వివాహ పంచమి.. అష్టోత్తర శతనామాలతో సీతారాములను పూజిస్తే?

సెల్వి
మంగళవారం, 25 నవంబరు 2025 (16:02 IST)
మార్గశిర శుద్ధ పంచమి రోజున వివాహ పంచమిగా పిలుస్తారు. ఈ ఏడాది నవంబర్ 25, మంగళవారం వస్తోంది. ఈ రోజు సాయంత్రం, రాత్రి వారాహి పూజను చేయడం విశిష్ట ఫలితాలుంటాయి. వివాహం ఆలస్యం అవుతున్నవారు, పెళ్లి విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్న వారు వివాహ పంచమి రోజు ఒక ప్రత్యేకమైన పూజ జరపడం ద్వారా వివాహంలో ఆటంకాలు తొలగిపోతాయని జ్యోతిష్యశాస్త్ర పండితులు చెబుతున్నారు. ఈ రోజున సీతా దేవి, శ్రీరాముల క‌ల్యాణం జరిగినదనే విశ్వాసం. 
 
అంతేకాదు వివాహం అయిన దంపతులు వివాహ పంచమి పూజ చేయడం వలన అన్యోన్య దాంపత్యం సిద్ధిస్తుందని శాస్త్రవచనం. సాయంత్రం పూట  ఆవునేతితో దీపారాధన చేయాలి. పసుపు రంగు పూలతో అష్టోత్తర శతనామాలతో సీతారాములను పూజించాలి. పులిహోర, పాయసం, గారెలు నైవేద్యంగా సమర్పించాలి. ఈ రోజు చాలా ఆలయాల్లో సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరిపిస్తారు. 
 
ముఖ్యంగా వివాహం విషయంలో సమస్యలు ఉన్నవారు సీతారాముల కల్యాణోత్సవం జరిపించడం అత్యంత శుభప్రదమైనదిగా భావిస్తారు. వివాహంలో ఆలస్యం అవుతే, వివాహ పంచమి రోజున సత్తు లేదా నల్ల నువ్వులను దానం చేయడం చాలా మంచిదంట. దీని వలన శని దోషం తొలిగిపోయి, వివాహ అవకాశాలను వేగవంతం చేస్తారంట. అందుకే వివాహం అవ్వడంలో అడ్డంకులు ఎదురైతే, వారు నల్లనువ్వులు దానం చేయడం చాలా మంచిదట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎస్వీయూ క్యాంపస్‌లో చిరుతపులి.. కోళ్లపై దాడి.. ఉద్యోగులు, విద్యార్థుల్లో భయం భయం

కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల్ని 45 రోజుల్లో పరిష్కరిస్తాం.. పవన్ కల్యాణ్

జగన్‌కు టీడీపీ ఎమ్మెల్సీ సవాల్... నిరూపిస్తే పదవికి రాజీనామా

వైఎస్ జగన్‌ను కించపరుస్తూ ట్విట్టర్‌లో పోస్ట్, నారా లోకేష్ వార్నింగ్

చొరబాటుదారులు కేన్సర్ రోగులు వంటివారు : కంగనా రనౌత్

అన్నీ చూడండి

లేటెస్ట్

సుబ్రహ్మణ్య షష్టి: ఓం శరవణభవ నమః

నవంబర్ 25 ధ్వజారోహణ.. రామభూమి అయోధ్యలో 100 టన్నుల పుష్పాలతో అలంకరణ

24-11-2025 సోమవారం ఫలితాలు - గ్రహస్థితి అనుకూలం.. కార్యసిద్ధిస్తుంది...

23-11-2025 ఆదివారం ఫలితాలు - ఆచితూచి అడుగేయండి.. భేషజాలకు పోవద్దు...

నవంబర్ 26 నుంచి 17 ఫిబ్రవరి 2026 వరకూ శుక్ర మౌఢ్యమి, శుభకార్యాలకు బ్రేక్

తర్వాతి కథనం
Show comments