Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూర్యగ్రహణంతో ఈ రాశుల వారికి తలనొప్పి.. వృశ్చిక రాశి జాతకులు మైసూర్ పప్పును..?

Webdunia
శుక్రవారం, 19 జూన్ 2020 (16:54 IST)
జూన్ 21, ఆదివారం నాడు సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఉదయం 10.25 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1.54 గంటల వరకు ఈ గ్రహణం వుంటుంది. గ్రహణ పట్టు, విడుపుల సమయం మధ్య పగలు తీసుకునే ఆహారాన్ని తీసుకోకుంటేనే మంచిదని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. ఈ గ్రహణాన్ని వృషభ, మిధున రాశుల వారు చూడకుండా ఉండాలని సలహా ఇచ్చారు. 
 
జన్మ నక్షత్రాల పరంగా మృగశిర, ఆరుద్ర, కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, పునర్వసు 1, 2, 3 పాదాల వారికి ఈ గ్రహణం కీడును కలిగించే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. సూర్య గ్రహణం సందర్భంగా విజయవాడ, తిరుపతి, శ్రీశైలం, యాదగిరిగుట్ట తదితర పుణ్యక్షేత్రాల్లోని ఆలయాలను కూడా మూసివేయనున్నారు. కానీ చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో మాత్రం ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరుగనున్నాయి.
 
అలాగే ఈ రాశుల వారికి సూర్య గ్రహణం అంతగా కలిసిరాదని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. వృషభరాశి జాతకులకు ఈ సూర్యగ్రహణం కాస్త ప్రతికూల ఫలితాలను ఇస్తుందనే చెప్పాలి. ప్రతి విషయంలోను నిగ్రహంగా వుండటం నేర్చుకోవాలి. అలాగే వ్యాపారంలో నష్టపోవచ్చు. శుభవార్త ఏమిటంటే.. అత్తగారింటి నుంచి సహాయం లభిస్తుంది. ఇంకా సమస్యల నుంచి గట్టెక్కేందుకు సూర్య గ్రహణ చెడు ప్రభావాలను నివారించడానికి ఈ రాశికి చెందిన జాతకులు విష్ణు సహస్రనామం పఠించాలి. 
Astrology
 
మిథునం:
ఈ జాతకులు సూర్యగ్రహణాన్ని వీక్షించకపోవడం మంచిది. ఆరోగ్యానికి ఆందోళనకరమైన కాలం. మిథున రాశి జాతకులు ఇతరులతో అతిగా మాట్లాడటం చేయకూడదు. ప్రయాణంలో జాగ్రత్త వహించాలి. ఈ జాతకులు కూడా రోజూ, ఉదయం సాయంత్రం పూట విష్ణు సహస్రనామం తప్పక పఠించాలి.
 
తులారాశి జాతకులు ఈ సూర్యగ్రహణ ప్రభావంతో ఉద్యోగానికి సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటారు. అందువల్ల, వారు పేదలకు ఆహారం, నీటిని దానం చేయాలి. ఒకరికి డబ్బు ఇచ్చే ముందు అనేకసార్లు ఆలోచించాలి. ఇతరులతో వాదనలకు దిగడం మంచిది కాదు. అయితే ఈ సూర్య గ్రహణం ప్రభావంతో వ్యాపారంలో లాభాలుంటాయి. అయినా ముందు జాగ్రత్తగా మసలుకోవాలి.
 
వృశ్చిక రాశి జాతకులు ఈ సూర్యగ్రహణ ప్రభావంతో ఉద్యోగానికి ఇబ్బందులు తప్పవు. అయితే, వ్యాపారాలతో ఆ సమస్యలను అధిగమిస్తారు. సూర్య గ్రహణ ప్రతికూల ప్రభావాన్ని తగ్గించడానికి, ఈ రాశిచక్రానికి చెందిన జాతకులు మైసూర్ పప్పుల్ని దానం చేయాలి. ఇంకా రోజూ హనుమాన్ చాలీసాను జపించాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

speak in Hindi, ఏయ్... ఆటో తోలుతున్నావ్, హిందీలో మాట్లాడటం నేర్చుకో: కన్నడిగుడితో హిందీ వ్యక్తి వాగ్వాదం (video)

Lavanya: రాజ్ తరణ్ కేసు కొలిక్కి రాదా? లావణ్యతో మాట్లాడితే ఏంటి ఇబ్బంది? (Video)

YS Vijayamma Birthday: శుభాకాంక్షలు తెలిపిన విజయ సాయి రెడ్డి, షర్మిల

warangal police: పెళ్లి కావడంలేదని ఆత్మహత్య చేసుకున్న మహిళా కానిస్టేబుల్

Annavaram: 22 ఏళ్ల యువతికి 42 ఏళ్ల వ్యక్తితో పెళ్లి- వధువు ఏడుస్తుంటే..?

అన్నీ చూడండి

లేటెస్ట్

17-04-2025 గురువారం ఫలితాలు : దుబారా ఖర్చులు విపరీతం...

రాహు-కేతు పరివర్తనం.. సింహం, కన్యారాశికి అంతా అనుకూలం

తిరుమలలో డ్రోన్.. యూట్యూబర్‌ను అరెస్ట్ చేసిన విజిలెన్స్ అధికారులు

16-04-2025 బుధవారం ఫలితాలు : అవిశ్రాంతంగా శ్రమిస్తారు...

బుధగ్రహంతో భద్ర రాజయోగం.. మిథునం, కన్యారాశి, తులారాశికి అదృష్టం

తర్వాతి కథనం
Show comments