Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శుభోదయం : మీ రాశిఫలితాలు 24-08-17

మేషం : ఈ రోజు మీ తొందరపాటు తనం వల్ల వ్యవహారం బెడిసికొట్టే ఆస్కారం ఉంది. స్త్రీలకు పనివారలు, సంతానలేమితో చికాకులు ఎదురవుతాయి. వ్యవసాయ రంగాల వారికి ఎరువుల కొనుగోలులో ఏకాగ్రత ముఖ్యం. ఇసుక, క్వారీ కాంట్రా

Advertiesment
శుభోదయం : మీ రాశిఫలితాలు 24-08-17
, గురువారం, 24 ఆగస్టు 2017 (05:49 IST)
మేషం : ఈ రోజు మీ తొందరపాటు తనం వల్ల వ్యవహారం బెడిసికొట్టే ఆస్కారం ఉంది. స్త్రీలకు పనివారలు, సంతానలేమితో చికాకులు ఎదురవుతాయి. వ్యవసాయ రంగాల వారికి ఎరువుల కొనుగోలులో ఏకాగ్రత ముఖ్యం. ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు ఊహించని చికాకులు తలెత్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. 
 
వృషభం : ఈ రోజు సమయంసందర్భం లేకుండా విచ్చేసిన బంధువుల వల్ల అసౌకర్యానికి లోనవుతారు. స్త్రీల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు శారీరక పటుత్వం నెలకొంటుంది. నిరుద్యోగులు ఉపాధి పథకాల్లో క్రమంగా నిలదొక్కుకుంటారు. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తక్షం తీరిక ఉండదు. పాత రుణాలు తీరుస్తారు. 
 
మిథునం : ఈ రోజు వ్యాపారాల్లో కొత్త కొత్త పథకాలతో ముందుకు సాగుతారు. వాహనం ఏకాగ్రతతో నడపడం వల్ల ముఖ్యం బంధువుల నుంచి ఆహ్వానం అందుతుంది. ఖర్చులు మీ బడ్జెట్‌కు అనుగుణంగానే ఉంటాయి. ప్రముఖలు, ఆత్మీయులను కలుసుకుంటారు. మీ పనులు, కార్యకలాపాలు ప్రశాంతంగా సాగుతాయి. 
 
కర్కాటకం : ఈ రోజు సంబంధం లేని విషయాలకు దూరంగా ఉండటం మంచిది. మీ అభిప్రాయాలు, నిర్ణయాలను సున్నితంగా వ్యక్తం చేయండి. రావలసిన ధనం వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కొంటారు. ఉద్యోగస్తులు తోటివారి సహకారంతో పెండింగ్ పనులు పూర్తి చేయగలుగుతారు. కోర్టు వాదోపవాదాల్లో ప్లీడర్లు రాణిస్తారు. 
 
సింహం : ఈ రోజు మిమ్మలను ఆందోళనకు గురి చేసిన సమస్య సునాయాసంగా పరిష్కారమవుతుంది. పత్రికా సంస్థలలోని వారికి ఊహించని సమస్యలెదురవుతాయి. స్త్రీలకు పనిభారం అధికం. పెద్దల ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుంది. దైవ కార్యాల పట్ల శ్రద్ధ వహిస్తారు. ప్రముఖుల పరిచయాలతో మీ పలుకుబడి పెరుగుతుంది. 
 
కన్య : ఈ రోజు మీ సంతానం విద్యా విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు. రాబడికి మించి ఖర్చులుంటాయి. దుబారా ఖర్చులు నివారణ సాధ్యంకాదు. మీ శ్రీమతితో అభిప్రాయభేదాలు, కలహాలు తలెత్తే ఆస్కారం ఉంది. సౌమ్యంగా మెలిగి గృహ ప్రశాంతతను కాపాడుకోవాలి. వృత్తిపరంగా ప్రముఖులను కలుసుకుంటారు. 
 
తుల : ఈ రోజు ఉద్యోగస్తులకు అతికష్టంమ్మీద సెలవు మంజూరవుతుంది. ప్రముఖులను కలుసుకుంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిరుత్సాహం కలిగిస్తాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటంతో నిశ్చింతకు లోనవుతారు. ఈ ఇబ్బందులు, చికాకులు తాత్కాలికమేనని గమనించండి. త్వరలో కొన్ని సమస్యల నుంచి బయట పడతారు. 
 
వృశ్చికం : ఈ రోజు భాగస్వామిక సమావేశాల్లో మీ ప్రతిపాదనలకు మంచి స్పందన లభిస్తుంది. కోర్టు తీర్పులు మీకే అనుకూలం. మిమ్మలను కలవరపరిచిన ఒక సమస్య అతి సునాయాసంగా పరిష్కారమవుతుంది. పత్రికా, వార్తా సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. 
 
ధనస్సు : ఈ రోజు కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. ఇతరులు మీ గురించి చేసిన వ్యాఖ్యలు మనస్తాపం కలిగిస్తాయి. ఇతరులకు సలహా ఇచ్చి ఇబ్బందులెదుర్కొంటారు. నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లు, బిల్డర్లకు ఏకాగ్రత, స్వయం పర్యవేక్షణ మంచిది. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. 
 
మకరం : ఈ రోజు వ్యాపార వ్యవహారాల్లో తొందరపాటుతనం కూడదు. వివాదాస్పద విషయాల్లో మీ ప్రమేయం లేకుండా జాగ్రత్త వహించండి. కొన్ని అనుకోని సంఘటనలు మీపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఉద్యోగస్తుల సమర్థత, పనితీరును అధికారులు గుర్తిస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో సానుకూలత, గృహంలో ప్రశాంతత నెలకొంటాయి. 
 
కుంభం : ఈ రోజు కుటుంబీకుల కోసం ధనం బాగా వ్యయం చేస్తారు. మీ అభిప్రాయాలు, ఆలోచనలకు మిశ్రమ స్పందన పొందుతారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోభివృద్ధి సాధిస్తారు. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. స్త్రీలకు మోకాళ్ళ నొప్పులు. దంత బాధలు ఎదుర్కోవలసి వస్తుంది. కలెక్షన్ ఏజెంట్లకు శ్రమాధిక్యత, ప్రయాసలు అధికం. 
 
మీనం : ఈ రోజు వ్యాపారాల్లో పెరిగిన పోటీ ఆందోళన కలిగిస్తుంది. ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు ఊహించని చికాకులు తలెత్తుతాయి. దంపతుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. వాయిదా వేసిన పనులు ఎట్టకేలకు పూర్తి చేస్తారు. శ్రమాధిక్యత వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. ఆకస్మిక ధనప్రాప్తి, పాత బకాయిలు వసూలు కాగలవు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చనిపోయిన వారిని ఊరేగించేటప్పుడు డబ్బులెందుకు చల్లుతారు?