Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ రాశి వారఫలాలు (31-07-17 నుంచి 06-08-17 వరకు)...

మేషం : అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం ఈ వారం అయిన వారితో విభేదిస్తారు. సౌమ్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. పట్టుదలతో యత్నాలు సాగించండి. అప్రమత్తంగా వ్యవహరించాలి. ఎ

Webdunia
ఆదివారం, 30 జులై 2017 (16:30 IST)
మిథునంలో శుక్రుడు, కర్కాటకంలో రవి, కుజులు, సింహంలో రాహువు, బుధులు, కన్యలో బృహస్పతి, వృశ్చికంలో వక్రి శని, కుంభం కేతువు. కన్య, తుల, వృశ్చిక, ధనస్సులలో చంద్రుడు. 4న వరలక్ష్మీవ్రతం. ముఖ్యమైన పనులకు దశమి, బుధవారం శుభదినం. 
 
మేషం : అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం 
ఈ వారం అయిన వారితో విభేదిస్తారు. సౌమ్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. పట్టుదలతో యత్నాలు సాగించండి. అప్రమత్తంగా వ్యవహరించాలి. ఎదుటివారి వ్యాఖ్యలు ఆలోచింపజేస్తాయి. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. కలిసివచ్చిన అవకాశాన్ని తక్షణం వినియోగించుకోండి. ఖర్చులు విపరీతం, ఆత్మీయులను వేడుకలు, విందులకు ఆహ్వానిస్తారు. పనుల్లో ఒత్తిడి, జాప్యం ఎదుర్కొంటారు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఆది, గురువారాల్లో నగదు, పత్రాలు, విలువైన వస్తువులు జాగ్రత్త. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. పెట్టుబడులకు అనుకూలం. వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు 
అయిన వారితో విభేదిస్తారు. సౌమ్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. పట్టుదలతో యత్నాలు సాగించండి. ఆర్థికస్థితి సామాన్యం. ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలబడదు. మంగళ, శనివారాల్లో ఆందోళన కలిగించే సంఘటనలెదురవుతాయి. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. సంతానం మొండి వైఖరి అసహనం కలిగిస్తుంది. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోవాలి. అభియోగాలు, విమర్శలు ఎదుర్కొంటారు. పెద్ద మొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. నిరుత్సాహం వీడి ఉద్యోగయత్నం సాగించండి. అధికారులకు విశ్రాంతి లోపం.. వైద్య, న్యాయ రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఆస్తి వివాదాలు కొత్త మలుపు తిరుగుతాయి. దైవ, పుణ్యకార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు 
కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. అవకాశాలను వదులుకోవద్దు. పనులు సకాలంలో పూర్తి కాగలవు. శుభవార్తలు వింటారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. ఆప్తులకు సాయం అందిస్తారు. ఖర్చులు సంతృప్తికరం. ఇంట సందడి నెలకొంటుంది. గురు, శుక్రవారాల్లో అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. మీ అభిప్రాయాలను లౌక్యంగా తెలియజేయండి. నగదు, వస్తువులు, పత్రాలు జాగ్రత్త. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తే చేసుకుంటారు. పెట్టుబడులకు అనుకూలం. ఉపాధి పథకాల్లో రాణిస్తారు. అధికారులకు ధనప్రలోభం తగదు. తీర్థయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు. విందులు, వినోదాల్లో మితంగా ఉండాలి. జూదాలు, బెట్టింగ్‌ల వల్ల అవస్థలు తప్పవు. విదేశీ విద్యా యత్నం ఫలిస్తుంది.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష 
ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఖర్చులు అధికం. అవసరాలు నెరవేరుతాయి. పెద్దమొత్తం ధనసహాయం తగదు. మీ అభిప్రాయాలను సున్నితంగా తెలియజేయండి. అవివాహితులు కొత్త అనుభూతి చెందుతారు. ధైర్యంగా ముందుకు సాగుతారు. కృషి, పట్టుదలతో ఏదైనా సాధించగలమన్న నమ్మకం కలుగుతుంది. ఆత్మీయుల సలహా పాటిస్తారు. పనులు సానుకూలమవుతాయి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. శనివారం నాడు బాధ్యతలు, వ్యవహారాలు అప్పగించవద్దు. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. వైద్యసేవలు అవసరమవుతాయి. పెట్టుబడులు, వ్యాపారాల విస్తరణలకు అనుకూలం. హోల్ సేల్ వ్యాపారులు, స్టాకిస్టులకు పురోభివృద్ధి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. ప్రయాణం కలిసివస్తుంది. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1పాదం 
ఈ వారం అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. విలువైన కానుకలు ఇచ్చిపుచ్చుకుంటారు. ఖర్చులు పెరిగినా ధనానికి లోటుండదు. పనులు నిదానంగా సాగుతాయి. కొత్త విషయాలు గ్రహిస్తారు. బంధువుల వైఖరి బాధిస్తుంది. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. గత తప్పిదాలు పునరావృతమయ్యే సూచనలున్నాయి. వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. పెద్దల సలహా పాటించండి. అవివాహితుల్లో ఉత్సాహం నెలకొంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. వ్యాపారాల విస్తరణకు అనుకూలం. విందులు, దైవకార్యంలో పాల్గొంటారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు 
ఖర్చులు అంచనాలను మించుతాయి. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. ఆత్మీయుల ఆహ్వానం సంతోషపరుస్తుంది. పనులు ముగింపు దశలో మందకొడిగా సాగుతాయి. మీ ఓర్పు నేర్పులకు పరీక్షా సమయం. అప్రమత్తంగా వ్యవహరించండి. సలహాలు, సహాయం ఆశించవద్దు. దంపతుల మధ్య అకారణ కలహం, చికాకులు తలెత్తుతాయి. పెద్దల ప్రమేయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. విద్యార్థులకు అత్యుత్సాహం తగదు. ఆశాదృక్పథంతో ఉద్యోగయత్నం సాగించండి. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. అధికారులకు హోదామార్పు, విశ్రాంతి లోపం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మీ పథకాలు సత్ఫలితాలిస్తాయి. ఆహ్వానం, కీలక పత్రాలు అందుకుంటారు. ప్రయాణం ఉల్లాసంగా సాగుతుంది. దైవకార్యంలో పాల్గొంటారు.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు 
వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. ఎదుటివారికి మీపై గురి కుదురుతుంది. పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. అసాధ్యమనుకున్న పనులు పూర్తవుతాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. ఆది, సోమవారాల్లో అనవసర బాధ్యతలు చేపట్టవద్దు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ధనం డ్రా చేసేటప్పుడు జాగ్రత్త. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. కొత్త వారిని విశ్వసించవద్దు. అవివాహితుల్లో ఉత్సాహం నెలకొంటుంది. ఆత్మీయులను ఆహ్వానిస్తారు. పరిచయాలు లాభిస్తాయి. విదేశీ విద్యాయత్నంలో స్వల్ప ఆటంకాలెదుర్కుంటారు. ఆశాదృక్పథంతో ఉద్యోగయత్నం సాగించండి. వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారుల తీరును గమనించి మెలగండి. వేడుకలు, విందుల్లో పాల్గొంటారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట
మీదైన రంగాల్లో అనుభవం గడిస్తారు. గుట్టుగా యత్నాలు సాగించండి. సలహాలు, సహాయం ఆశించవద్దు. శుభకార్యం నిశ్చయమవుతుంది. వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత అవసరం. సాధ్యం కాని హామిలివ్వవద్దు. మంగళ, బుధవారాల్లో పనులు ముగింపు దశలో మందకొడిగా సాగుతాయి. సన్నిహితులకు సాయం అందిస్తారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాం. కొంత మొత్తం ధనం అందుతుంది. ఊహించిన ఖర్చులే ఉంటాయి. చెల్లింపులు, చెక్కుల జారీలో జాగ్రత్త. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉద్యోగస్తుల సమర్థత అధికారులకే లాభిస్తుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. పెట్టుబడులు, ఏజెన్సీలు, టెండర్లకు అనుకూలం. ఆస్తి, భూ వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. 
 
ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాడ 1వ పాదం 
మీ మాటతీరు అదుపులో ఉంచుకోండి. సన్నిహితులు దూరమయ్యే సూచనలున్నాయి. కుటుంబీకుల మధ్య అవగాహన లోపిస్తుంది. అందరితీ సఖ్యతగా మెలగాలి. గురు, శుక్రవారాల్లో ఎవరినీ విమర్శించవద్దు. ఆదాయ వ్యయాల సంతృప్తికరం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనులు అనుకున్న విధంగా సాగవు. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. అవకాశాలు చేజారినా ఒకందుకు మంచిదే. మీ కృషి త్వరలోనే ఫలిస్తుంది. రావలసిన ధనాన్ని లౌక్యంగా వసూలు చేసుకోవాలి. ఎవరినీ ఇబ్బంది పెట్టవద్దు. అవివాహితులకు శుభవార్తా శ్రవణం. విద్యా, ఉద్యోగ ప్రకటనల పట్ల అవగాహన ప్రధానం. ప్రతి విషయం స్వయంగా తెలుసుకోవాలి. వ్యాపారాభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తారు. చిరువ్యాపారులకు ఆశాజనకం. ప్రయాణంలో ప్రయాసలెదుర్కుంటారు. 
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు 
సంప్రదింపులు ఫలించవు. మీపై శకునాల ప్రభావం అధికం. ప్రియతములను కలుసుకుంటారు. శ్రమాధిక్యత మినహా ఫలితం ఉండదు. మీ సమర్థతపై నమ్మకం పెంచుకోండి. ఎవరి సాయం ఆశించవద్దు. శనివారం నాడు ఖర్చులు విపరీతం. చెల్లింపులు వాయిదా పడతాయి. ఒకేసారి అనేక పనులతో సతమతమవుతారు. సంతానం వైఖరి అసహనం కలిగిస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ఆహ్వానం, నోటీసులు అందుకుంటారు. విద్యార్థులకు ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. ఉద్యోగయత్నంలో నిరుత్సాహం తగదు. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. ప్రేమ వ్యవహారాలు వివాదస్పదమవుతాయి. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు 
గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. శ్రీవారు లేక శ్రీమతి విషయంలో శుభపరిణామాలు సంభవం. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. ఆది, సోమవారాల్లో మొహమ్మాటాలకు పోయి ఇబ్బందులెదుర్కుంటారు. విలువైన వస్తువులు, రసీదులు జాగ్రత్త. కొంతమంది మీ నుంచి విషయసేకరణకు యత్నిస్తారు. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. పరిచయాలు బలపడతాయి. ఒక వ్యవహారంలో ధనం అందుతుంది. ఖర్చులు భారమనిపించవు. ఆత్మీయులను వేడుకలు, విందులకు ఆహ్వానిస్తారు. వ్యాపారులు లాభసాటింగ్ సాగుతాయి. నష్టాలు, ఆటంకాలను అధిగమిస్తారు. ఉద్యోగస్తులకు పదోన్నతి, అధికారులకు హోదా మార్పు. కళా, క్రీడాకారులకు ప్రోత్సాహకరం.
 
