Webdunia - Bharat's app for daily news and videos

Install App

నరదృష్టి (నరదిష్టి) తొలగిపోవాలంటే.. వారానికోసారి ఇలా చేయండి..

నరదృష్టి తొలగిపోవాలంటే.. వారానికి ఓసారి రాళ్ల ఉప్పును స్నానం చేసే నీటిలో కలిపి స్నానం చేస్తే నరదృష్టి అంటే కంటిదృష్టి దూరమవుతుంది. శారీరక అలసట వుండదు. సోమరితనం పరారవుతుంది. ముఖ్యంగా పుట్టిన రోజుల్లో ల

Webdunia
సోమవారం, 26 ఫిబ్రవరి 2018 (18:09 IST)
నరదృష్టి తొలగిపోవాలంటే.. వారానికి ఓసారి రాళ్ల ఉప్పును స్నానం చేసే నీటిలో కలిపి స్నానం చేస్తే నరదృష్టి అంటే కంటిదృష్టి దూరమవుతుంది. శారీరక అలసట వుండదు. సోమరితనం పరారవుతుంది. ముఖ్యంగా పుట్టిన రోజుల్లో లేకుంటే మంగళవారం చేస్తే కంటిదృష్టి తొలగిపోతుంది.

అనారోగ్య సమస్యలు తలెత్తవు. అలాగే వ్యాపారాలు చేసే చోట కంటి దృష్టి తొలగిపోవాలంటే.. నిమ్మపండును సగానికి కోసి మధ్యలో కుంకుమ అద్ది వాకిటికి ఇరువైపులా వుంచితే.. అదీ మంగళవారం పూట ఇలా చేస్తే కంటి దృష్టి లోపాలుండవు. 
 
అమావాస్య, పౌర్ణమి, అష్టమి, నవమి వంటి తిథుల్లో ఉదయం, సాయంత్రం పూట సాంబ్రాణీ వేయడం మంచిది. పచ్చకర్పూరం, కస్తూరి పసుపు, అత్తరును గోమూత్రంలో కలిపి ఇంటా, వ్యాపారం చేసే చోట చల్లితే కంటి దృష్టి తొలగి.. ఆదాయం లభిస్తుంది. రుణబాధలుంటే.. వినాయక స్వామి ఆలయంలో అర్చన చేయడం మంచిది. కులదైవ పూజ చేయాలి. వినాయకుడికి అర్చన చేసిన కొబ్బరి కాయలోని నీటిని తొలగించి అందులో నెయ్యి లేదా నువ్వుల నూనెను పోసి దీపమెలిగిస్తే మంచి ఫలితాలుంటాయి. 
 
ఈతిబాధలు తొలగిపోతాయి. శుక్లపక్షంలో వచ్చే శని, ఆదివారాల్లో సముద్రతీరానికి వెళ్లి ఆ నీటిలో వాటర్ బాటిల్‌లో తెచ్చుకుని అందులో పసుపు పొడిని కలిపి.. ఇంట్లో, కార్యాలయంలో చల్లినట్లైతే కంటి దృష్టి తొలగిపోతుంది. ఇంకా సముద్రపు నీటిలో స్నానం చేయడం ద్వారా శరీరంలోని ఏడు చక్రాలకు బలం చేకూరుతుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి షాకిచ్చిన కోర్టు

జనసేన సంస్థాగత బలోపేతం కోసం త్రిశూల్ వ్యూహం : పవన్ కళ్యాణ్

బీహార్‌లో ఒక్క ఓటు కూడా చోరీ కానివ్వం : రాహుల్ గాంధీ

యూపీఎస్పీ అభ్యర్థుల కోసం ప్రతిభా సేతు పోర్టల్

ఏలూరు జిల్లాలో కానిస్టేబుల్‌ అదృశ్యం.. ఫోన్‌ సిగ్నల్‌ కట్‌!

అన్నీ చూడండి

లేటెస్ట్

29-08-2025 శుక్రవారం ఫలితాలు - ఆప్తుల చొరవతో సమస్య పరిష్కారం....

Sankata Nasana Ganesha Stotram: సంకట నాశన గణేశ స్తోత్రాన్ని రోజూ పఠిస్తే..?

28-08-2025 గురువారం రాశిఫలాలు - ఎదుటివారి అంతర్యం గ్రహించండి.. భేషజాలకు పోవద్దు...

వినాయక చవితి 2025: ఏకంగా ఐదు యోగాలు.. ఈ రాశుల వారికి అదృష్టం

గణేష్ చతుర్థి: వినాయక పూజ ఎలా చేయాలి?

తర్వాతి కథనం
Show comments