మీ రాశిఫలితాలు (31-07-17)... ఈ రోజు శుభవార్తలు వింటారు...

మేషం : ఈరోజు ఉద్యోగస్తులు పైఅధికారులను తక్కువ అంచనావేసి మాట్లాడటం వల్ల ఇబ్బందులకు లోనవకతప్పదు. కార్యసాధనలో ఓర్పు, పట్టుదల అవసరం. కుటుంబీకులతో ఏకీభవించలేకపోతారు. అనుకున్న పనులు ఆశించినంత చురుకుగా సాగవు

Webdunia
సోమవారం, 31 జులై 2017 (05:45 IST)
మేషం : ఈరోజు ఉద్యోగస్తులు పైఅధికారులను తక్కువ అంచనావేసి మాట్లాడటం వల్ల ఇబ్బందులకు లోనవకతప్పదు. కార్యసాధనలో ఓర్పు, పట్టుదల అవసరం. కుటుంబీకులతో ఏకీభవించలేకపోతారు. అనుకున్న పనులు ఆశించినంత చురుకుగా సాగవు. ముఖ్యుల గురించి అప్రియమైన వార్తలు వినాల్సి వస్తుంది. 
 
వృషభం : ఈరోజు ఇంట్లో మార్పులు, చేర్పులు అసౌకర్యం కలిగిస్తాయి. రుణవిముక్తులు కావడంతో పాటు కొత్త రుణాలు అనుకూలిస్తాయి. రిప్రజెంటేటివ్‌లు మార్పులకై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. రాజకీయాలలో వారికి ఊహించని అవరోధాలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. పాత వస్తువులను కొని సమస్యలు తెచ్చుకోకండి. 
 
మిథునం : ఈరోజు ఉద్యోగంలో శ్రమకు నైపుణ్యతకు మంచి గుర్తింపు లభిస్తుంది. పెద్దలను ప్రముఖులను కలుసుకుంటారు. స్త్రీలు కలుపుగోలుగా వ్యహరించి అందరినీ ఆకట్టుకుంటారు. ఏ యత్నం కలిసిరాక పోవడంతో ఒకింత నిరుత్సాహం తప్పదు. చిట్స్, ఫైనాన్స్ వ్యాపారస్తులకు ఖాతాదారులతో సమస్యలు తప్పవు. 
 
కర్కాటకం : ఈరోజు విద్యా సంస్థల వారికి ఆందోళన తప్పదు. నిరుద్యోగులు నిరుత్సాహానికి గురవుతారు. వ్యవసాయ రంగాల వారికి అన్ని విధాలా అనుకూలం. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. సోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. రుణయత్నాలు ఫలిస్తాయి. 
 
సింహం : ఈరోజు కుటుంబీకుల మొండివైఖరి అసహనం కలిగిస్తుంది. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదా పడతాయి. ఖర్చులు పెరిగినా ఇబ్బంది ఉండదు. ఎవరికీ బాధ్యతలు, పనులు అప్పగించవద్దు. మనష్యుల మనస్థత్వం తెలిసి మసలుకొనుట మంచిది. 
 
కన్య : ఈరోజు విదేశీయానం కోసం చేసే యత్నాలు మందకొడిగా సాగుతాయి. వస్త్ర, స్టేషనరీ, ఫ్యాన్సీ, చిరు వ్యాపారులకు అన్ని విధాలా కలిసిరాగలదు. స్త్రీలకు కొత్తకొత్త కోరికలు, సరదాలు స్ఫురిస్తాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. ఫ్లీడర్లకు, ఫ్లీడరు గుమస్తాలకు పురోభివృద్ధి కానవస్తుంది. 
 
తుల : ఈరోజు ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి, చికాకులు తప్పదు. శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. సభలు, సమావేశాల్లో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. ఖర్చులు పెరిగినా సంతృప్తి, ప్రయోజనకరంగా ఉంటాయి. 
 
