఆప్తుల సాయం చేస్తారు. ఒక సమస్యకు తాత్కాలిక పరిష్కారం లభిస్తుంది. కుటుంబ విషయాల పట్ల శ్రద్ధ అవసరం. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. అపరిచితులతో జాగ్రత్త. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. పత్రాల రెన్యువల్‌లో అశ్రద్ధ తగదు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ధనప్రలోభం, ఒత్తిళ్లకు లొంగవద్దు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రింటింగ్ రంగాల వారికి ఆదాయాభివృద్ధి.
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు.
హామీలు నిలబెట్టుకుంటారు. సన్నిహితులకు మీ పై ప్రత్యేకభిమానం కలుగుతుంది. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. మీ జోక్యంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. పనులు చురుకుగా సాగుతాయి. ఖర్చులు విపరీతం. శని, ఆది వారాల్లో ఓగి ధనం డ్రా చేసేటపుడు జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. స్థిరాస్తి కొనుగోలు దిశగా ఆలోచిస్తారు. సంతానం దూకుడు అదుపు చేయండి. అవివాహితులు శుభవార్త వింటారు. పొదుపు పథకాలు లభిస్తాయి. పెట్టుబడుల సమాచారం సేకరిస్తారు. నిర్మాణాలు ఊపందుకుంటాయి. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలుగుతుంది. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. చిరువ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగస్తులకు పదోన్నతి, ధనలాభం. సన్మాన, సాహిత్య సభల్లో పాల్గొంటారు. కళాకారులకు ప్రోత్సాహకరం.
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట.
మనోధైర్యంతో ముందుకు సాగుతారు. అనుకూల పరిస్థితులున్నాయి. ఖర్చులు విపరీతం. అవసరాలకు ధనం సర్దుబాటవుతుంది. ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు. పనులు అనుకున్న విధంగా పూర్తి కాగలవు. పత్రాలు, వస్తువులు జాగ్రత్త. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. ఆరోగ్యం జాగ్రత్త. సోమ, మంగళ వారాల్లో అనవసర జోక్యం తగదు. కొన్ని విషయాలు చూసీచూడనట్టు వదిలేయాలి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. పెట్టుబడులకు అనుకూలం. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. ఆధ్యాత్మిక చింత పెరుగుతుంది.
 
ధనస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. 
ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. రుణ సమస్యలు తొలుగుతాయి. తాకట్టు విడిపించుకుంటారు. మనస్సు కుదుటపడుతుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. పనులు చురుకుగా సాగుతాయి. ఆరోగ్యం మందగిస్తుంది. వైద్య సేవలు అవసరం. బుధవారం నాడు ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. అవకాశాలు కలిసివస్తాయి. పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. ప్రతర్థులతో జాగ్రత్త. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. గృహం సందడిగా ఉంటుంది. సంతానం అత్యుత్సాహం ఇబ్బంది కలిగిస్తుంది. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగాలి. వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. ఆటంకాలను దీటుగా ఎదుర్కుంటారు. మీ పథకాలు సత్ఫలితాలిస్తాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి.
 
మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు.
సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. అభియోగాలు, విమర్శలు ఎదుర్కుంటారు. బంధుమిత్రులతో విభేదాలు తలెత్తుతాయి. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. గురు, శుక్ర వారాల్లో ఖర్చులు విపరీతం. సాయం చేసేందుకు అయిన వారే వెనుకాడుతారు. అవసరాలు అతికష్టంమ్మీద నెరవేరుతాయి. కావలసిన వ్యక్తుల కలయిక వీలుపడుదు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. చెప్పుడు మాటలు పట్టించుకోవద్దు. గృహమార్పు ఫలితం నిదానంగా కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. అధికారులకు ఒత్తిడి, పనిభారం. పరిచయం లేని వారితో జాగ్రత్త. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు.
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు.
కార్యానుకూలతకు మరింత శ్రమించాలి. సహాయం ఆశించవద్దు. పట్టుదలతో యత్నాలు సాగించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఖర్చులు అంచనాలను మించుతాయి. పొదుపు ధనం ముందుగానే గ్రహిస్తారు. బంధువుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. శని వారం నాడు కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. పత్రాల రెన్యువల్‌లో మెలకువ వహించండి. గృహమార్పు కలిసివస్తుంది. సంస్థల స్థాపనలకు అనుమతులు మంజూరవుతాయి. చిన్నతరహా పరిశ్రమాల వారికి ప్రోత్సాహకరం. నిర్మాణాలు వేగవంతమవుతాయి. వ్యాపారాల్లో ఆటుపోట్లు తప్పవు. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులు తప్పిదాలను సరిదిద్దుకుంటారు. ప్రయాణం తలపెడతారు.
 
మీనం: పూర్వాభాద్ర 4వ పాదం. ఉత్తరాభాద్ర, రేవతి.
ఆదాయం బాగుంటుంది. ఖర్చులు అధికం, ధనానికి ఇబ్బంది ఉండదు. పరిచయస్తులు ధనసహాయం అర్ధిస్తారు. పెద్దమొత్తం సాయం తగదు. మీ ఇష్టాయిష్టాలను సున్నితంగా వ్యక్తం చేయండి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. ఆది, సోమ వారాల్లో పనులు మొండిగా పూర్తి చేస్తారు. ప్రముఖుల సందర్శనం కోసం పడిగాపులు తప్పవు. సంతానం విజయం సంతృప్తినిస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలొస్తాయి. ప్రియతముల ఆరోగ్యం కుదుటపడుతుంది. వేడుకులకు సన్నాహాలు సాగిస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వృత్తి, ఉపాథి పథకాల్లో నిలదొక్కుకుంటారు. రిప్రజెంటేటివ్‌లకు మార్పులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు ఊపందుకుంటారు. జూదాల జోలికి పోవద్దు.

Share this Story:

Follow Webdunia Hindi

తర్వాతి కథనం

15-09-2019- ఆదివారం మీ రాశి ఫలితాలు..