Webdunia - Bharat's app for daily news and videos

Install App

20-10-2019 నుంచి 26-10-2019 వార రాశిఫలాలు

Webdunia
శనివారం, 19 అక్టోబరు 2019 (16:38 IST)
మేషం : అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం. 
వ్యవహారానుకూలత అంతంతమాత్రమే. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. మీ ఇష్టాయిష్టాలను సున్నితంగా వ్యక్తం చేయండి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. నమ్మకస్తులే తప్పుదారి పట్టించే అవకాశం ఉంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడుతారు. పరిచయాలు బలపడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. గృహంలో స్తబ్ధత నెలకొంటుంది. వాయిదాపడిన పనులు పూర్తి చేస్తారు. వేడుకల్లో పాల్గొంటారు. బంధువుల ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. సంతానం కదలికలపై దృష్టిపెట్టండి. బుధవారం నాడు అనుకోని సంఘటనలు ఎదురువుతాయి. వ్యాపారాలు, సామాన్యంగా సాగుతాయి. హోల్‌సేల్ వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. 
 
వృషభం : కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు. 
ఖర్చులు అధికం. ప్రయోజనకరం. కొంతమొత్తం ధనం అందుతుంది. పనులతో సతమతమవుతారు. బాధ్యతలు అప్పగించవద్దు. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలుగుతుంది. దీక్షలు స్వీకరిస్తారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. సంతోషకరమైన వార్తలు వింటారు. శ్రమ ఫలిస్తుంది. మానసికంగా కుదుటపడతారు. గురు, శుక్రవారాల్లో నగదు, పత్రాలు జాగ్రత్త. దంపతుల మధ్య అవగాహన లోపం. గృహంలో మార్పులు చేర్పులకు అనుకూలం. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. సాధ్యంకాని హామీలివ్వొద్దు. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. ఉద్యోగస్తులకు యూనియన్‌లో గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. కోర్టు వాయిదాలకు హాజరవుతారు. ద్విచక్రవాహనంపై దూర ప్రయాణం తగదు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు. ఆర్థ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు. 
గృహం సందడిగా ఉంటుంది. మీ జోక్యం అనివార్యం. ఆత్మీయులకు చక్కని సలహాలిస్తారు. ప్రతి విషయంలోనూ మీదే పైచేయి. మీ మాటను గౌరవిస్తారు. శనివారం నాడు ఖర్చులు విపరీతం. విలాసాలకు వ్యయం చేస్తారు. గుట్టుగా యత్నాలు సాగించండి. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఇతరుల విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి తగదు. సంతానం దూకుడు అదుపు చేయండి. ఆరోగ్యం సంతృప్తికరం. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. ఒక సంబంధం ఆలోచింపజేస్తుంది. నష్టాలను భర్తీ చేసుకుంటారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ఆస్తి వివాదాలు, కోర్టు వ్యవహారాలు కొలిక్కివస్తాయి. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష 
సంప్రదింపులకు అనుకూలం. మీ ఇష్టాయిష్టాలను ఖచ్చితంగా తెలియజేయండి. మొహమ్మాటాలు, ప్రలోభాలకు లొంగవద్దు. బాధ్యతగా వ్యవహరించాలి. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. రుణ సమస్యలు కొలిక్కివస్తాయి. ఖర్చులు సామాన్యం. గృహమార్పు కలిసివస్తుంది. వాయిదాపడిన పనులు పూర్తి చేస్తారు. పత్రాలు, ఆహ్వానం అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఆది, సోమవారాల్లో ప్రముఖుల సందర్శనీయం వీలుపడదు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. చిరువ్యాపారులకు ఆశాజనకం. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం. 
పరిస్థితులు అనుకూలిస్తాయి. ధనలాబం, వాహనయోగం ఉన్నాయి. అసాధ్యమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఖర్చులు సామాన్యం. ఆప్తులకు సాయం అందిస్తారు. పొదుపు పథకాలపై దృష్టిపెడతారు. వ్యాపకాలు సృష్టించుకుంటారు. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. నగదు, ఆభరణాలు జాగ్రత్త. మంగళ, బుధవారాల్లో బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ముఖ్యుల కలయిక వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. సంప్రదింపులు అనుకూలం. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. నిర్మాణాలు ఊపందుకుంటాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. క్రీడా, కళాకారులకు ప్రోత్సాహకరం. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు. 
ఊహించిన ఖర్చులే ఉంటాయి. రావలసిన ధనాన్ని లౌక్యంగా వసూలు చేసుకోవాలి. వ్యవహారానుకూలత అంతంత మాత్రమే. యత్నాలు కొనసాగించండి. సహాయం ఆశించవద్దు. స్వయంకృషితోనే రాణిస్తారు. గురు, శుక్రవారాల్లో పనులు ముగింపు దశలో హడావుడిగా సాగుతాయి. ప్రముఖుల కలయిక వల్ల ఏమంత ప్రయోజనకరం ఉండదు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. ఆధ్యాత్మిక పెంపొందుతుంది. దైవదీక్షలు స్వీకరిస్తారు. కొత్త పరియాలేర్పడతాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. అధికారుల తీరును గమనించి మెలగండి. నిరుద్యోగులకు కృషి ఫలిస్తుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. సరకు నిల్వలో జాగ్రత్త. హోల్‌సేల్ వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. ప్రయాణం తలపెడతారు. జూదాల జోలికి పోవద్దు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు. 
ఖర్చులు తగ్గించుకుంటారు. చెల్లింపులో మెలకువ వహించండి. సహాయం ఆశించవద్దు. అయినవారే మీ వైఖరిని తప్పుపడతారు. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. ఓర్పుతో వ్యవహరించండి. పంతాలకు పోవద్దు. పట్టుదలతో యత్నాలు సాగించండి. శనివారంనాడు పనులు మొండిగా పూర్తిచేస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. గృహమార్పు కలిసివస్తుంది. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. పత్రాలు, ఆహ్వానం అందుకుంటారు. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. పెట్టుబడులకు అనుకూలించవు. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. ఆధ్యాత్మిక పెంపొందుతుంది. చిన్ననాటి పరియస్తులు తారసపడుతారు. బెట్టింగ్‌లకు పాల్పడవద్దు. 
 