వృశ్చికం : ఈరోజు ప్రముఖుల ప్రమేయంతో ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి. వృత్తి వ్యాపారాల్లో మార్పులు అనుకూలిస్తాయి. సోదరుల మధ్య సత్సంబంధాలు నెలకొంటాయి. స్థిరాస్తి క్రయవిక్రయం విషయంలో మంచి లాభం ఉంటుంది. విదేశీ వ్యవహారాలకు అవసరమైన నిధులు సమకూర్చుకుంటారు. 
 
ధనస్సు : ఈరోజు పత్రికా రంగంలోని వారి ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది. బ్యాంకింగ్ వ్యవహారాలలో మెలకువ వహించండి. మీ అశ్రద్ధ ఆలస్యాల వల్ల కొన్ని చికాకులను ఎదుర్కొనక తప్పదు. సోదరీసోదరులతో సంబంధ బాంధవ్యాలు బాగుగా ఉంటాయి. గృహమార్పుతో ఇబ్బందులు తొలగి మానసికంగా కుదుటపడుతారు. 
 
మకరం : ఈరోజు నూనె, మిర్చి, మినుము వ్యాపారస్తులకు స్టాకిస్టులకు అభివృద్ధి కానవస్తుంది. ఇంటికోసం విలువైన ఫర్నిచర్ సమకూర్చుకుంటారు. రాజకీయాల్లో వారికి ఆందోళన అధికమవుతాయి. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారి పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీ అభిరుచికి తగిన వ్యక్తితో పరిచయాలేర్పడతాయి. 
 
కుంభం : ఈరోజు రేషన్ డీలర్లకు అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. రావలసిన ధనం వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కొంటారు. సజ్జన సాంగత్యం, సభలు, సమావేశాల్లో గౌరవం పొందుతారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలమవుతాయి. స్త్రీలకు పనివారితో ఇబ్బందులను ఎదుర్కొంటారు. 
 
మీనం : స్త్రీలు, టీవీ చానెల్స్ కార్యక్రమాలలో బాగా రాణిస్తారు. ప్రముఖుల సహకారంతో ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. ఖర్చులు అధికం కావడంవల్ల ఆందోళనకు గురవుతారు. అతిగా సంభాషించడం అనర్థదాకయం అని గమనించండి. ఉపాధ్యాయులకు విద్యార్థుల నుండి ఒత్తిడి, చికాకులు తప్పవు. 
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

CPI Narayana: కేంద్ర బడ్జెట్‌ పనికిరానిది.. దార్శనికత లేనిది.. నారాయణ

హైదరాబాద్ నుంచి చెన్నైకి 3 గంటల్లో, బెంగళూరుకి 2 గంటల్లో... రైల్లోనే...

ట్రంప్ ఏం నోటితో గ్రీన్ ల్యాండ్ కావాలని అన్నాడో కానీ... అది కాస్తా కరిగిపోతోంది, ముప్పు అంచున ప్రపంచం

చెత్తతో నిండిన ఒక పాడుబడిన బావిలో ముక్కలు ముక్కలుగా మృతదేహం

జగన్‌ను ఉరికించి తరిమాం, రోజా మా దెబ్బకు పారిపోయింది: జీవన్ రెడ్డి

అన్నీ చూడండి

లేటెస్ట్

31-01-2026 శనివారం ఫలితాలు : పెట్టుబడులకు మంచి తరుణం కాదు...

30-01-2026 శుక్రవారం ఫలితాలు - కష్టమనుకున్న పసులు తేలికగా..?

భీష్మఏకాదశి రోజున ఏ కార్యాన్ని ప్రారంభించినా శుభమే-విష్ణు సహస్ర నామం, భగవద్గీతను?

Mega Medaram Maha Jathara: మేడారం మహా జాతరకు సుమారు మూడు కోట్ల మంది భక్తులు

29-01-2026 రాశి ఫలితాలు, ఫోన్ సందేశాలు నమ్మవద్దు

తర్వాతి కథనం
Show comments