Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నాగ పంచమి రోజున ఆ రెండు పనులు చేయకండి..

స్కంద పురాణంలో నాగ పంచమి విశిష్టతను సాక్షాత్ పరమ శివుడే పురాణాల్లో వివరించి వున్నాడు. శ్రావణ శుద్ధ పంచమి నాడు చేసే నాగ పంచమి పూజ అత్యంత విశిష్టమైనది. ఒకప్పుడు ఆదిశేషుని సేవకు సంతోషించిన విష్ణుమూర్తి ఏ

నాగ పంచమి రోజున ఆ రెండు పనులు చేయకండి..
, మంగళవారం, 7 ఆగస్టు 2018 (13:20 IST)
స్కంద పురాణంలో నాగ పంచమి విశిష్టతను సాక్షాత్ పరమ శివుడే పురాణాల్లో వివరించి వున్నాడు. శ్రావణ శుద్ధ పంచమి నాడు చేసే నాగ పంచమి పూజ అత్యంత విశిష్టమైనది. ఒకప్పుడు ఆదిశేషుని సేవకు సంతోషించిన విష్ణుమూర్తి ఏదైనా వరం కోరుకోమన్నాడు. అందుకు ఆదిశేషుడు ''తాము ఉద్బవించిన పంచమి రోజు సృష్టిలోని మానవాళి సర్ప పూజలు చేయాలని'' వరం కోరుకున్నాడు. ఆదిశేషుని కోరికని మన్నించి మహా విష్ణువు ఈ నాగుల పంచమి రోజు సర్ప పూజలు అందరూ చేస్తారని వరాన్ని ఇస్తాడు. 
 
నాగ పంచమి రోజు నాగులని పూజించి, గోధుమతో చేసిన పాయశాన్ని నైవేద్యముగా పెడతారు. నాగ పంచమి రోజు పగలంతా ఉపవాసం ఉండి, రాత్రికి భోజనం చేస్తారు. నాగ పంచమి రోజున నాగ దేవతలను పూజించినవారికి విష భాధలు ఉండవు. సర్ప స్తోత్రాన్ని నాగ పంచమి రోజున చదివిన వారికి ఇంద్రియాలచే ఏర్పడే రోగాలుండవు. సంతానం కలుగుతుంది. వంశాభివృద్ధి చేకూరుతుంది. కార్యసిద్ధి జరుగుతుంది. అన్ని కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. కాలసర్పదోషాలు, నాగదోషాలు తొలగిపోతాయి. 
 
శ్రావణమాసం శుద్ధ పంచమి రోజును నాగ పంచమి అంటారు. బ్రహ్మదేవుడు, ఆదిశేషువును అనుగ్రహించిన రోజుగా దీన్ని పరిగణిస్తారు. నాగులచవితి మాదిరిగానే నాగ పంచమి నాడు నాగ దేవతను పూజించి, పుట్టలో పాలు పోస్తారు. ఈ రోజున సర్పపూజ చేయడం ద్వారా సంతాన ప్రాప్తి చేకూరుతుంది. అలాగే రాహు-కేతు దోషాలు తొలగిపోతాయి. 
 
ముఖ్యంగా.. ఆగస్టు 15 (బుధవారం) వచ్చే నాగపంచమి రోజున శ్రీకాళహస్తీశ్వరునికి అభిషేకం చేయించిన వారికి సకలసంపదలు చేకూరుతాయి. రాహు, కేతు దోషాలు, సర్పదోషాలు, కాలసర్పదోషాలు తొలగిపోతాయి. అలాగే అనంత పద్మనాభ స్వామికి అభిషేకాలు, అలంకారాలు చేయించిన వారికి ఈతిబాధలు తొలగిపోతాయి. ఆర్థిక ఇబ్బందులంటూ వుండవు.
 
త్రేతాయుగంలో శ్రీరామునికి తమ్ముడిగా లక్ష్మణుడు జన్మించాడు. ఇతడు ఆదిశేషుడేనని పురాణాలు చెప్తున్నాయి. అలాగే ద్వాపర యుగంలో శ్రీకృష్ణునికి సోదరుడుగా ఆదిశేషుడు బలరాముడిగా జన్మనెత్తాడు. యమునా నదిలోని కాళీయుడిని అణచి వేసి.. కాళీయ మర్దనం చేసిన రోజునే నాగపంచమిగానూ, గరుడ పంచమిగానూ జరుపుకుంటారని ఆధ్యాత్మిక నిపుణులు చెప్తున్నారు.
 
నాగ పంచమి రోజున దేశ వ్యాప్తంగా ప్రజలు నాగదేవతలను పూజిస్తారు. పుట్టకు పాలు పోస్తారు. నాగదేవతా విగ్రహాలకు నీరు, పాలు, పసుపు, కుంకుమతో అభిషేకం చేయిస్తారు. ఆపై నైవేద్యం సమర్పించి హారతులిస్తారు. అలాగే పసుపు రంగు దారాలను చేతికి కడతారు. కొందరు నాగదేవత బొమ్మలను తయారు చేసి పూజలు చేస్తుంది. నాగపంచమినే గరుడ పంచమిగా పిలుస్తారు. అందుచేత ఆ రోజున మట్టి తవ్వడం, చెట్లను నరకడం  చేయకూడదని పండితులు సూచిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మంగళవారం (07-08-2018) దినఫలాలు - ఉచిత సలహా ఇచ్చి...