వారాహి దేవికి పెసళ్లతో దీపం వెలిగిస్తే..? (video)

Webdunia
బుధవారం, 26 జులై 2023 (19:49 IST)
సాధారణంగా వారాహి రూపంలో వుండే వారాహి దేవత సప్తకన్యల్లో ఒకరు. ఆమె కారు మేఘం వంటి రూపంలో వుంటుందని దేవీ భాగవతంలో చెప్పబడుతోంది. ఈ వారాహి దేవిని పూర్వకాలంలో రహస్యం రాజులు, మంత్రులు, సైనికులు, మాంత్రికులు, తాంత్రికులు, శత్రువులు వుండేటటువంటి వారు కొలిచేవారట.
 
ప్రస్తుతం ఆమెను మాసాల్లో వచ్చే పంచమి నాడు భక్తులు కొలవడం చేస్తున్నారు. కలియుగంలో వారాహి రూపంలో వున్న ఈ మాతను పూజించే వారికి సర్వశుభాలు చేకూరుతాయి. ఈమె మహా విష్ణువు అంశం. అలాంటి ఆమెను కొలిస్తే కోరికలు ఇట్టే నెరవేరుతాయి. 
 
ఇక మీ కోరికలు సులభంగా నెరవేరాలంటే ఈ పరిహారాన్ని ఇంట్లో చేయవచ్చు అంటున్నారు.. ఆధ్యాత్మిక పండితులు. వారాహి అమ్మవారికి ఈ దీపాన్ని వెలిగించడం ద్వారా మీరు అనుకున్న కార్యాలు తప్పక నెరవేరుతాయి. ఈ పరిహారాన్ని ఇంట్లో కానీ లేకుంటే వారాహి అమ్మవారు కొలువై వుండే ఆలయలోనూ చేయవచ్చు. ఇంతకీ ఆ పరిహారం ఏంటో చూద్దాం. 
 
పెసళ్లను ఓ ప్లేటులోకి తీసుకుని చదునుగా చేసుకోవాలి. వారాహిదేవి పటం ముందు ఈ పెసళ్లతో నింపిన ప్లేటును వుంచి.. దానిపై రెండు ప్రమిదలతో నేతి దీపం లేకుంటే నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. ఇలా తొమ్మిది రోజులు వరుసగా ఈ దీపాన్ని వెలిగించి.. వారాహి అమ్మవారిని పూజించాలి.
 
ఇలా చేస్తే మీ సంకల్పం సిద్ధిస్తుందని వారాహి దేవి ఉపాసకులు చెప్తున్నారు. ఈ దీపం వెలిగించడం ద్వారా వారాహి దేవి అనుగ్రహం లభిస్తుంది. తొమ్మిది రోజుల తర్వాత ఈ పెసళ్లను ఆవులకు మేతగా ఇవ్వడం లేదా.. చెరువుల్లో వేయడం చేయొచ్చు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

2024 జూన్ 2 నుంచి ఏపీ రాజధాని అమరావతి, రాష్ట్రపతి ఆమోద ముద్ర

జంట హత్యల కేసులో తొమ్మిది పోలీసులకు మరణశిక్ష: మదురై కోర్టు సంచలన తీర్పు

వివాహేతర సంబంధం - గొంతులో పొడిచి భార్యను హత్య చేసిన భర్త

భార్యతో మాజీ ఎమ్మెల్యే అఫైర్- సొంత యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించిన భర్త

కీలక దశకు చేరుకున్న ఆర్టెమిస్-2 యాత్ర - 10న భూమికి తిరిగిరాక

అన్నీ చూడండి

లేటెస్ట్

హనుమజ్జయంతి.. కోటి సంవత్సరాల ముందు పుట్టారు.. 41 రోజుల దీక్ష

02-04-2026 గురువారం ఫలితాలు-విశేషమైన కార్యసిద్ధి ఉంది

ప్రపంచ ధ్యాన నిపుణుల కమిటీకి ఎంపికైన పూజ్యశ్రీ శివకృపానంద్ స్వామిజీ

01-04-2026 బుధవారం ఫలితాలు - ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు

01-04-2026 నుంచి 30-04- 2026 వరకు మాస ఫలితాలు- సత్కాలం సమీపిస్తుంది..

తర్వాతి కథనం
Show comments