Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్వేతార్క గణపతిని పూజిస్తే..? (video)

Webdunia
సోమవారం, 1 జూన్ 2020 (13:43 IST)
Ganapathi
తెల్లగన్నేరు వేరుతో తయారు విఘ్నేశ్వరుడి ప్రతిమను కొలవడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. అయితే తెల్లగన్నేరు వేటితో తయారైందా లేదా అని బాగా తెలుసుకుని కొనాల్సి వుంటుంది. ఆరు సంవత్సరాలు పెరిగిన తెల్లగన్నేరు వేరు నుంచి వినాయకుడి ప్రతిమ తయారైందిగా వుండాలి. ఇంకా ఆ వేరు చెట్టుకు ఉత్తరం వైపుగా వేరు వెళ్లేలా వుండాలి. ఆ వేరుతోనే వినాయకుడిని తయారు చేయాలి. 
 
ఈ వేరును 48 రోజుల పాటు పూజ చేసి.. తర్వాత ప్రతిమను రూపొందించేందుకు ఉపయోగించాలి. ఇలా తయారైన తెలుపు గన్నేరు వేరుతో చేసిన వినాయకుడిని శుక్రవారం ఉదయం 10.30 నుంచి 12.00 గంటల్లోపు రాహు కాలంలో పూజించాలి. 
 
ఆ వినాయకుడి ప్రతిమకు పూర్తిగా పసుపును రాసి అలకరించాలి. తదుపరి శుక్రవారం చందనం రాసి పూజకు ఉపయోగించాలని.. ఇలా పూజలందుకునే వినాయకుడు అనుకున్న కోరికలు నెరవేరుస్తాడని విశ్వాసం. శ్వేతార్క గణపతిని శుభ్రమైన నీటితో కడిగి, తర్వాత దానిపై ఎర్రని వస్త్రం మీద పెట్టి పూజ చేయాలి. పూజలో ఎర్ర చందనం, అక్షతలు, ఎర్రపూలు సింధూరం ఎరుపు రంగు ఉండే వస్తువులే ఎక్కువగా వాడాలి. ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. వీటితో ఒక నాణాన్ని దక్షిణంగా సమర్పించి గణేశ మంత్రాలతో పూజ చేయాలి. 
 
అందుకే.. స్వయంభూ దేవాలయాల్లో తెలంగాణగణపతిగా ప్రసిద్ధి చెందిన వరంగల్ జిల్లాలోని 29దేవతమూర్తులతో ప్రత్యేక దంపత్ వాహన సమేత నవగ్రహ క్షేత్ర నిలయంగా భాసిల్లుతోన్న కాజిపేట స్వయంభు శ్రీశ్వేతార్క గణపతి క్షేత్రం ఒకటి. ఈ ఆలయంలోని వినాయకుడిని దర్శించుకునే వారికి ఆర్థిక ఇబ్బందులు, ఈతిబాధలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.
 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

05-05 - 2024 నుంచి 11-05-2024 వరకు ఫలితాలు మీ వార రాశిఫలాలు

04-05-202 శనివారం దినఫలాలు - సోదరీ, సోదరులతో ఏకీభావం కుదరదు...

గురు గోచారం.. చతుర్‌గ్రాహి యోగం.. ఈ రాశులకు యోగం..

03-05-2024 శుక్రవారం దినఫలాలు - రావలసిన ధనం చేతికందుతుంది...

మే 1న గురు పరివర్తనం 12 రాశుల వారికి లాభం.. ఫలితాలేంటి?

తర్వాతి కథనం
Show comments