కృష్ణాష్టమి రోజున పూజ ఇలా చేస్తే..?

Webdunia
సోమవారం, 30 ఆగస్టు 2021 (10:36 IST)
కృష్ణాష్టమి రోజున పూజగదిలో ఓ మందిరమును ఏర్పాటు చేసుకుని శ్రీ కృష్ణుడు రాధతో గల ఫోటోను గానీ, ప్రతిమను ఉంచాలి. ఇంతలో పూజకు పసుపు రంగు అక్షింతలు, కదంబ పుష్పములు, సన్నజాజులతో మాల, నైవేద్యానికి పానకం, వడపప్పు, కమలాకాయలు వంటివి సిద్ధం చేసుకోవాలి.
 
తదనంతరం మధ్యాహ్నం 12 గంటలకు పూజను ప్రారంభించాలి. కంచుదీపంలో కొబ్బరినూనె పోసి, ఐదు దూది వత్తులతో దీపమెలిగించాలి. దీపారాధనకు ఆవునేతితో హారతి సిద్దం చేసుకోవాలి. నుదుటన సింధూ ి  ర్లు జపించాలి.
 
ఇంకా పూజ సమయంలో బాలకృష్ణా స్తోత్రమ్, శ్రీ కృష్ణ సహస్రనామములు, శ్రీ మద్భావవతములతో శ్రీకృష్ణుడిని స్తుతించవచ్చు. తర్వాత శ్రీకృష్ణుడికి నైవేద్యాలు సమర్పించి, దీపారాధన గావించుకుని పూజను ముగించాలి.
 
ఇంకా కృష్ణష్టామి రోజున ఒంటిపూట భోజనం చేసి, శ్రీ కృష్ణుడికి పూజచేసి, శ్రీకృష్ణ దేవాలయాలు, గౌడీయ మఠములను దర్శించుకునే వారికి కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఆలయాల్లో కృష్ణ అష్టోత్తర పూజ, కృష్ణ సహస్రనామ పూజ చేయించే వారికి వంశాభివృద్ధి, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు.
 
గోకులాష్టమి దినాన ఇంటికి వచ్చే స్త్రీలకు తాంబూలముతో పాటు శ్రీ కృష్ణ నిత్యపూజ పుస్తకాలను అందజేస్తే.. సకల సంపదలు సిద్ధిస్తాయని విశ్వాసం. సంతానం లేని వారు, వివాహం కావాల్సిన వారు ఈ పుణ్యదినాన బాల కృష్ణుడిని సంతాన గోపాల మంత్రంతో పూజిస్తే అనుకున్నది నెరవేరుతుంది. 
 
ఓం నమో నారాయణాయ, నమోభగవతే వాసుదేవాయ సర్వం శ్రీకృష్ణ చరణార విందార్పణమస్తు! ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ రుక్మిణీ శాయ నమః! ఓం అచ్యుతా అచ్యుతాహరే పరమాన్ రామకృష్ణ పురుషోత్తమ విష్ణు వాసుదేవభగవాన్ అనిరుధ్య శ్రీపతే శమయ దుఃఖమశేషం నమః! ఈ మంత్రముతో ఈ రోజు ఎవరైతే 108 సార్లు ధ్యానం చేస్తుంటారో వారి దుఃఖం హరించిపోతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రూ. 950 కోట్ల అమెరికన్ విమానాన్ని పడగొట్టేసింది, క్షిపణితో 4,000 కి.మీ లక్ష్యంపై దాడి: ఇరాన్ శక్తికి నాటో షాక్

మాజీ డీజీపీ మనవరాలికి సైబర్ నేరగాళ్ల టోకరా - రూ.1.20 కోట్లు స్వాహా

తిరుమల పవిత్రతకు భంగం కలిగిస్తే కఠిన చర్యలే : సీఎం చంద్రబాబు

మీరు పనిమనిషిని పెళ్లి చేసుకోలేదు.. వంటపని, ఇంటిపని చెయ్యండి: సుప్రీం ఆదేశాలు

యుద్ధం సరిహద్దులను దాటింది... దేశ రక్షణకు సన్నద్ధంగా ఉండాలి : రాజ్‌నాథ్ సింగ్

అన్నీ చూడండి

లేటెస్ట్

తిరుమల లడ్డూలలో కల్తీకి ఇక చెక్ : FSSAI ల్యాబ్ త్వరలో ప్రారంభం

భద్రాచలంలోని శ్రీరామనవమి- కల్యాణోత్సవానికి రేవంత్ రెడ్డికి పిలుపు

ఉగాది విశిష్టత.. 60 సంవత్సరాలు నారద మహర్షి సంతానమే.. పరాభవంతో భయం లేదు

19-03-2016 గురువారం ఫలితాలు - అన్నింటా మీదే పైచేయి...

Ugadi 2026: ఈ రోజే బ్రహ్మ విశ్వసృష్టిని ప్రారంభించారట.. వంటకాల ప్రాముఖ్యత?

తర్వాతి కథనం
Show comments