Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోమవారం పూట సాయంత్రం జీవ సమాధులను దర్శించుకుంటే?

Webdunia
శనివారం, 15 డిశెంబరు 2018 (19:10 IST)
సిద్ధులు, యోగులు జీవ సమాధి అవుతారని వినే వుంటాం. అయితే అలాంటి జీవ సమాధులు వెలసిన క్షేత్రాలను పూజించడం చేయవచ్చా..? జీవ సమాధులను దర్శించుకోవడం.. పూజించడం ద్వారా ఎలాంటి ఫలితాలుంటాయి..? ఇంకా జీవ సమాధులను ఏ సమయంలో పూజించాలని తెలుసుకోవాలంటే.. ఈ కథనం చదవండి.


న్యాయమైన కోర్కెలు నెరవేరాలంటే.. సోమవారం సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల్లోపు దర్శించుకోవాలి. ఇలా ఎనిమిది సోమవారాలు దర్శించుకోవడం, పూజించడం చేయాలి.
 
కులదైవం ఏమిటో తెలియనివారు, కులదైవ కోపానికి గురైనవారు, కులదైవ పూజ చేయని వారు, కులదైవాన్ని శుభ్రం మరిచిపోయిన వారు.. ఇలాంటి చర్యలతో ఇబ్బందులు, ఈతిబాధలు ఎదుర్కొనే వారు.. మంగళవారాల్లో సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల్లో జీవ సమాధులను దర్శించుకుని నేతి దీపం వెలిగించి.. అగరవత్తులు ధూపమేయాలి. ఇలా ఎనిమిది వారాలు జీవ సమాధులను దర్శించుకోవడం మంచిది. 
 
వ్యాపారాల్లో అభివృద్ధి పొందాలనుకునేవారు.. ఉద్యోగాల్లో రాణించాలనుకునేవారు, ఆర్థికాభివృద్ధి పొందాలనుకునేవారు.. జీవ సమాధులను దర్శించుకోవడం మంచిది. ఇలాంటి వారు బుధవారాల్లో సాయంత్రం ఐదు నుంచి ఏడు గంటల్లోపు దర్శించుకోవాలి. ఇలా ఎనిమిది వారాలు చేయాలి. 
 
అలాగే గురువారాల్లో ఆధ్యాత్మిక చింతనను పెంచేందుకు జీవ సమాధులు ఉపయోగపడతాయి. ఉద్యోగ రీత్యా ఇబ్బందులు తొలగిపోవాలంటే.. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కాలనుకునేవారు.. శుక్రవారం రోజున సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల్లోపు జీవ సమాధిని దర్శించుకోవడం మంచిది. ఇలా ఎనిమిది శుక్రవారాలు చేయాలి. 
 
అలాగే శనివారాల్లో జీవ సమాధులను దర్శించుకుంటే.. కుటుంబ సమస్యలు, వ్యాపారాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. కోర్టు వివాదాలు, న్యాయస్థానాల సమస్యలు తొలగిపోవాలంటే.. ఆదివారం జీవ సమాధులను దర్శించుకోవడం ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. ఆదివారం సాయంత్రం ఐదు నుంచి ఏడు గంటల్లోపు దర్శించుకోవాలి.
 
ఇంకా జీవసమాధులను దర్శించుకునేవారు ఎవరైనా.. ఆ రోజున మాంసాహారం తీసుకోవడం నిషిద్ధం. ఏ ప్రాంతంలో నివసిస్తున్నారో ఆ ప్రాంతంలోని ఏదైనా జీవ సమాధిని దర్శించుకోవడం ద్వారా సకల దోషాలు తొలగిపోతాయి. ఇంకా ఎనిమిది వారాల పాటు జీవ సమాధులను దర్శించుకుంటేనే సకలసుఖ సంతోషాలను పొందవచ్చు. కానీ ఎనిమిది వారాలు జీవ సమాధులను వరుసగా దర్శించుకున్నాక.. నెలకోసారి మూడు నెలలకు ఓసారి మాత్రమే దర్శించుకుంటే సరిపోతుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

తర్వాతి కథనం
Show comments