Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవంబరు 11 నుంచి 25, 2017 వరకూ మీ వార రాశి ఫలితాలు(వీడియో)

కర్కాటకంలో రాహువు, కన్యలో కుజుడు, తులలో గురు, శుక్రులు, వృశ్చికంలో రవి, బుధులు, ధనస్సులో శని, మకరంలో కేతువు. వృశ్చిక, ధనస్సు, మకర, కుంభంలో చంద్రుడు. 24 సుబ్రహ్మణ్య షష్ఠి. ముఖ్యమైన పనులకు పంచమి, గురువారం శుభదాయకం. 24న బుధుడు ధనుర్ ప్రవేశం.

Webdunia
శనివారం, 18 నవంబరు 2017 (20:21 IST)
కర్కాటకంలో రాహువు, కన్యలో కుజుడు, తులలో గురు, శుక్రులు, వృశ్చికంలో రవి, బుధులు, ధనస్సులో శని, మకరంలో కేతువు. వృశ్చిక, ధనస్సు, మకర, కుంభంలో చంద్రుడు. 24 సుబ్రహ్మణ్య షష్ఠి. ముఖ్యమైన పనులకు పంచమి, గురువారం శుభదాయకం. 24న బుధుడు ధనుర్ ప్రవేశం.
 
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
గృహమార్పు కలిసివస్తుంది. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. ఆర్థిక లావాదేవీలు ప్రోత్సాహాన్నిస్తాయి. శుభవార్తలు వింటారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడుతాయి. ఖర్చులు అంచనాలను మించుతాయి. విలాసాలకు బాగా వ్యయం చేస్తారు. ఆది, సోమవారాల్లో పనుల సానుకూలతకు మరింతగా శ్రమించాలి. ఆరోగ్యం సంతృప్తికరం. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. వ్యాఖ్యలు, విమర్శలు పట్టించుకోవద్దు. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. 
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2పాదాలు  
శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. ఖర్చులు భారమనిపించవు. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనులు సానుకూలమవుతాయి. పెట్టుబడులకు అనుకూలం. ఆలోచనలు ఫలిస్తాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. విలువైన వస్తువులు జాగ్రత్త. మంగళ, బుధవారాల్లో బాధ్యతలు అప్పగించవద్దు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పూర్వ విద్యార్థులు, గురువులను కలుసుకుంటారు. మీ మాటతీరు ఆకట్టుకుంటుంది. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి కలుగుతుంది. దైవదీక్షలు స్వీకరిస్తారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలు, ఆటంకాల నుంచి బయటపడతారు. వైద్య, సేవ, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. ఆశావహ దృక్పథంతో ఉద్యోగయత్నం సాగించండి. ప్రకటనలు, దళారులను విశ్వసించవద్దు.
 
