నాగ పంచమి-గరుడ పంచమి రోజున ఇలా పూజలు చేస్తే...

కశ్యప ప్రజాపతికి వినత, కద్రువ అనే ఇద్దరు భార్యలు ఉండేవారు. వినతకి గరుత్మంతుడు జన్మించగా, కద్రువ కడుపున సర్పజాతి జన్మించింది. కద్రువకు సర్పజాతి జన్మించిన శ్రావణ శుద్ధ పంచమిని నాగ పంచమిగా పిలుబడుతోంది.

Webdunia
గురువారం, 9 ఆగస్టు 2018 (11:21 IST)
కశ్యప ప్రజాపతికి వినత, కద్రువ అనే ఇద్దరు భార్యలు ఉండేవారు. వినతకి గరుత్మంతుడు జన్మించగా, కద్రువ కడుపున సర్పజాతి జన్మించింది.  కద్రువకు సర్పజాతి జన్మించిన శ్రావణ శుద్ధ పంచమిని నాగ పంచమిగా పిలుబడుతోంది. ఇదే రోజున వినతకి గరుత్మంతుడు జన్మించిన కారణంగా శ్రావణ శుద్ధ పంచమిని గరుడ పంచమిగా పిలువబడెను.
 
శ్రావణ శుద్ధ పంచమి రోజున సర్పజాతి జన్మించిది కనుక సర్పభయం లేకుండా ఉండడం కోసం ఈ రోజంతా నాగపూజలు చేస్తుంటారు. అలాగే ఇదే రోజున గరుడ పంచమిగా చెప్పబడుతున్న ఈ రోజున గరుత్మంతుడు వంటి మాతృభక్తి కలిగిన సంతానం కలగాలని గరుడ పంచమి వ్రతం చేస్తుంటారు. అయితే సోదరులు ఉన్న స్త్రీలు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరించాలనే నియమం ఉంది. 
 
సౌభాగ్యంతో పాటు చక్కని సంతానాన్ని ఇచ్చే ఈ వ్రతంలో గౌరీదేవి పూజలు అందుకుంటుంది. విశేషమైనదిగా చెప్పబడుతోన్న ఈ వ్రతాన్ని పది సంవత్సరాల పాటు ఆచరించి ఆ తరువాత ఉద్యాపన చెప్పుకోవలసి ఉంటుంది. సాధారణంగా ఏ తల్లి అయినా తన కొడుకు తాను గర్వించేలా, లోకం మెచ్చేలా ఉండాలని అనుకుంటుంది.
 
అలా తన తల్లికి దాస్యం నుంచి విముక్తిని కలిగించడం కోసం గరుత్మంతుడు దేవలోకం నుంచి అమృత కలశం తీసుకువచ్చాడు. అందుకోసం దేవేంద్రుడితోనే పోరాడాడు. సాక్షాత్తు శ్రీమహావిష్ణువు అభినందనలను అందుకుని ఆయన వాహనంగా ఉండిపోయాడు. అలాంటి ఈ రోజున గరుడ పంచమి వ్రతాన్ని ఆచరించడం వలన ఆరోగ్యవంతులైన, ధైర్యవంతులైన సంతానం కలుగుతుందని చెప్పబడుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భాష అనేది ఒక చాయిస్ మాత్రమే.. బలవంతంగా రుద్దలేం...

కడప జిల్లాలో మైనర్ బాలికపై అత్యాచారం.. తీవ్ర రక్తస్రావం - రిమ్స్‌ ఆస్పత్రికి తరలింపు

సుగాలి ప్రీతి హత్య కేసు దర్యాప్తును ఏపీ సర్కారు నిర్లక్ష్యం చేసింది.. జగన్ ఫైర్

బెంగాల్ నుంచి బంగ్లాదేశ్‌కు చీమల బారుల్లా వెళ్లిపోతున్న బంగ్లాదేశీయులు, వీడియో

కన్నతల్లినే పక్కలోకి రమ్మన్న కామాంధ కొడుకు, పళ్లతో కొరికి, తలపై కొట్టి, వీడియో

అన్నీ చూడండి

లేటెస్ట్

మూడేళ్లకు ఒకసారి వచ్చే పద్మిని ఏకాదశి.. తులసి దళాలతో అర్చన చేస్తే?

27-05-2026 బుధవారం ఫలితాలు- దంపతుల మధ్య అకారణ కలహం

Eid Al-Adha 2026 date: తెలుగు రాష్ట్రాల్లో మే 28, 2026 గురువారం బక్రీద్.. సెలవు దినం

26-05-2026 మంగళవారం ఫలితాలు - ధనసహాయం తగదు

25-05-2026 సోమవారం ఫలితాలు - ఖర్చులు అదుపులో ఉండవు.. ముఖ్యుల కలయిక వీలుపడదు...

తర్వాతి కథనం
Show comments