Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూర్యుడు పాటించిన సంకష్టహర చతుర్థి వ్రతం.. నవగహ్రదోషాలు మటాష్

సెల్వి
శనివారం, 15 ఫిబ్రవరి 2025 (19:07 IST)
జ్ఞానం, శ్రేయస్సు, అదృష్టానికి దేవుడైన గణేశుడికి ప్రత్యేక ఆరాధనలను సంకష్టహర చతుర్థి రోజున చేస్తారు. కృష్ణపక్షంలో నాలుగో రోజున ఈ తిథి వస్తుంది. ఇది మాసానికి ఒకసారి వచ్చినా.. కృష్ణపక్షంలో వచ్చే చతుర్థిని సంకష్టహర చతుర్థి అని గుర్తిస్తారు.
 
లక్షలాది మంది భక్తులు ప్రతి నెల క్షీణిస్తున్న చంద్రుని నాల్గవ రోజున గణేశునికి పూజలు, అభిషేకాలు చేస్తారు. ఆయనకు ఇష్టమైన మోదకాలు నైవేద్యంగా సమర్పించుకుంటారు. 'సంకటహర' అనే పదానికి కష్టాలను తొలగించేవాడు అని అర్థం. అందుకే ఈ రోజున వినాయకుడిని పూజించడం ద్వారా జీవితంలో అడ్డంకులు తొలగిపోతాయి. అదృష్టం వరిస్తుంది. 
 
ఈ ప్రపంచానికి ప్రకాశాన్ని ఇచ్చే సూర్యనారాయణుడు తన జీవితంలోని అన్ని అడ్డంకులు, బాధలను తొలగించుకోవడానికి సంకష్టహర చతుర్థి రోజున ఉపవాసం పాటించి, గణేశుడిని పూజించినట్లు పురాణాలు చెప్తున్నారు. ఈ వ్రతాన్ని సూర్యభగవానుడిని ఆచరించమని నారద మహర్షి సూచించినట్లు చెప్పబడింది. నారద మహర్షి సూచన మేరకు సూర్యుడు గణేశుడిని పూజించి తన అడ్డంకులకు తొలగించుకున్నాడు. 
 
ఈ రోజున తెల్లవారుజాము నుండి సూర్యాస్తమయం వరకు చంద్రోదయం వరకు కఠినమైన ఉపవాసం ఉండాలి. కొందరు పండ్లు, పాలు లేదా ఇతర తేలికపాటి ఆహారాలు తీసుకుంటూ పాక్షిక ఉపవాసం ఉంటారు. సంకటహర చతుర్థి ఉపవాస నియమాలు చంద్రుడిని చూడటం, గణపతి పూజ చేయడంతో ముగుస్తాయి.
 
గణపతికి ఈ రోజున భక్తులు పువ్వులు, మోదకాలు, పండ్లు, కొబ్బరికాయ సమర్పిస్తారు. గణేశుడికి ఇష్టమైన మంత్రాలతో జపిస్తారు. సంకటహర చతుర్థిలో చంద్రుడికి కూడా ప్రాముఖ్యత ఉంటుంది. పూజ పూర్తయిన తర్వాత, ప్రజలు చంద్రోదయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తారు. చంద్రుడిని ఈ సందర్భంగా ప్రార్థిస్తారు. చంద్రదర్శనం తర్వాత  ఉపవాసం విరమిస్తారు.
 
జీవితంలో ఎదురయ్యే సమస్యల నుండి బయటపడటానికి సంకష్టహర పూజ చేస్తారు. ఈ పూజ ద్వారా నవగ్రహదోషాలు దరిచేరవు. సకలసంపదలు చేకూరుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అప్పులు చేసి ఏపీని సర్వనాశం చేశారు.. జగన్‌పై నారా లోకేష్

పట్టపగలే నడి రోడ్డుపై హత్య.. మద్యం తాగి వేధిస్తున్నాడని అన్నయ్యను చంపేశారు..

మహా కుంభమేళాలో పవిత్ర స్నానమాచరించిన నారా లోకేష్ దంపతులు (Photos)

త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసిన మంత్రి లోకేశ్ దంపతులు (Video)

ట్రాఫిక్ రద్దీ : పారాగ్లైడింగ్ ద్వారా పరీక్షా కేంద్రానికి చేరుకున్న విద్యార్థి (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

అయ్యప్ప భక్తులకు శుభవార్త చెప్పిన శబరి దేవస్థాన బోర్డు

16-02-2025 ఆదివారం రాశిఫలాలు - ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు...

భారతదేశపు రూ.6 లక్షల కోట్ల ఆలయ ఆర్థిక వ్యవస్థ: అంతర్జాతీయ టెంపుల్స్ కన్వెన్షన్-ఎక్స్‌పోలో చేరిన శ్రీ మందిర్

శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. మెగాస్టార్‌కు ఆహ్వానం

సూర్యుడు పాటించిన సంకష్టహర చతుర్థి వ్రతం.. నవగహ్రదోషాలు మటాష్

తర్వాతి కథనం
Show comments