వృశ్చికం : విశాక 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 
ఉల్లాసంగా గడుపుతారు. పదవుల స్వీకరణకు అనుకూలం. వ్యతిరేకులను ఆకట్టుకుంటారు. హమీలను నిలబెట్టుకుంటారు. గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి. పనుల సకాలంలో పూర్తిచేస్తారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. పత్రాలు కనిపించక సతమతమవుతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. ఆది, సోమవారాల్లో ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. అయినవారితో సంప్రదింపులు జరుపుతారు. మీ శ్రీమతి  సలహా పాటించండి. వృత్తి వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ప్రశంసలు అందుకుంటారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. 
గృహం ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పెట్టుబడులకు తుణం కాదు. పరిస్థితులు అనుకూలిస్తాయి. కష్టానికి ప్రతిఫలం అందుతుంది. కొన్ని సమస్యలు నుంచి బయటపడతారు. సంప్రదింపులకు అనుకూలం. మంగళవారం నాడు వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. సలహాలు, సాయం ఆశించవద్దు. నమ్మకస్తులే మోసగించేందుకు యత్నిస్తారు. పెద్దల సలహా పాటించండి. భేషజాలకు పోవద్దు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. పనులు హడావుడిగా సాగుతాయి. కావలసిన వ్యక్తుల కలయిక వీలుపడదు. ఆరోగ్యం సంతృప్తికరం. దీక్షలు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. వ్యాపారాలకు అనుమతులు మంజూరవుతాయి. సాంకేతిక రంగాల వారికి ఆశాజనకం. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. 
 
