Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మీ వార రాశి ఫలితాలు.... 27-08-2017 నుంచి 2-09-2017 వరకు(వీడియో)

కర్కాటకంలో శుక్ర, రాహువు. కుజులు. సింహంలో రవి, వక్రి బుధులు, కన్యలో గురువు, వృశ్చికంలో శని, మకరంలో కేతువు. తుల, వృశ్చిక, ధనస్సు, మకరంలలో చంద్రుడు. 27న కుజుడు సింహ ప్రవేశం. 2న వామన జయంతి. మేషం : అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం. బాధ్యతలు స్వయంగా చూసుకోవ

Advertiesment
మీ వార రాశి ఫలితాలు.... 27-08-2017 నుంచి 2-09-2017 వరకు(వీడియో)
, శనివారం, 26 ఆగస్టు 2017 (20:39 IST)
కర్కాటకంలో శుక్ర, రాహువు. కుజులు. సింహంలో రవి, వక్రి బుధులు, కన్యలో గురువు, వృశ్చికంలో శని, మకరంలో కేతువు. తుల, వృశ్చిక, ధనస్సు, మకరంలలో చంద్రుడు. 27న కుజుడు సింహ ప్రవేశం. 2న వామన జయంతి.
 
మేషం : అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం.
 
బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. మీ విషయాల్లో పెద్దల జోక్యం అనివార్యం. దంపతుల మధ్య సఖ్యత లోపం. చికాకులు తలెత్తుతాయి. ఆర్థికలావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. సోమ, మంగళ వారాల్లో వ్యవహారాల్లో తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఖర్చులు అంచనాలను మించుతాయి. చేతిలో ధనం నిలబడదు. అవసరాలు, చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. పనుల సానుకూలతకు మరింతగా శ్రమించాలి. ఆరోగ్యం సంతృప్తికరం. వ్యాపారాల్లో లాభనష్టాలను సమీక్షించుకుంటారు. పనుల సానుకూలతకు మరింతగా శ్రమించాలి. ఆరోగ్యం సంతృప్తికరం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. వృత్తి ఉపాధి పథకాలు అంతంత మాత్రంగా సాగుతాయి. దైవకార్యంలో పాల్గొంటారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
 
వ్యవహారాల్లో ప్రతికూలతలెదుర్కుంటారు. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. పెద్దల సలహా పాటించండి. మీపై శకునాల ప్రభావం అధికం. ఎదుటివారి వ్యాఖ్యలకు ధీటుగా స్పందిస్తారు. అవకాశాలు చేజారినా ఒకందుకు మంచిదే. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. గృహమార్పు ఫలితం నిదానంగా కనిపిస్తుంది. ఆది, గురువారాల్లో పనుల ముగింపు దశలో హడావుడిగా సాగుతాయి. ఖర్చులు విపరీతం. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. మీ శ్రీమతితో అనునయంగా మెలగండి. కుటుంబీకుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులు అంతగా ఉండదు. మార్కెట్ రంగాల వారికి ఆశాజనకం. ఆస్తి వివాదాలు, కోర్టు వాయిదాలు నిరుత్సాహపరుస్తాయి. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు 
 
ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మంగళ, శనివారాల్లో రసీదులు, పత్రాలు జాగ్రత్త. పరిచయాలు, వ్యాపకాలు విస్తరిస్తాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. యత్నాలకు పరిస్థితులు అనుకూలిస్తాయి. వాయిదా పడిన పనులు పూర్తి కాగలవు. దైవకార్య చర్చల్లో పాల్గొంటారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. మీ సలహా ఎదుటివారికి లాభిస్తుంది. పెట్టుబడులపై దృష్టి సారిస్తారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. సంతానం అత్యుత్సాహం ఇబ్బంది కలిగిస్తుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారుయ సరుకు నిల్వలో జాగ్రత్త. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష 
 
వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. ఖర్చులు అధికం. ప్రయోజనకరం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పెద్దమొత్తం ధనసహాయం క్షేమం కాదు. గురు, శుక్రవారాల్లో ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. కొత్త బాధ్యతలు చేపడతారు. పలుకుబడి, గౌరవమర్యాదలు పెంపొందుతాయి. మీ జోక్యంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. సంప్రదింపులు ఫలిస్తాయి. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. ఒక సంఘటన ఆందోళన కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా పడతాయి. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. అధికారులతో సత్సంబంధాలు నెలకొంటాయి. దైవ, పుణ్య కార్యాల్లో పాల్గొంటారు. వ్యాపారులకు చికాకులు అధికం. సరుకు నిల్వల్లో జాగ్రత్త. మార్కట్ రంగాల వారికి ఒత్తిడి, శ్రమ అధికం.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
 
ఒక వ్యవహారంలో ధనం అందుతుంది. రుణ బాధల నుంచి విముక్తి పొందుతారు. పనులు నిదానంగా సాగుతాయి. ఖర్చులు భారమనిపించవు. అవసరాలు నెరవేరుతాయి. బాధ్యతగా వ్యవహరించాలి. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. బంధువుల వ్యాఖ్యలు మనస్తాపం కలిగిస్తాయి శనివారం నాడు కొన్ని విషయాలు చూసీచూడనట్లు వదిలేయండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు సంభవం. ఆందోళన తొలగి కుదుటపడతారు. యత్నాలు ఫలిస్తాయి. విదేశీ విద్యాయత్నంలో మెలకువ వహించండి. బోగస్ కంపెనీలు, దళారులను విశ్వసించవద్దు. అయిన వారే తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. వ్యాపారాల్లో నిలదొక్కుకుంటారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. దైవ కార్యాల్లో పాల్గొంటారు. వాహనచోదకులకు అత్యుత్సాహం తగదు.
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు 
 
ఈ వారం ధనలాభం, వాహన యోగం పొందుతారు. పెట్టుబడులు, పొదుపు పథకాలకు అనుకూలం. కార్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఖర్చులు సామాన్యం. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. మొహమ్మాటాలకు పోయి ఇబ్బందులెదుర్కుంటారు. మీ శ్రీమతి సలహా పాటించండి. కావలసిన వ్యక్తుల కలయిక సాధ్యం కాదు. మీపై శకునాల ప్రభావం అధికం. ఉద్యోగస్తుల కృషి ఫలిస్తుంది. పురస్కారాలు, నగదు బహుమతి అందుకుంటారు. ప్రకటనల పట్ల అవగాహన ప్రధానం. దళారులను విశ్వసించవద్దు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. భాగస్వామిక చర్యలు కొలిక్కి వస్తాయి. హోల్ సేల్ వ్యాపారులు, స్టాకిస్టులకు ఆదాయాభివృద్ధి.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
 
ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. పోగొట్టుకున్న పత్రాలు తిరిగి పొందుతారు. ప్రేమానుబంధాలు బలపడతాయి. గృహంలో సందడి నెలకొంటుంది. పరిచయస్తులకు సాయం అందిస్తారు. ఖర్చులు పెరిగినా ఇబ్బంది ఉండదు. ఆరోగ్యం  పట్ల శ్రద్ధ అవసరం. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. పదవులు, బాధ్యతల నుంచి తప్పుకుంటారు. విలువైన వస్తువులు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. నమ్మకస్తులే తప్పుదారి పట్టించే ఆస్కారం ఉంది. అధికారులకు పనిభారం, అదనపు బాధ్యతలు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. చిరు వ్యాపారులకు ఆశాజనకం. ఉత్సవాలు, దైవకార్య సమావేశాల్లో పాల్గొంటారు.
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 
 
ఖర్చులు అధికం, ప్రయోజనకరం. దైవ కార్యాలకు బాగా వ్యయం చేస్తారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. నోటీసులు అందుకుంటారు. ఆస్తి, భూ సంబంధిత వివాదాలు కొలిక్కి వస్తాయి. ఆందోళన తొలగి కుదుటపడతారు. యత్నాలకు పరిస్థితులు అనుకూలిస్తాయి. ఉత్సాహంగా గడుపుతారు. ఆది, సోమవారాల్లో కావలసిన వ్యక్తుల కలయిక అనుకూలించదు. మీపై శకునాల ప్రభావం అధికం. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలు, ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు ఏమంత సంతృప్తినీయవు. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. గృహ నిర్మాణాలు చురుకుగా సాగుతాయి. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. జూదాల జోలికి పోవద్దు.
 
