Webdunia - Bharat's app for daily news and videos

Install App

శుక్రవారం ఇలా పూజ చేస్తే..? అగ్గిపెట్టెను ఇతరుల వద్ద నుంచి తీసుకుంటే? (video)

Webdunia
శుక్రవారం, 28 ఆగస్టు 2020 (05:00 IST)
శుక్రవారం పూట ఇంట్లో శ్రీ మహాలక్ష్మీ దేవిని పూజిస్తే.. అనుకున్న కార్యాలు నెరవేరుతాయి. శుక్రవారం ఉదయాన్నే తలస్నానం చేసి.. పసుపు లేదా ఎరుపు లేదా ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించి.. ఇంట్లో పూజాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని అమ్మవారి ఆలయం దర్శించుకోవాలి. అక్కడ నేతితో దీపం వెలిగించడం ద్వారా దీర్ఘ సుమంగళీ ప్రాప్తం చేకూరుతుంది. 
 
శుక్రవారం విఘ్నేశ్వరునికి ఆలయానికి వెళ్తే.. గరిక మాల తీసుకెళ్లండి. గరికమాలను వినాయకునికి ప్రతి శుక్రవారం సమర్పిస్తే.. కోరిన కోరికలు నెరవేరుతాయి. శుక్రవారం శివాలయానికి వెళ్లేవారు బిల్వపత్రాలను తీసుకెళ్లడం వల్ల కష్టాలు తొలగిపోయి, సర్వ శుభాలు చేకూరుతాయి.
 
ఇదే విధంగా విష్ణుమూర్తి ఆలయాన్ని శుక్రవారం సందర్శించుకోవాలనుకుంటే తులసీ మాల సమర్పించాలి. ఆంజనేయస్వామిని దర్శించుకునే వాళ్లు వెన్నముద్దతో వెళ్లడం వల్ల వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. దుర్గమ్మను శుక్రవారం దర్శించుకునే మహిళలు పసుపు, తెలుపు, ఎరుపు రంగు పూలను సమర్పించుకుంటే ఈతిబాధ‌లు తొల‌గిపోయి సుఖసంతోషాలతో పాటు అష్టైశ్వర్యాలు పొందుతార‌ని పురాణాలు చెబుతున్నాయి.
 
ఆలయంలో కర్పూరం వెలింగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఆలయాల్లోని దీపాల వెలుగు నుంచో, ఇతరుల అగ్గిపెట్టెలు తీసుకునో దీపం వెలిగించడం మంచిది కాదు. ఇలా చేస్తే పుణ్యఫలం మీకు దక్కకుండా.. ఇతరులకు చేకూరుతుంది. 
Lights
 
శుక్రవారాల్లో చేసే పూజల ద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధించడంతో పాటు కష్టాలు తొలగిపోతాయని విశ్వాసం. శుక్రవారం మాత్రమే కాకుండా ప్రతిరోజు మహిళలు  నుదుట కుంకుమ రంగు బొట్టు పెట్టుకోవాలి. ఆలయాల్లో ఇచ్చే పసుపు కుంకుమలను నుదుట కుంకుమ కింద, విభూదిని నుదుటి బొట్టుపైన పెట్టుకోవాలని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.

 

సంబంధిత వార్తలు

భారత్‌ నుంచి నిష్క్రమిస్తామంటున్న వాట్సాప్.. నిజమా?

ఈవీఎం - వీవీప్యాట్‌ క్రాస్ వెరిఫికేషన్ కుదరదు : సుప్రీంకోర్టు

ఏప్రిల్ 28 నుంచి సిద్ధం 3.0కు రెడీ అవుతున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి

బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రిని చూసి కోన షాక్.. ఇదేదో కార్పొరేట్ హాస్పిటల్‌లా వుందే!

ఏపీ, తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. పెరగనున్న ఉష్ణోగ్రతలు.. వడగాలులు

21-04-2024 ఆదివారం దినఫలాలు - లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం...

21-04-2024 నుంచి 27-04-2024 వరకు ఫలితాలు మీ రాశిఫలితాలు

20-04-202 శనివారం దినఫలాలు - కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు...

ధనాదాయం కోసం శుక్రహోర రెమడీ.. 108 ప్రదక్షణలు 16 నేతి దీపాలు

19-04-2024 శుక్రవారం దినఫలాలు - ధనసహాయం చేసే విషయంలో పునరాలోచన...

తర్వాతి కథనం
Show comments