Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇతరుల చేతుల్లో నుంచి వాటిని తీసుకుంటే ఏమవుతుందో తెలుసా?

సాధారణంగా ఇతరుల చేతుల్లో నుంచి కొన్ని వస్తువులను తీసుకోకూడదని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే కొన్ని మనం తెలిసి తీసుకుంటాం. కొన్ని మనం తెలియక తీసుకుంటాం. అలా తీసుకోవడం వల్ల అనేక నష్టాలను, దారిద్రాలను కొనితెచ్చుకున్నట్లేనని చెబుతున్నారు జ్యోతిష్య పండి

Webdunia
మంగళవారం, 26 డిశెంబరు 2017 (16:41 IST)
సాధారణంగా ఇతరుల చేతుల్లో నుంచి కొన్ని వస్తువులను తీసుకోకూడదని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే కొన్ని మనం తెలిసి తీసుకుంటాం. కొన్ని మనం తెలియక తీసుకుంటాం. అలా తీసుకోవడం వల్ల అనేక నష్టాలను, దారిద్రాలను కొనితెచ్చుకున్నట్లేనని చెబుతున్నారు జ్యోతిష్య పండితులు. కాలం మారినా ఇంకా చాలా రకాల నమ్మకాలు, ఆచారాలు ప్రజల్లో అలాగే ఉండిపోయాయి. వాటికి శాస్త్రీయ నిరూపణ ఉండదు కానీ అలా చేయకూడదని పెద్దలు ఇంట్లో చెబుతుంటారు, కానీ చాలామంది వాటిని పట్టించుకోరు. 
 
వంట చేసేటప్పుడు చాలామంది పక్కన ఉన్న వారిని కారం ఇలా తీసుకో అని అడిగి తీసుకుంటారు. అలా అడిగినప్పుడు కారం ఎత్తివ్వకూడదు. నల్ల నువ్వులు, నువ్వుల నూనెలను కూడా ఒకరి చేతిలో నుంచి తీసుకోకూడదు. వాటిని పక్కనబెట్టమని చెప్పి ఆ తరువాత తీసుకోవాలి. నల్ల వంకాయలను కూడా ఇతరుల చేతిలో నుంచి తీసుకోకూడదు. 
 
ఎందుకంటే నల్ల వంకాయలు శనీశ్వరునికి ఇష్టమైనవి కాబట్టి. అలాగే ఇంట్లో నిత్యపూజ, ఏదైనా ప్రత్యేక పూజ చేసేటప్పుడు ఇతరుల చేతిలో నుంచి వస్తువులను తీసుకోకుండా ఏదైనా ఆకుపై పెట్టి ఇవ్వమని చెబితే మంచిది. అలా అందుకుంటే మంచిది. వారి చేతి నుంచి తీసుకుంటే మాత్రం పూజ చేసిన ఫలితం రాకపోగా కష్టాలు దరిచేరుతాయి.
 
నవరత్న ఉంగరాన్ని ఎవరి చేతి నుంచి తీసుకోకూడదు. అలా తీసుకుంటే వారిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మీకు వచ్చే అవకాశం ఉంది. అలాగే చింతపండు, ఆవాలను కూడా ఇతరుల చేతిలో నుంచి తీసుకోకూడదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీరాముని స్ఫూర్తితో ప్రజారంజక పాలన సాగిస్తా : సీఎం చంద్రబాబు

బెంగళూరు మెట్రో స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై యువ జంట: అమ్మాయి.. అబ్బాయి.. రొమాన్స్.. అలా? (video)

బీజేపీతో దోస్తీ ఎఫెక్ట్! తమిళనాడులో అన్నాడీఎంకే ఇక అంతేనా...

కుక్కపిల్లల కుస్తీ పోటీ, సినిమా చూస్తున్న కోళ్లు (video)

పైసా ఖర్చు లేకుండా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

లేటెస్ట్

ఇంట్లో శివలింగాన్ని పూజించవచ్చా? బొటనవేలు కంటే పొడవు వుండకూడదు

పండుగలు చేసుకోవడం అంటే ఏమిటి?

09-04-2025 బుధవారం మీ రాశిఫలాలు : చీటికిమాటికి చికాకుపడతారు...

బుధవారం రోజున పూజ ఎలా చేయాలి? భార్యాభర్తలు కలిసి ఆచరిస్తే?

మీనరాశిలోకి మారుతున్న శుక్రుడు.. ఈ 3 రాశుల వారికి అంతా శుభమే

తర్వాతి కథనం
Show comments