Webdunia - Bharat's app for daily news and videos

Install App

2018లో కన్యా రాశి వారి ఫలితాలు ఇలా వున్నాయి...

కన్యారాశి : ఉత్తర 2, 3, 4 పాదములు (టో, పా, పె) హస్త 1, 2, 3, 4 పాదాలు (పూ,షం, ణ, ఢ) చిత్త 1, 2 పాదాలు (పే, పో), ఆదాయం -14, వ్యయం-2, పూజ్యత-6, అవమానం-6. ఈ రాశివారికి అక్టోబర్ 11వ తేదీ వరకు ద్వితీయము నందు బృహస్పతి, ఆ తదుపరి అంతా తృతీయము నందు, ఈ సంవత్స

Webdunia
శుక్రవారం, 29 డిశెంబరు 2017 (18:09 IST)
కన్యారాశి : ఉత్తర 2, 3, 4 పాదములు (టో, పా, పె) హస్త 1, 2, 3, 4 పాదాలు (పూ,షం, ణ, ఢ) చిత్త 1, 2 పాదాలు (పే, పో), ఆదాయం -14, వ్యయం-2, పూజ్యత-6, అవమానం-6.
 
ఈ రాశివారికి అక్టోబర్ 11వ తేదీ వరకు ద్వితీయము నందు బృహస్పతి, ఆ తదుపరి అంతా తృతీయము నందు, ఈ సంవత్సరం అంతా అర్ధాష్టమ శని, ఈ సంవత్సరం అంతా పంచమము నందు కేతువు, లాభము నందు రాహువు సంచరిస్తారు. 
 
ఈ సంవత్సరం మీ గోచారం పరీక్షించగా "జిహ్వాగ్రే వర్తతే లక్ష్మీః" అన్నట్టుగా మీ మంచి మాట, తీరు వల్ల మంచి గుర్తింపు లభిస్తుంది. గురు సంచారం అక్టోబర్ 11 వరకు  బాగుంది. రాహు, కేతువుల సంచారం కూడా బాగుంది. కుటుంబీకుల మధ్య అభిమాన, ఆప్యాయతలు పెరుగుతాయి. కుటుంబీకులకు మీరంటే ప్రత్యేక గౌరవం ఏర్పడుతుంది. అయితే సంవత్సరాంతంలో బంధువులతో కొంత విరోధము ఏర్పడే అవకాశం ఉంది.. జాగ్రత్త వహించండి. రాజకీయాల్లో వారు ఊహించని స్థాయికి చేరుకుంటారు. 
 
కాని శని సంచారం మాత్రం అనుకూలం కొంత తక్కువగా వుంది. కొత్త సమస్యలకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త వహించండి. అవివాహితులకు అనుకూలమైన కాలం. ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు తలెత్తవచ్చు. వైద్యుల సలహాతో ముందుకు సాగండి. రాహువు లాభంలో సంచారం వల్ల నిత్యకృత్యములు అన్ని సానుకూలంగా నడుస్తాయి. ప్రతి పని ధైర్యంతో ముందడుగు వేస్తారు. ఆర్థిక వ్యవహారాల యందు ఆదాయం బాగుంటుంది. ఖర్చులకు సరిపడా ఆదాయమార్గాలు అన్వేషిస్తారు. విలువైన వస్తువులు అమర్చుకుంటారు. 
 
దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. విందు, వినోద కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం వంటివి ఉండగలవు. సాధారణ స్థాయి ఇబ్బందులు తలెత్తినప్పటికీ తెలివితో పరిష్కరిస్తారు. కళ, క్రీడా రంగాల్లో వారికి అరుదైన గుర్తింపు లభిస్తుంది. గురు, రాహువు, ప్రభావం మీకు ప్రతి అంశంలో మీ తెలివితేటలు, ప్రతిభ అందరూ తెలుసుకునే అవకాశం ఉంటుంది. 
 