మకరం : ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు. 
పరిచయాలు బలపడతాయి. గృహం సందడిగా ఉంటుంది. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. ఒక ఆహ్వానం ఆలోచింపజేస్తుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఖర్చులు పెద్దగా ఉండవు. పొదుపు పథకాలపై దృష్టిపెడతారు. పెద్దమొత్తం సాయం తగదు. మీ ఇష్టాయిష్టాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. ఎవరినీ నొప్పించవద్దు. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. ఆత్మీయులకు చక్కని సలహాలిస్తారు. బుధ, గురువారాల్లో పనుల ముగింపు దశలో మందకొడిగా సాగుతాయి. ప్రముఖుల సందర్శనం కోసం పడిగాలు తప్పవు. కార్యక్రమాలు వాయిదాపడతాయి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. హోల్‌సేల్ వ్యాపారులకు కొత్త సమస్యలెదురవుతాయి. ఉద్యోగస్తులకు అనుకూల ఫలితాలున్నాయి. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. క్రీడాకారులకు ప్రోత్సాహకరం. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు. శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు. 
ఈ వారం సంప్రదింపులకు అనుకూలం. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. సన్నిహితుల సలహా పాటించండి. మీ ఆలోచనల్లో మార్పు వస్తుంది. పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి. ఒక సమస్యకు పరిష్కారం లభిస్తుంది. మానసికంగా కుదుటపడతారు. పనుల హడావుడిగా సాగుతాయి. ఖర్చులు విపరీతం. అవసరాలు అతికష్టంమ్మీద నెరవేరుతాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఏజెన్సీలను విశ్వసించవద్దు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. అధికారులకు ధనప్రలోభం తగదు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. వివాదాలు, కోర్టు వ్యవహారాలు కొలిక్కివస్తాయి. 
 
మీనం : పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
కార్యసాధనకు మరింత శ్రమించాలి. యత్నాలు విరవించుకోవద్దు. వ్యవహారాల్లో ప్రతికూలతలెదురవుతాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. ప్రతి చిన్న విషయం ఆందోళన కలిగిస్తుంది. ఆప్తుల కలయికతో కుదుటపడతారు. పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. ధనం మితంగా వ్యయం చేయండి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ అవసరం. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. అయినవారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలించవు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. వృత్తుల వారికి సామాన్యం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. చిరు వ్యాపారులకు ఆశాజనకం. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణం సజావుగా సాగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణలో 11 హెచ్ఎంపీవీ కేసులు.. 2024 డిసెంబరులోనే నమోదు

ఇస్రో కొత్త చైర్మన్‌గా డాక్టర్ వి.నారాయణన్

ఐదుగురు మావోయిస్టులను చంపేసిన నక్సలైట్లు!

Coffee: ఉదయాన్నే కాఫీ తాగితే ఆరోగ్యానికి మేలు చేసినవారవుతారా?

YS Abhishek Reddy: జగన్ బంధువు వైఎస్ అభిషేక్ రెడ్డి కన్నుమూత

అన్నీ చూడండి

లేటెస్ట్

Durga Ashtami Vrat: జనవరి 7, 2025 : అష్టమి తిథి నేడు.. అదీ మంగళవారం.. దుర్గాష్టమి.. ఇలా పూజ చేస్తే?

07-01-2025 మంగళవారం దినఫలితాలు : స్వయంకృషితో లక్ష్యం సాధిస్తారు...

Guru Gobind Singh Jayanti 2025: గురు గోవింద్ సింగ్ జయంతి.. కోట్స్ ఇవే

06-01-2025 సోమవారం దినఫలితాలు : ప్రలోభాలకు లొంగవద్దు...

Daily Horoscope: 05-01-2025 ఆదివారం దినఫలితాలు-రుణసమస్య నుంచి విముక్తులవుతారు..

తర్వాతి కథనం
Show comments