Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ముఖం కుడివైపున పుట్టుమచ్చలున్నాయా...?

చేతి గుర్తులు, పుట్టు మచ్చలు మన జాతకాన్ని చెప్పేందుకు ఉపయోగించే బేస్ ఐట్సం. వీటిని మూఢ నమ్మకాలను కొట్టి పారేసేవారు కొందరు. నమ్మేవారు మరికొందరు. నమ్మడం, నమ్మకపోవడం మీ ఇష్టం. శరీరంపై ఉండే పుచ్చుమచ్చల ఆధారంగా మనకు కలిగే ప్రయోజనాలను తెలుసుకోవచ్చు.

Advertiesment
moles and facts
, గురువారం, 28 డిశెంబరు 2017 (22:36 IST)
చేతి గుర్తులు, పుట్టు మచ్చలు మన జాతకాన్ని చెప్పేందుకు ఉపయోగించే బేస్ ఐట్సం. వీటిని మూఢ నమ్మకాలను కొట్టి పారేసేవారు కొందరు. నమ్మేవారు మరికొందరు. నమ్మడం, నమ్మకపోవడం మీ ఇష్టం. శరీరంపై ఉండే పుచ్చుమచ్చల ఆధారంగా మనకు కలిగే ప్రయోజనాలను తెలుసుకోవచ్చు.
 
పుట్టుమచ్చల మీద వెంట్రుకలు ఉన్న వారు ధనవంతులు, కీర్తి వంతులు అవుతారు. మగాళ్ళకు రెండు కనుబొమ్మల మధ్య పుట్టుమచ్చలు ఉంటే దీర్ఘాయుష్షువు లభిస్తుంది. మగవారి తలలో పుట్టుమచ్చలు ఉంటే గర్వం ఎక్కువ..వారు ప్రతి విషయాన్ని విమర్సనాత్మకంగా గమనిస్తారు. మంచి ఆశాభావం గలవారు. అదే నుదుటిమీద పుట్టుమచ్చ ఉంటే మంచి కీర్తిప్రతిష్టలను సాధిస్తారు. ఆర్థిక స్వతంత్ర్యం ఉంటుంది. రాజకీయాల్లో రాణిస్తారు. 
 
నుదుటి కిందిభాగంలో ఉంటే మంచి లక్ష్యాన్ని, ఏకాగ్రతను కలిగి ఉంటారు. 40యేళ్ళ తరువాత విజయం సాధిస్తారు. కనుబొమ్మపై ఉంటే కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. కొంతమందికి మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ముక్కుపై ఉంటే కొంతమందిలో క్రమశిక్షణ లోపిస్తుంది. చెవికి చెందిన ఏ భాగంలో ఉన్నా ధనం కనిపిస్తూ ఉంటుంది. సమాజంలో గౌరవంతో కూడిన గుర్తింపు ఉంటుంది. పెదవిపైన ఉంటే కొన్నిసార్లు మీ బంధువులు, స్నేహితుల విషయంలో ఈర్ష కలుగుతుంది. బుగ్గపై ఉంటే రాజకీయాల్లో రాణిస్తారు. స్థిరాస్తులు గడిస్తారు.
 
అదే నాలుకపై మచ్చ ఉంటే మీరు మంచి తెలివితేటలు, విద్యను కలిగి ఉంటారు. గడ్డంపై ఉంటే భిన్నమైన ఫలితాలు ఉంటాయి. గడ్డం మీద పుట్టుమచ్చలు ఉంటే ఉదార గుణాన్ని కలిగి ఉంటారు. ఆడవారికి భక్తిభావం మెండుగా ఉంటుంది. భుజంపై ఉంటే మర్యాదస్తులుగా ఉంటారు. కష్టపడే స్వభావం కలిగి ఉంటారు. ఆనందకరమైన దాంపత్యజీవితాన్ని కొనసాగిస్తారు. మోచేయిపై ఉంటే మీ జీవితంలోని లక్ష్యాలను చేరుకోవడంలో కొన్ని ఒడిదుడికులు తప్పవు. ఎడమ చెంక భాగంలో ఉంటే మీ ప్రారంభ జీవితంలో కొంత ఒడిదుడికులు ఉన్నా నమ్మదిగా సర్దుకుంటాయి. కుడి చంక భాగంలో ఉంటే భద్రత విషయంలో మెళుకువుగా ఉంటారు. 
 
మెడ భాగంలో ఉంటే కొన్ని సమయాల్లో దురదృష్టం తప్పదు. ఇతరులు మోసం చేసేందుకు ప్రయత్నిస్తారు. కుడి కనుబొమ్మ మీద మచ్చమీద ఉంటే వివాహం త్వరగా అవుతుంది. కుడి కంటిరెప్పపై పుట్టుమచ్చ ఉంటే సంపద కలుగుతుంది. వాహనాలు బాగా లభిస్తాయి. ముఖానికి కుడివైపున పుట్టుమచ్చలు కలిగిన పురుషులు అదృష్టవంతులు. ఎడమవైపు ఉంటే ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. శరీరం ముందు భాగంలో ఉంటే ఆక్మస్మిక ధనలాభం, శరీరం వెనుక భాగంలో ఉంటే మీరు కష్టపడి పనిచేసినా ఆ పేరు ఇతరులకు దక్కుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైకుంఠ ఏకాదశి... ఉత్తర ద్వారం నుంచి విష్ణు దర్శనం మహా పుణ్యం...