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు  
కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. బంధుత్వాలు, పరిచయాలు పెంపొందుతాయి. పదవుల స్వీకరణకు అనుకూలం. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. ఆది, గురువారాల్లో లౌక్యంగా పనులు చక్కబెట్టుకోవాలి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. కొన్ని విషయాలు పట్టించుకోకపోవడం మంచిది. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. గృహ నిర్మాణాలు వేగవంతమవుతాయి. శుభకార్యాలకు హాజరవుతారు. పెట్టుబడులు, పొదుపు పథకాలకు అనుకూలం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. భాగస్వామిక చర్చలు కొలిక్కి వస్తాయి. ఉద్యోగస్తులకు పదవీయోగం, ధనలాభం. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. 
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష  
వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. ఆత్మీయుల ఆహ్వానం సంతోషపరుస్తుంది. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఒక వ్యవహారంలో ధనం అందుతుంది. రుణ బాధలు తొలగుతాయి. పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. మంగళ, శనివారాల్లో స్వల్ప అస్వస్థతకు గురవుతారు. విశ్రాంతి అవసరం. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు అనుకూలం. నగదు, ఆభరణాలు జాగ్రత్త. ప్రముఖులతో పరిచయాలు, వ్యాపకాలు పెంపొందుతాయి. ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. అధికారులకు హోదా మార్పు. స్థానచలనం. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వ్యాపారాల్లో నిలదొక్కుకుంటారు. సాంకేతిక రంగాల వారికి ప్రోత్సాహకరం. 
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం  
ఖర్చులు అధికం, ప్రయోజనకరం. అసాధ్యమనుకున్న పనులు సానుకూలమవుతాయి. వేడుకలు ఘనంగా చేస్తారు. బంధువుల రాక సంతృప్తినిస్తుంది. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. అభియోగాలు, నిందలు తొలగిపోగలవు. మానసికంగా కుదుటపడతారు. ఇతరుల బాధ్యతలు చేపట్టి ఇబ్బందులు ఎదుర్కొంటారు. వ్యవహార ఒప్పందాల్లో మెలకు వహించండి. తొందరపాటు నిర్ణయాలు తగవు. మీ శ్రీమతి సలహా పాటించండి. గురు, శుక్రవారాల్లో పరిచయం లేని వారితో జాగ్రత్త. సంతానం విజయం సంతోషాన్నిస్తుంది. ఆత్మీయులకు ముఖ్య సమాచారం అందిస్తారు. దైవదీక్షలు, పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. వ్యాపారాల్లో పురోభివృద్ధి, అనుభవం గడిస్తారు. వ్యాపారాల విస్తరణలు, షాపుల స్థల మార్పునకు అనుకూలం. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. కోర్టు వాయిదాలకు హాజరవుతారు.
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు  
గృహంలో సందడి నెలకొంటుంది. పనులు హడావుడిగా సాగుతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ఆర్థిక లావాదేవీలు, వ్యవహారాలపై పట్టు సాధిస్తారు. ప్రతిభకు గుర్తింపు, అవకాశాలు కలిసివస్తాయి. ధనలాభం, పదవీయోగం, గౌరవ మర్యాదలు పొందుతారు. బాధ్యతలు పెరుగుతాయి. సాధ్యం కానీ హామీలివ్వవద్దు. శనివారం నాడు మీ ఇష్టాయిష్టాలను సున్నితంగా వ్యక్తం చేయండి. ఎవరినీ నొప్పించవద్దు. టెండర్లు, ఏజెన్సీలు దక్కించుకుంటారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. మీ సాయంతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. వ్యాపారాభివృద్ధికి పథకాలు, ప్రణాళికలు రూపొందిస్తారు. చిరు వ్యాపారులకు ఆశాజనకం. విద్యార్థులు పోటీల్లో రాణిస్తారు. తీర్థయాత్రలు, వేడుకలు సన్నాహాలు సాగిస్తారు.
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు  
కొత్త పరిచయాలేర్పడతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. సలహాలు, సహాయం ఆశించవద్దు. ఎదుటివారి గురించి ఉన్నతంగా ఆలోచిస్తారు. వారే మిమ్ములను అర్థం చేసుకోరు. మీ గౌరవానికి ఏమాత్రం భంగం కలుగదు. ఖర్చులు సామాన్యం. ఆత్మీయులకు సాయం అందిస్తారు. సంప్రదింపులు వాయిదా పడతాయి. మొక్కుబడిగా పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆందోళన కలిగించే సంఘటనలు ఎదురవుతాయి. ధైర్యంగా ముందుకు సాగుతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆకర్షణీయమైన పథకాలు అమలు చేస్తారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు.
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట
అవకాశాలు అందినట్టే చేజారిపోతుంటాయి. మనోధైర్యంతో యత్నాలు సాగించండి. ఆరోగ్యం  సంతృప్తికరం దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. రాబోయే ఆదాయానికి తగ్గట్టు ఖర్చులుంటాయి. పొదుపు చేయాలన్న ఆలోచన ఫలించదు. శుభకార్యాలకు హాజరవుతారు. బంధుమిత్రుల వైఖరి కష్టమనిపిస్తుంది. ఒకరికి సలహా ఇచ్చి మరొకరికి వ్యతిరేకులవుతారు. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. శ్రమాధిక్యతతో పనులు పూర్తి చేస్తారు. పదవుల నుంచి తప్పుకుంటారు. ప్రియతముల దూరమయ్యే ఆస్కారం. పెట్టుబడుల వ్యవహారంలో పునరాలోచన అవసరం. వ్యాపారాల్లో ఒడిదుడుకులను ధీటుగా ఎదుర్కొంటారు. హోల్ సేల్ వ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి.
 
ధనస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం 
వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. ఆదాయం బాగుంటుంది. కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. అవకాశాలను చేజిక్కించుకుంటారు. శుభకార్య యత్నం ఫలిస్తుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఆటంకాలెదురైనా పనులు పూర్తి కాగలవు. ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు. మీ బలహీనతలు అదుపు ఉంచుకోండి. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. పెట్టుబడులపై దృష్టి సారిస్తారు. విలువైన వస్తువులు, పత్రాలు జాగ్రత్త. ఆది, సోమవారాల్లో అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. వృత్తుల వారికి జనసంబంధాలు బలపడతాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం, విశ్రాంతి లోపం.
 
మకరం: ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు  
ఊహించని ఖర్చులే ఉంటాయి. ధనానికి ఇబ్బంది ఉండదు. కుటుంబీకుల మధ్య అవగాహన నెలకొంటుంది. బాధ్యతలు అప్పగించవద్దు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. మానసికంగా కుదుటపడతారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. యత్నాలకు ప్రోత్సాహం ఉంటుంది. ఆకస్మికంగా కొన్ని పనులు పూర్తి చేస్తారు. మంగళ, బుధవారాల్లో ఒక వ్యవహారంలో జోక్యం చేసుకోవాల్సి వస్తుంది. ఎవరినీ నొప్పించని విధంగా మెలగాలి. విమర్శలు, వ్యాఖ్యలు పట్టించుకోవద్దు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు సంభవం. ఆరోగ్యం, ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి కలుగుతుంది. దైవ, సేవా సంస్థలకు సాయం అందిస్తారు. ఉద్యోగస్తులకు పనిభారం తగ్గుతుంది. అధికారుల మన్ననలు, పురస్కారాలు అందుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. 
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం,  పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు 
శ్రమపడినా ఫలితం ఉంటుంది. వేడుకలకు హాజరవుతారు. దుబారా ఖర్చులు అధికం. ఒక అ వసరానికి ఉంచిన ధనం మరో వివాదానికి వ్యయం చేస్తారు. పత్రాలు, విలువైన వస్తువులు జాగ్రత్త. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. ముఖ్యమైన  వ్యక్తులను కలుసుకుంటారు. ఆర్థిక లావాదేవీలతో తీరిక ఉండదు. గురు, శుక్రవారాల్లో లౌక్యం వ్యవహరించాలి. సలహా కంటే సొంత నిర్ణయాలే శ్రేయస్కరం. పనులు వేగవంతమవుతాయి. సంప్రదింపులు ఫలిస్తాయి. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. షాపుల స్థల మార్పు కలిసివస్తుంది. టెండర్లు, ఏజెన్సీలు దక్కించుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి. అధికారులకు అదనపు బాధ్యతలు పనిభారం. సన్మాన, సాహిత్య సభల్లో పాల్గొంటారు. వాహన చోదకులకు అత్యుత్సాహం తగదు. 
 
మీనం: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు. శనివారం నాడు ఖర్చులు విపరీతం. విలాసాలకు బాగా వ్యయం చేస్తారు. కష్టానికి గుర్తింపు, ప్రతిఫలం పొందుతారు. సర్వత్రా అనుకూలతలుంటాయి. యత్నాలకు శ్రీకారం చుడతారు. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. బంధువులతో విభేదాలు తలెత్తుతాయి.  మీ ఆగ్రహావేశాలను అదుపులో ఉంచుకోండి. వ్యతిరేకించిన వారే మీ విజ్ఞతను గుర్తిస్తారు. విద్యార్థులకు ఏకాగ్రత లోపం, చికాకులు అధికం.  పదవులు, బాధ్యతలనుంచి తప్పుకుంటారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. సహోద్యోగులతో విందుల్లో పాల్గొంటారు. వృత్తి ఉపాధి పథకాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. ప్రయాణంలో అవస్థలు తప్పవు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెప్సికో ఇండియా రివల్యూషనరి అవార్డ్స్ 2024: విజేతగా నిలిచిన తెలంగాణ గణపతి సెల్ఫ్-హెల్ప్ గ్రూప్

తిరుపతిలో అన్నమయ్యకి శాంతాక్లాజ్ టోపీ పెట్టింది ఎవరో తెలిసిపోయింది (video)

సంక్రాంతికి సిద్ధం అవుతున్న పవన్ కల్యాణ్ ప్రభలు, ఉత్తరాంధ్రలో ఉరుకుతున్న జనం (Video)

Truck: ట్రక్కు కింద ఇద్దరు మోటర్ సైకిలిస్టులు.. చూడకుండానే లాక్కెళ్లిన డ్రైవర్ (video)

NTR: ఎందుకొచ్చిన గొడవ- అభిమాని ఆస్పత్రి బిల్ సెటిల్ చేసిన జూనియర్ ఎన్టీఆర్.. (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

21-12-2024 శనివారం దినఫలితాలు : ఆస్తి వివాదాలు కొలిక్కివస్తాయి...

తిరుమల కోసం స్వర్ణ ఆంధ్ర విజన్-2047: టీటీడీ ప్రారంభం

19-12-2024 గురువారం దినఫలితాలు : పందాలు, బెట్టింగులకు దూరంగా ఉండండి..

తిరుమలలో ముమ్మరంగా వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లు

18-12-2024 బుధవారం దినఫలితాలు : కార్యసాధనకు ఓర్పు ప్రధానం...

తర్వాతి కథనం
Show comments