వాస్తు దోషాలు తొలగిపోవాలంటే.. నెమలి ఫించం.. తులసీ ఆకులు, గరికను?

నెమలి ఫించంతో వాస్తు దోషాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. నెమలి కుమారస్వామి వాహనం. వర్షంలో నెమలి నృత్యం చేస్తుంది. ఆ సమయంలో నెమలి శరీరం నుంచి నేలరాలే వాటి ఫించాలను తీసుకొచ్చి... ఇంట్ల

Webdunia
బుధవారం, 13 జూన్ 2018 (18:13 IST)
నెమలి ఫించంతో వాస్తు దోషాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. నెమలి కుమారస్వామి వాహనం. వర్షంలో నెమలి నృత్యం చేస్తుంది. ఆ సమయంలో నెమలి శరీరం నుంచి నేలరాలే వాటి ఫించాలను తీసుకొచ్చి... ఇంట్లోని పూజగదిలో వుంచినట్లైతే వాస్తుదోషాలు తొలగిపోతాయి. 
 
ఇంకా ఇంటి ప్రధాన ద్వారం వద్ద నెమలి ఫింఛాన్ని వుంచితే ప్రతికూల ప్రభావం చాలామటుకు తగ్గిపోతుంది. నెమలిఫించంతో పాటు ఇంటి పూజగదిలో వినాయకుడికి ప్రీతికరమైన గరిక, విష్ణుమూర్తికి ఇష్టమైన తులసీ దళాలను వుంచడం ద్వారా వాస్తు దోషాలను తొలగించుకోవచ్చునని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
అలాగే మనం ఇంటి నుంచి ఎక్కడికైనా బయల్దేరినప్పుడు ఆవు ఎదురుపడితే శుభశకునంగా భావించాలి. అలా ఎదురుపడిన ఆవును నమస్కరించి ముందుకెళ్లడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. అలాగే గుర్రాలు ఎదురుపడితే శుభం.
 
ఇక శునకాలు ఎదురుపడితే భైరవుని అనుగ్రహం లభిస్తుందని, కానీ పిల్లులు మాత్రం ఎదురుపడటం మంచిది కాదని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. ఇక ఎలుకలు ఎదురుపడితే.. వినాయకుని ఆశీర్వాదం లభిస్తుందని.. విఘ్నాలు తొలగిపోతాయని వారు చెప్తున్నారు. 
 
ఇక అరటి చెట్టును ఇంట పెంచడం ద్వారా సంతాన ప్రాప్తి లభిస్తుంది. అరటి చెట్టును ఇంటికి నేరుగా కాకుండా పెరట్లో నాటడం ద్వారా వంశాభివృద్ధి చేకూరుతుంది. సంతానం లేనివారికి పుత్రప్రాప్తి చేకూరుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మన్యం జిల్లాలో నిప్పుల కుంపటి.. ముగ్గురు బలి..

రీల్స్ కోసం నిప్పంటించారు.. గాలి జనార్ధన్ రెడ్డి ఇంట అగ్నిప్రమాదం.. ఎనిమిది మందిపై కేసు

నల్గొండ జిల్లాలో ఘోస్ట్ స్కూల్స్... 315 పాఠశాలల్లో నో స్టూడెంట్స్

అమెరికా చరిత్రలోనే తీవ్రమైన మంచు తుఫాను.. పలు విమానాలు రద్దు

నగరిలో చంద్రబాబు పర్యటన.. పది పైసలకు ప్రయోజనం లేదు.. రోజా ఫైర్

అన్నీ చూడండి

లేటెస్ట్

22-01-2025 గురువారం ఫలితాలు - మాటతీరు అదుపులో ఉంచుకోండి..

20-01-2026 మంగళవారం ఫలితాలు - ఎవరినీ అతిగా నమ్మవద్దు...

19-01-2026 సోమవారం ఫలితాలు - అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దు...

18-01-2026 ఆదివారం ఫలితాలు - పనులు ఒక పట్టాన సాగవు.. ఖర్చులు విపరీతం...

మాఘమాసంలో పండుగలు, వసంత పంచమి, రథ సప్తమి, మహాశివరాత్రి

తర్వాతి కథనం
Show comments