Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్తీక మాసం.. మృగశిర నక్షత్రం.. సీతమ్మను కలిసిన రోజు.. హనుమను పూజిస్తే..?

Webdunia
బుధవారం, 2 డిశెంబరు 2020 (05:00 IST)
Sita_hanuman
డిసెంబర్ 2, 2020.. కార్తీక బుధవారంతో పాటు విదియ తిథి, మృగశిర నక్షత్రం కూడా కలిసివచ్చే రోజు. ఈ రోజున హనుమంతుడిని పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. కార్తీక బుధవారం మృగశిర నక్షత్రం రోజున గృహప్రవేశానికి, వివాహాది శుభకార్యాలకు విశిష్ఠమైన రోజు. కార్తీక వ్రతం ఆచరించే వారు ఈ రోజున అశ్వినీ దేవతలను పూజించాలి. ఈ రోజున అశ్వినీ దేవతలను తృప్తి పరిచే విధంగా ఔషధాన్ని దానం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. 
 
ఇంకా ధనాన్ని దానం ఇచ్చినా సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది. ఆయుర్దాయం పెరుగుతుంది. అలాగే కార్తీక మాసంలో వ్రతమాచరించే వారు ఈ రోజున తరిగిన ఆహారాన్ని తీసుకోకూడదు. అంటే ఉడికించిన ఆహారాన్నే తీసుకోవాలి. ఉడికించిన పప్పు, బంగాళాదుంప, ఉడికించిన గోంగూర తీసుకోవచ్చు. ఈ నక్షత్రం రోజున హనుమంతుడిని కొలిస్తే సమస్త దుఃఖాలు తొలగిపోతాయి. 
 
రామాయణంలో సీతాదేవిని హనుమంతుడు దర్శించుకున్న రోజు ఇదే కావున.. ఈరోజున హనుమాన్‌ను పూజించిన వారికి ఈతిబాధలు, సమస్త దోషాలు, సమస్త దుఃఖాలు తొలగిపోతాయని సీతాదేవి వరమిచ్చినట్లు చెప్తారు. 
 
అందుకే ఈ రోజుల హనుమంతుని ఆలయాల్లో ఆకుపూజ చేయించడం లేదంటే ఇంటివద్దే హనుమంతుడి విగ్రహం ముందు తమలపాకులను వుంచి.. అరటి పండ్లను సమర్పిస్తే.. శుభఫలితాలు వుంటాయి. అప్పుల బాధలు తీరిపోతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

పండ్లు ఇస్తున్నట్లు నటిస్తూ చీర పిన్ తీసేవాడు: హెచ్‌డి ప్రజ్వాల్ రేవన్నపై బాధితురాలు ఫిర్యాదు

ఏపీ గురించి పూనమ్ కౌర్ కామెంట్స్.. వైరల్

చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానికి సెక్యూరిటీ కల్పించాలి : హైకోర్టు

దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ పెన్ డ్రైవ్‌ల్లో వేలాది మహిళల శృంగార వీడియోలు!!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : 30న టీడీపీ - బీజేపీ - జనసేన ఉమ్మడి మేనిఫెస్టో!!

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

నరదృష్టిని తరిమికొట్టే కంటి దృష్టి గణపతి.. ఉత్తరం వైపు?

24-04-202 బుధవారం దినఫలాలు - విద్యా సంస్థలకు దానధర్మాలు చేయుట వల్ల...

23-04-2024 మంగళవారం దినఫలాలు - ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలం

తర్వాతి కథనం
Show comments