ధనస్సు : మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం 
 
వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. రాబోయే ఆదాయానికి తగ్గట్టు ఖర్చులుంటాయి. ఒక వ్యవహారంలో పెద్దల జోక్యం అనివార్యం. అవివాహితుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. దంపతుల మధ్య దాపరికం తగదు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. ఎదుటివారి తీరుకు అనుగుణంగా వ్యవహరించాలి. అవకాశాలను జారవిడుచుకోవద్దు. ప్రముఖుల కలయిక అనుకూలించదు. మంగళ, బుధవారాల్లో అవగాహనలేని విషయాలకు దూరంగా ఉండాలి. పనులు నిదానంగా పూర్తి కాగలవు. బాధ్యతలు అప్పగించవద్దు. ఉద్యోగస్తులకు పనిభారం, ఒత్తిడి అధికం. అధికారులకు సాదర వీడ్కోలు పలుకుతారు. విందులు, వినోదాల్లో అత్యుత్సాహం తగదు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. దైవకార్య సమావేశాల్లో పాల్గొంటారు. 
 
మకరం : ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు 
 
గృహ మార్పు యత్నం కలిసిరాగలదు. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. పనుల ప్రారంభంలో ఆటంకాలెదుర్కుంటారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. విలువైన వస్తువులు జాగ్రత్త. వ్యవహారాల్లో తీరిక ఉండదు. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. చాకచక్యంగా వ్యవహరించాలి. గురు, శుక్రవారాల్లో ఎవరి సాయం ఆశించవద్దు. కొంత మొత్తం ధనం అందుతుంది. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. గత సంఘటనలు గుర్తుకొస్తాయి. ఉద్యోగయత్నంలో నిరుత్సాహం వీడండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. సహోద్యోగులు సహకారం అందుతుంది. వ్యాపారాలు క్రమంగా పుంజుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకోగలుగుతారు. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి నెలకొంటుంది.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర, 1, 2, 3 పాదాలు 
 
పనుల సానుకూలతకు మరింతగా శ్రమించాలి. వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. మొహమ్మాటాలకు పోవద్దు, ఆప్తుల సలహా పాటించండి. బంధుమిత్రల వైఖరి బాధిస్తుంది. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండాలి. శనివారం నాడు దంపతుల మధ్య అకారణ కలహం, చికాకులు తలెత్తుతాయి. మీ ఆగ్రహావేశాలు అదుపులో వుంచుకోండి. మీ తప్పిదాలను సరిదిద్దుకోవడం అవసరం. అవకాశాలు చేజారినా ఒకందుకు మంచిదే. నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగండి. ఆదాయానికి తగ్గట్టు ఖర్చులుంటాయి. రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. ఆరోగ్యం సంతృప్తికరం. వృత్తి ఉపాది పథకాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ ఏమంత సంతృప్తినీయదు. కోర్టు వాయిదాలు నిరుత్సాహపరుస్తాయి.
 
మీనం : పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి 
 
ఒక వ్యవహారంలో జోక్యం చేసుకోవాల్సి వస్తుంది. మీ మాటకు స్పందన లభిస్తుంది. ఆత్మీయులకు చేయూతనిస్తారు. పరిచయం లేని వారితో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. ఆది, సోమవారాల్లో అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కృషి ఫలిస్తుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఆలయాలు, సేవా సంస్థలకు సాయం అందిస్తారు. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. పనులు వేగవంతమవుతాయి. ఉద్యోగ ప్రకటనల వల్ల అవగాహన ప్రధానం. బోగస్ కంపెనీలను విశ్వసించవద్దు. ఉద్యోగస్తులకు పదవీయోగం, ధనలాభం. వ్యాపారులకు కొత్త సమస్యలు ఎదురయ్యే సూచలున్నాయి. చిరు వ్యాపారులకు పురోభివృద్ధి. వైద్య, సాంకేతిక రంగాల వారికి ప్రోత్సాహకరం. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం తగదు. వేడుకల్లో అత్యుత్సాహం తగదు.
 
వార ఫలితాలు... వీడియో

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శుభోదయం : మీ రాశి ఫలితాలు 26-08-17