Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిసెంబర్ 21, 2017: ఏ పనులు ప్రారంభించొద్దు.. #UnluckyDay (video)

కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటున్నారా? అయితే గురువారం (డిసెంబర్ 21) మాత్రం ప్రారంభించకండి అంటున్నారు జ్యోతిష్య నిపుణులు. ఎందుకంటే గురువారం... సూర్యుడు, శని ఒకే రాశిలోకి వస్తున్నారని.. 350 సంవత్సరాల త

Webdunia
బుధవారం, 20 డిశెంబరు 2017 (18:35 IST)
కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటున్నారా? అయితే గురువారం (డిసెంబర్ 21) మాత్రం ప్రారంభించకండి అంటున్నారు జ్యోతిష్య నిపుణులు. ఎందుకంటే గురువారం... సూర్యుడు, శని ఒకే రాశిలోకి వస్తున్నారని.. 350 సంవత్సరాల తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంటుందని వారు అంటున్నారు. ఒకవేళ గురువారం ఏదైనా కొత్త పనులు ప్రారంభిస్తే.. ఈ పనులు అర్థాంతంగా ముగియడం.. అశుభ ఫలితాలను ఇవ్వడం జరుగుతుందట.
 
గురువారం నాడు సూర్యుడు, శని ఒకే  రాశిలో రావడం ద్వారా ఏడాది పాటు ఆ ప్రభావం వుంటుందని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. ఇక డిసెంబర్ 21న పగటి కాలం నిడివి తక్కువని.. సూర్యుడు, శని గ్రహాలు ఒకే రాశిలోకి రావడం ఇలా రావడం 350 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారని, ప్రళయానికి ఇది సంకేతమని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. 
 
1664 తర్వాత ఖగోళంలో ఇలాంటి మార్పు కనిపించడం ఇదే తొలిసారని నీల్ స్పెన్సర్ అనే పాశ్చాత్య జ్యోతిష్యుడు చెప్తున్నారు. కాబట్టి గురువారం చాలా జాగ్రత్తగా ఉండాలని.. ఏ పనిని మొదలు పెట్టకూడదని.. కొత్త నిర్ణయాలకు దూరంగా వుండాలని చెప్తున్నారు. సూర్యుడు మకరంలోకి ఈ రోజున ప్రవేశించడం మంచిదే.

కానీ డిసెంబర్ 19వ తేదీన మకర రాశిలోకి వచ్చేశాడు. దీంతో డిసెంబర్ 21 అన్ లక్కీ డే అంటూ పాశ్చాత్య జ్యోతిష్య వెబ్ సైట్లు కోడై కూస్తున్నాయి. ఈ రోజున మానవుల్లో ఎనర్జీ లెవల్స్ చాలా తక్కువగా వుంటాయి. అందుకే ఆ రోజున ఎలాంటి పనులు, వ్యాపారాలు, శుభకార్యాలు చేపట్టకపోవడం మంచిది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణాలో భారీ వర్షాలు - ఏకంగా 38 రైళ్లు రద్దు

కర్నాటకలో వింత - నీలి రంగు గుడ్డు పెట్టిన కోడి

రోడ్డు దాటుతున్న అమ్మాయిలను తాకిన వారి కీళ్లు ఇరగ్గొట్టిన పోలీసులు (video)

Tantrik: తాంత్రికుడిచ్చిన సలహా.. మనవడిని చంపిన తాతయ్య.. కారణం తెలిస్తే షాకవుతారు?

ఐటీ ఉద్యోగిని కిడ్నాప్ కేసు : లక్ష్మీ మీనన్‌కు భారీ ఊరట

అన్నీ చూడండి

లేటెస్ట్

25-08-2025 సోమవారం ఫలితాలు - ఒప్పందాల్లో జాగ్రత్త.. ఏకపక్ష నిర్ణయాలు తగవు...

Ganesh Chaturthi 2025: వక్రతుండ మహాకాయ

గణేశుడికి ఇష్టమైన నైవేద్యాలు ఏమిటి?

24-08-2025 నుంచి 30-08-2025 వరకు మీ వార ఫలితాల - వృత్తి ఉద్యోగాల్లో రాణింపు...

24-08-2025 ఆదివారం మీ రోజువారీ ఫలితాలు

తర్వాతి కథనం
Show comments