Webdunia - Bharat's app for daily news and videos

Install App

దంపతుల మధ్య అన్యోన్యత పెరగాలంటే.. పడకగదిలో రాళ్ల ఉప్పును..? (video)

Webdunia
శుక్రవారం, 27 డిశెంబరు 2019 (11:38 IST)
మీరు ఇతరులకు మంచి చేసేవారా? అయినా కొన్ని ఆర్థిక, మానసిక ఇబ్బందులు వేధిస్తున్నాయా? అయితే ఇలా చేయండి అంటున్నారు.. ఆధ్యాత్మిక నిపుణులు. కంటికి తెలియని ప్రతికూల శక్తుల కారణంగా ఇలాంటి ఇబ్బందులు ఏర్పడుతాయని వారు చెప్తున్నారు. అలాంటి శక్తులను పారద్రోలి.. ప్రతికూల ఫలితాలను తరిమికొట్టి సానుకూల ఫలితాలను ఇచ్చే శక్తి ఒక్క రాళ్ల ఉప్పుకే వుంది. కంటి దృష్టి లోపాలను తొలగించుకోవాలంటే.. రాళ్ల ఉప్పుతో ఇలా చేస్తే సరిపోతుంది. అవేంటో చూద్దాం.. 
 
ఓ గాజు బౌల్‌ తీసుకుని అందులో వంటకు ఉపయోగించే రాళ్ల ఉప్పును వేయాలి. ఆ బౌల్‌ను స్నానపు గది అలమరాల్లో పైభాగాన వుంచాలి. ఈ బౌల్‌పై నీరు పడకూడదు. అలా వుంచిన ఉప్పు కరుగుతుంది. ఆ ఉప్పు కరిగిన తర్వాత దానిని తొలగించి మళ్లీ ఉప్పును నింపి అదే ప్రాంతంలో వుంచాలి. ఇలా చేస్తే ఇంటికి దృష్టిలోపాలు వుండవు. దారిద్ర్యం తొలగిపోతుంది. 
 
అంతేగాకుండా ఇంటిని వారానికి ఓసారి శుభ్రపరిచే నీటిలో పసుపు, రాళ్ల ఉప్పును వేసి శుభ్రం చేయాలి. ఇలా చేస్తే ఇంట్లో వుండే ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. మంచి ఫలితాలుంటాయి. ఆర్థిక రాబడి వుంటుంది. ఇకపోతే.. ధనాన్ని వుంచే పర్సుల్లో చిటికెడు రాళ్ల ఉప్పును పేపర్లో మడతపెట్టి వుంచితే ఆర్థిక ఇబ్బందులు ఏమాత్రం వుండవు. 
 
ఇంకా దంపతుల మధ్య అన్యోన్యత పెరగాలంటే.. విభేదాలు తొలగిపోవాలంటే పడకగదిలోని పై అలమరాల్లో రాళ్ల ఉప్పును నింపిన బౌల్‌ను వుంచి వారానికి ఓసారి ఆ ఉప్పును మార్చుతూ వుంటే సరిపోతుంది. ఇకపోతే.. రోజువారీ ఉపయోగించే వాహనాలను శుభ్రపరిచేటప్పుడు కూడా ఆ నీటిలో రాళ్ల ఉప్పును వేసి శుభ్రపరచడం ద్వారా ప్రతికూల శక్తుల నుంచి తప్పుకోవచ్చు. ఇంకా వాహనాల కోసం వెచ్చించే అనవసరపు ఖర్చు తగ్గుతుంది. ఇంకా ప్రమాదాలు జరగవు. అంతేగాకుండా వారానికి రెండుసార్లు స్నానం చేసే నీటిలో ఉప్పును వేసి స్నానం చేస్తే అనారోగ్య సమస్యలు వుండవు. మానసిక ఇబ్బందులు తొలగిపోతాయి. సానుకూల ప్రభావం ఏర్పడుతుందని ఆధ్యాత్మిక నిపుణులు సూచిస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

23-04-2024 మంగళవారం దినఫలాలు - ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలం

హనుమాన్ జయంతి.. పూజ ఎలా చేయాలి..

21-04-2024 ఆదివారం దినఫలాలు - లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం...

21-04-2024 నుంచి 27-04-2024 వరకు ఫలితాలు మీ రాశిఫలితాలు

20-04-202 శనివారం దినఫలాలు - కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు...

తర్వాతి కథనం
Show comments