ఉద్యోగస్తులకు అనుకూలంగా వున్నప్పటికీ, అభివృద్ధిలో కొంత అవరోధం ఎదుర్కొంటారు. వృత్తి వ్యాపారులకు ఈ సంవత్సరం అంతా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆడిట్, అకౌంట్ రంగాల్లో వారికి ఒత్తిడి అధికంగా ఉంటుంది. త్వరితగతిన నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు. దైవ, పుణ్య కార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఇతరులకు మీ సహాయ, సహకారాలు అందిస్తారు. 
 
ప్రతి పనిలో ఏకాగ్రత వహించి నష్టాలు రాకుండా జాగ్రత్త పడతారు. సాధ్యం కాని హామీలివ్వవద్దు. కోర్టు వ్యవహారాలు ఏమాత్రం ముందుకు సాగవు. విదేశీయాన యత్నాల్లో సఫలీకృతులు అవుతారు. పండితులకు, న్యాయవాద రంగాల్లో వారికి తగిన గుర్తింపు లభిస్తుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వేడుకల్లో హుందాగా వ్యవహరిస్తారు. 
 
నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. కుజుడు పంచమంలో స్తంభన దృష్ట్యా మీకు కోపం, ఆవేశం కొంచెం అధికమనే చెప్పవచ్చు. వ్యవసాయ రంగాల్లో వారికి శ్రమకు తగిన రాబడి లభిస్తుంది. షేర్ వ్యాపారస్తులకు అనుకూలమైన కాలం నిరుద్యోగుల యత్నాలు ఫలిస్తాయి. మీకు తెలియకుండా పొరపాట్లు దొర్లే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ సంవత్సర విజయశాతం ఎక్కువనే చెప్పవచ్చు. 
 
* ఈ రాశివారికి 2019 వరకు అర్ధాష్టమ శనిదోషం ఉన్నందువల్ల ఉత్తరా నక్షత్రం వారు 9సార్లు, హస్తానక్షత్రం వారు 10సార్లు, చిత్త నక్షత్రం వారు 17సార్లు నవగ్రహ ప్రదక్షణలు చేసి, చామంతి పూలతో శనిని పూజించడం, శని త్రయోదశినాడు శనికి తైలాభిషేకం చేయించి, ఒక నల్లగొడుగును బ్రాహ్మణునికి దానం ఇచ్చినట్లైతే శుభం కలుగుతుంది.
 
* ఈ రాశి వారు రాజరాజేశ్వరి అష్టకాన్ని చదివినా సర్వదోషాలు తొలగి మానసిక ప్రశాంతత లభిస్తుంది.
* ఉత్తరానక్షత్రం వారు ''స్టార్‌రూబి'', హస్తా నక్షత్రం వారు ''స్పందనముత్యాన్ని'' , చిత్తనక్షత్రం వారు ''జాతిపగడాన్ని'' ధరించినట్లైతే కలిసిరాగలదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం... ఉత్తారంధ్రకు భారీ వర్ష సూచన!

మీసాలు తిప్పితే రోడ్లు పడవు : మీ కోసం పని చేయనివ్వండి .. పవన్ కళ్యాణ్

హనీమూన్‌కు ఎక్కడికి వెళ్లాలి.. అల్లుడుతో గొడవు.. మామ యాసిడ్ దాడి!!

ఖమ్మం: ‘హాస్టల్‌లో నన్ను లెక్కలేనన్ని సార్లు ఎలుకలు కరిచాయి, 15 సార్లు ఇంజెక్షన్ ఇచ్చారు’

Pawan: మన్యం, పార్వతీపురం జిల్లాల్లో పవన్- డోలీలకు స్వస్తి.. గుడి కాదు.. బడి కావాలి.. (videos)

అన్నీ చూడండి

లేటెస్ట్

కలలో గణేషుడు కనబడితే ఏం జరుగుతుంది?

ఇళయరాజాకు ఆలయంలో అవమానం.. వీడియో వైర‌ల్

Daily Astro 16-12-2024 సోమవారం దినఫలితాలు : ఏకాగ్రతతో వాహనం నడపండి...

Today Daily Astro 15-12-2024 ఆదివారం దినఫలితాలు : సంకల్పం సిద్ధిస్తుంది...

Weekly Horoscope : 15-12-2024 నుంచి 21-12-2024 వరకు మీ రాశిఫలాలు

తర్వాతి కథనం
Show comments