Webdunia - Bharat's app for daily news and videos

Install App

26-12-2017 మంగళవారం దినఫలాలు.. శ్రీమతి సలహా పాటించండి...

మేషం: విద్యార్థులకు తమ ధ్యేయం పట్ల ఆసక్తి, పట్టుదల అధికమవుతాయి. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వటం మంచిది కాదని గమనించండి. బంధువులు మీ నుంచి పెద్దమొత్తంలో ధనసహాయం అర్ధిస్తారు. శ్రీమతి సలహా పాటించ

Webdunia
మంగళవారం, 26 డిశెంబరు 2017 (08:31 IST)
మేషం: విద్యార్థులకు తమ ధ్యేయం పట్ల ఆసక్తి, పట్టుదల అధికమవుతాయి. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వటం మంచిది కాదని గమనించండి. బంధువులు మీ నుంచి పెద్దమొత్తంలో ధనసహాయం అర్ధిస్తారు. శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. ప్రయాణాల ముఖ్యోద్దేశ్యం నెరవేరుతుంది.  
 
వృషభం: స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లోను, స్కీమ్‌ల పట్ల అప్రమత్తత అవసరం. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. ఉద్యోగస్తులు మొహమ్మాటాలు, ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది. తరచు దైవ కార్యాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు ప్రకటనలు, అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం.
 
మిథునం: బ్యాంకు వ్యవహారాల్లో ఏకాగ్రత అవసరం. మిత్రులతో మనస్పర్థలు తలెత్తుతాయి. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. కుటుంబీకులతో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. అధికారులతో సంభాషించేటప్పుడు  ఆత్మ నిగ్రహం వహించండి. స్త్రీల సరదాలు, అవసరాలు వాయిదా వేసుకోవలసి వస్తుంది. 
 
కర్కాటకం: కాంట్రాక్టుల విషయంలో పునరాలోచన చాలా అవసరం. ఉద్యోగస్తులకు రావలసిన ప్రమోషన్‌లో త్వరలోనే లభిస్తుంది. బ్యాంకు ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకు, ఆందోళనలు వంటివి అధికమవుతాయి. విత్తనాలు, మందులు, స్టేషనరీ, ఫ్యాన్సీ వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.  
 
సింహం: ప్రభుత్వ రంగంలో వారికి శ్రమకు తగిన ప్రతిఫలం కానరాదు. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. కొంతమంది మిమ్ములను ప్రలోభాలకు గురిచేసే ఆస్కారం ఉంది. సభలు, సన్మానాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. విద్యార్థులకు హడావుడి, తొందరపాటు తగదు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు.
 
కన్య: వైద్యులకు శస్త్రచికిత్స చేయునప్పుడు ఏకాగ్రత చాలా అవసరరం. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు. రాజకీయనాయకులు పార్టీలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. 
 
తుల: కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లకు ఒత్తిడి తప్పదు. శాస్త్ర, సాంకేతిక రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి.  బ్యాంకింగ్ వ్యవహారాల్లో ఏకాగ్రత అవసరం. వ్యాపారాభివృద్ధికి కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. ఖర్చులు పెరగడంతో అదనపు సంపాదన పట్ల దృష్టి సారిస్తారు. ట్రావెలింగ్ ఏజెన్సీలకు మందకొడిగా ఉంటుంది.
 
వృశ్చికం: ఉపాధ్యాయులకు శ్రమాధిక్యత, ఒత్తిడి తప్పవు. బ్యాంకు నుంచి ధనం డ్రా చేసే విషయంలో జాగ్రత్త అవసరం.  వార్తా సంస్థల్లోని సిబ్బందికి మార్పులు అనుకూలిస్తాయి. ఎదుటివారికి ఉచిత సలహాలు ఇవ్వడం వల్ల ఇబ్బందులకు గురి కావలసివస్తుంది. మీ నిజాయితీకి మంచి గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. 
 
ధనస్సు: విద్యుత్ రంగాల వారికి చికాకులు అధికమవుతాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. బంధువుల నుంచి మొహమ్మాటాలు ఎదురవుతాయి. మీ ఆంతరంగిక విషయాలు, కుటుంబ సమస్యలు గోప్యంగా ఉంచండి. వాతావరణంలో మార్పు వల్ల స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. 
 
మకరం: ఉద్యోగ బాధ్యతల్లో ఆశించిన మార్పులుంటాయి. పెరిగిన ధరలు, ఆకస్మిక ఖర్చుల వల్ల ఆటుపోట్లు తప్పవు. మీ ఆగ్రహావేశాల వల్ల వ్యవహారాలు చెడే ఆస్కారం వుంది. కాంట్రాక్టుల విషయంలో పునరాలోచన చాలా అవసరం. వృత్తిపరంగా చికాకులు లేకున్నా ఆదాయ సంతృప్తి అంతగా ఉండదు. 
 
కుంభం: విద్యార్థులకు అధిక శ్రమ వల్ల ఆరోగ్యంలో చికాకులను ఎదుర్కొంటారు. సన్నిహితుల రాక  ఇబ్బంది కలిగిస్తుంది. స్త్రీలకు శ్రమాధిక్యత, విశ్రాంతిలోపం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. వ్యాపారాల అభివృద్ధికి షాపుల అలంకరణ, కొత్త స్కీములు అమలు చేస్తారు. 
 
మీనం: ఆర్థికంగా బాగుగా స్థిరపడతారు. వాతావరణంలో మార్పుతో రైతులు ఊరట చెందుతారు. ఉద్యోగస్తులు పై అధికారుల నుంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఆలయ సందర్శనాల్లో నూతన వ్యక్తుల కలయిక సంభవించును. విద్యార్థులు ఇతర వ్యాపకాలు విడనాడి శ్రమించిన సత్ఫలితాలు పొందుతారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాజ్యసభలో అడుగుపెట్టిన కమల్ హాసన్... తమిళంలో ప్రమాణం

లైంగిక సమ్మతి వయసు తగ్గించే నిర్ణయం సబబు కాదంటున్న అపెక్స్ కోర్టు

బీమా సొమ్ము కోసం కాళ్ళను తొలగించుకున్న వైద్యుడు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపిన నారా లోకేష్.. ఎందుకంటే?

మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన మరో ఆరు నెలలు

అన్నీ చూడండి

లేటెస్ట్

జూలై 23న మాస శివరాత్రి.. ఆరుద్ర నక్షత్రం తోడైంది.. సాయంత్రం శివాలయంలో?

23-07-2025 బుధవారం దినఫలితాలు - ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి...

Ashadha Amavasya 2025: ఆషాఢ అమావాస్య 2025: వ్రత కథ.. పితృదేవతలకు తర్పణం ఇవ్వకపోతే?

Ashadha Amavasya: ఆషాఢ అమావాస్య రోజున ఏం చేయాలి?

Light Lamps: దీపాల వెలుగులు ఇంటికి ఎలా మేలు చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments