Webdunia - Bharat's app for daily news and videos

Install App

Shitala Shashti 2025: శీతల షష్ఠి విశిష్ఠత- శివపార్వతులను, కార్తికేయుడిని పూజిస్తే?

సెల్వి
శనివారం, 31 మే 2025 (13:56 IST)
శీతల షష్ఠి అనేది శివపార్వతీ దేవి పవిత్ర కలయికను గుర్తుకు తెస్తుంది. జ్యేష్ఠ మాసంలో శుక్ల పక్షంలో ఆరవ రోజు (షష్ఠి) జరుపుకునే ఇది సాధారణంగా మే లేదా జూన్ నెలల్లో జరుగుతుంది. ఒడిశాలోని సంబల్‌పూర్‌లో శీతల షష్ఠి వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఈ సంవత్సరం, శీతల షష్ఠిని 2025 మే 31న జరుపుకుంటారు.
 
శివ పురాణం ప్రకారం సీతల్ షష్టి శివుడు-పార్వతి దేవి పవిత్ర వివాహాన్ని సూచిస్తుంది. ఇది పురాతన కాలం నాటిది. పురాణాల ప్రకారం, సతీదేవి యొక్క స్వరూపమైన పార్వతి, శివుడిని తన జీవిత భాగస్వామిగా పొందడానికి  కఠినమైన తపస్సు చేస్తుంది. ఆమె భక్తికి మెచ్చి పార్వతీదేవిని శివుడు స్వీకరిస్తాడు. ఈ దివ్య కలయిక జ్యేష్ఠ శుక్ల పక్ష షష్టి రోజున జరిగింది.
 
అలాగే శీతల షష్టి కార్తికేయునికి కూడా ప్రీతికరం. కుమార స్వామి రాక్షసుడు తారకాసురుడిని జయించిన కారణంగానూ ఈ షష్ఠి రోజున పూజలందుకుంటాడు. ఒడిశా సంబల్పూర్‌లో, దీనిని 'సీతల్ షష్టి యాత్ర ఉత్సవం' అని పిలుస్తారు. వేడుకలు 5 రోజులు కొనసాగుతాయి. 
 
పురాణాల ప్రకారం, సంతానం లేని వారు శీతల షష్టి వ్రతాన్ని జరుపుకుంటారు. దీనిని ఆచరించడం వల్ల మీరు దీర్ఘకాలిక వ్యాధుల నుండి బయటపడతారు. మీకు అన్నీ శుభాలే కలుగుతాయి. మహిళలు భర్తల దీర్ఘాయువు కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ రోజున శివపార్వతులను, కార్తీకేయుడిని పూజించడం వల్ల సకల శుభాలు చేకూరుతాయి. 
 
శీతల షష్టి 2025: తేదీ, సమయం  
శీతల షష్టి 2025 తేదీ: 31 మే 2025, 
శనివారం
- షష్ఠి తిథి ప్రారంభం: 31 మే 2025, రాత్రి 08:15 గంటలు
ఆదివారం- షష్టి తిథి ముగింపు: 01 జూన్ 2025 రాత్రి 08:00 గంటలు 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దేశంలోని సురక్షిత నగరాల్లో హైదరాబాద్‌కు ఎన్నో స్థానం?

అక్రమ వలసల అడ్డుకట్టకు కొత్త నిబంధన అమలు : అమెరికా

Sunitha, పులివెందులకు వెళ్లేందుకు భద్రత కావాలి: వైఎస్ సునీత

'బి-నేలమాళిగ’ తెరిచే అంశంపై చర్చ.. తుది నిర్ణయం పూజారులదే..

ఏటీఎంలోని నగదు వాడేశాడు.. నేరం బయటపడకుండా ఉండేందుకు...

అన్నీ చూడండి

లేటెస్ట్

శ్రావణ పౌర్ణమి.. శివాలయంలో దీపదానం చేస్తే ఆ బాధల నుంచి విముక్తి?

07-08-2025 గురువారం ఫలితాలు - మీ ఓర్పునకు పరీక్షా సమయం...

Shravana Masam: గురుగ్రహ దోషాలను దూరం చేసే శ్రావణ గురువారం పూజ

Sravana Masam: శ్రావణ మాసంలో గురువారం పూట ఎవరిని పూజించాలి?

06-08-2025 బుధవారం ఫలితాలు - లక్ష్య సాధనకు ఓర్పు ప్రధానం...

తర్వాతి కథనం
Show comments