నిర్జల ఏకాదశి.. ఆ రోజున ఏం చేయాలి?

Webdunia
శుక్రవారం, 10 జూన్ 2022 (00:01 IST)
జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి తిథిని నిర్జల ఏకాదశిగా జరుపుకుంటారు. 2022 సంవత్సరంలో జూన్ 10వ తేదీన శుక్రవారం ఉదయం 7:25 గంటలకు శుభ ముహుర్తం ప్రారంభమవుతుంది. ఇదే ఏకాదశి మరుసటి రోజు అంటే 11 జూన్ 2022 శనివారం రోజున సాయంత్రం 5:45 గంటలకు ముగుస్తుంది. నిర్జల ఏకాదశి సమయంలో ఉండే ఉపవాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్రమైన రోజున ఉపవాసానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. 
 
నిర్జల ఏకాదశి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి. ముందుగా స్నానం చేసి సూర్య దేవునికి నీటిని అర్పించాలి. అనంతరం శ్రీ మహావిష్ణువుకు పూలు, పండ్లు, అక్షింతలు, చందనంతో పూజలు చేయాలి. 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అనే మంత్రాన్ని జపిస్తూ రోజంతా గడపాలి. ఆ తర్వాత విష్ణుమూర్తిని ప్రసన్నం చేసుకునేందుకు స్వామి ప్రసాదాన్ని ప్రతి ఒక్కరికీ అందించాలి. ఉపవాసం పూర్తయిన తర్వాతే నీటిని తాగాలి.
 
ఏకాదశి రాత్రి వేళ పురాణ కాలక్షేపంతో జాగరణ చేయాలని చేస్తుంటారు. ఇక ఉపవాస విరమణ సమయంలో ద్వాదశి నాడు బ్రాహ్మణులకు ఆహార పదార్థాలను దానంగా ఇస్తారు. అలాగే అతిథులను భోజనానికి పిలిచి, ఉపవాస వ్రతాన్ని విరమించడం వంటివి చేస్తారు. ఈ రోజున ఎవరైనా తమ శక్తి, సామర్థ్యం మేరక దానధర్మాలు చేస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేరళం చీఫ్ మినిస్టర్ అనే డిజిగ్నేషన్ తొలగించిన పినరయి విజయన్, ఓడిపోతానని తెలిసిపోయిందా?

నామకరణ వేడుకలో విషాదం : మద్యం కోసం నీళ్లు తీసుకుని రాలేదని బాలుడిని కాల్చి చంపేశారు...

దేశ వ్యాప్తంగా ముగిసిన నీట్ ప్రవేశ పరీక్ష - ప్రశ్నపత్రం ఎలా ఉందంటే...

చెన్నైలో డాక్టర్ అగర్వాల్స్ రెటీనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 16వ ఎడిషన్ రెటికాన్ ప్రారంభం

నైట్ క్లబ్‌లో పెళ్లి వేడుకలు డీజేను వాయించి నృత్యం చేసిన యూఎస్ విదేశాంగ మంత్రి (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

01-05-2026 శుక్రవారం ఫలితాలు - తలపెట్టిన కార్యం సిద్ధిస్తుంది

Vaishakh Purnima 2026: వైశాఖ పౌర్ణమి: చంద్రుడు, శ్రీలక్ష్మి పూజతో సర్వం శుభం

01-05-2026 నుంచి 31-05-2026 వరకు మీ మాస ఫలితాలు

30-04-2026 గురువారం ఫలితాలు - గ్రహసంచారం బాగుంది

Sri Narasimha Jayanti: నృసింహ జయంతి: పానకం, వడపప్పు... ఈ మంత్రాలతో పూజిస్తే..?

తర్వాతి కథనం
Show comments