మీనం : పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి 
పదవులు, సభ్యత్వాల స్వీకరణకు అనుకూలం. వ్యతిరేకులే సన్నిహితులవుతారు. ధనలాభం, వస్త్ర, వస్త్రుప్రాప్తి పొందుతారు. సర్వత్రా అనుకూలతలుంటాయి. కొన్ని పనులు ఆకస్మికంగా పూర్తి చేస్తారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. విలాసాలకు బాగా వ్యయం చేస్తారు. శుభకార్యం నిశ్చయమవుతుంది. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. మంగళ, బుధవారాల్లో సాధ్యం కాని హామీలివ్వవద్దు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. నిరుగ్యోగుల కృషి ఫలిస్తుంది. వ్యాపారాల్లో లాభనష్టాలను సమీక్షించుకుంటారు. పెట్టుబడులు లాభిస్తాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Mumbai Boat Accident: ప్రయాణికుల బోటును నేవీ బోటు ఢీకొట్టడంతో 13 మంది మృతి, పలువురు గల్లంతు (video)

Live accident, గుంటూరు-విజయవాడ హైవేపై పట్టపగలే కారుతో ఢీకొట్టేసాడు (video)

తిరుమల పవిత్రతను కాపాడండి.. పబ్ కల్చర్ వచ్చేసింది.. భూమన కరుణాకర్ రెడ్డి

కేరళలో మళ్ళీ మంకీపాక్స్ కేసులు - ఇద్దరికీ పాజిటివ్ కేసులు

ప్రపంచ వ్యాప్తంగా 2025లో వలస విధానాలు మారనున్నాయా, అమెరికాకు వెళ్లడం కష్టమవుతుందా?

అన్నీ చూడండి

లేటెస్ట్

Daily Astro 16-12-2024 సోమవారం దినఫలితాలు : ఏకాగ్రతతో వాహనం నడపండి...

Today Daily Astro 15-12-2024 ఆదివారం దినఫలితాలు : సంకల్పం సిద్ధిస్తుంది...

Weekly Horoscope : 15-12-2024 నుంచి 21-12-2024 వరకు మీ రాశిఫలాలు

Today Daily Astro 14-12-2024 శనివారం దినఫలితాలు

Pisces : మీనరాశికి 2025 కలిసొస్తుందా? యోగ బలం.. శివారాధన, హనుమాన్ చాలీసాతో..?

తర్వాతి కథనం
Show comments