Webdunia - Bharat's app for daily news and videos

Install App

శుభోదయం : మీ రాశి ఫలితాలు 22-08-17

మేషం : ఈ రోజు ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉండటం వల్ల పొదుపు సాధ్యంకాదు. సొంత నిర్ణయాల వల్ల కలహాలు, చికాకులు తప్పవు. దైవ కార్యక్రమాల పట్ల ఆసక్తి అధికమవుతుంది. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు, పనిభారం వంటి చిక

Webdunia
మంగళవారం, 22 ఆగస్టు 2017 (05:50 IST)
మేషం : ఈ రోజు ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉండటం వల్ల పొదుపు సాధ్యంకాదు. సొంత నిర్ణయాల వల్ల కలహాలు, చికాకులు తప్పవు. దైవ కార్యక్రమాల పట్ల ఆసక్తి అధికమవుతుంది. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు, పనిభారం వంటి చికాకులు తప్పవు. మీ ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. దేనిమీదా శ్రద్ధ పెట్టలేరు.  
 
వృషభం : ఈ రోజు చిట్స్, ఫైనాన్స్ రంగాల వారికి ఖాతాదారుల నుంచి ఒత్తిడి తప్పదు. స్త్రీలు, విలువైన వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. మీపై శకునాల ప్రభావం అధికంగా ఉంటుంది. మీపై బంధుమిత్రుల వ్యాఖ్యలు తీవ్ర ప్రభావం అధికంగా ఉంటుంది. ఉద్యోగ, విదేశీయాన యత్నాలు ఫలిస్తాయి. ప్రముఖ సంస్థల షేర్ల కొనుగోళ్లు లాభిస్తాయి. 
 
మిథునం : ఈ రోజు ఆర్థిక లావాదేవీలు, ఉమ్మడి వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. ధనవ్యయం అధికమైన ఇబ్బందులుండవు. వాయిదాపడిన పనులు పూర్తి చేస్తారు. స్త్రీలకు పొరుగువారి నుంచి ఆహ్వానం అందుతుంది. కోర్టు వాదోపవాదాల్లో ప్లీడర్లు విజయం సాధిస్తారు. 
 
కర్కాటకం : ఈ రోజు మీ కదలికలపై నిఘా ఉందన్న విషయాన్ని గమనించండి. వేతనం తక్కువైనా వచ్చిన అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవడం శ్రేయస్కరం. వ్యాపారాల్లో కొత్తకొత్త పథకాలు ప్రణాళికలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. ఊహించని ఖర్చులు, చెల్లింపులు వల్ల ఇబ్బందులు తప్పవు. 
 
సింహం : ఈ రోజు వృత్తి వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. వ్యాపార రహస్యాలు, కుటుంబ విషయాలు గోప్యంగా ఉంచండి. వ్యవహార జయం, ఆకస్మిక ధనలాభం వంటి శుభఫలితాలున్నాయి. మీ వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. అసాధ్యమనుకున్న పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. 
 
కన్య : ఈ రోజు వృత్తి వ్యాపారాల్లో నిలదొక్కుకోవడానికి బాగా కష్టపడాలి. కుటుంబీకుల కోసం ధనం బాగా వ్యయం చేస్తారు. ఎల్.ఐ.సి, బ్యాంకు డిపాజిట్లకు సంబంధించిన సొమ్ము అందుకుంటారు. ఎదుటివారు మిమ్మలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడినా నిగ్రహించుకోవడం మంచిది. లక్ష్యసాధనంలో స్పల్ప ఒడిదుడుకులు, చికాకులు ఎదుర్కొంటారు. 
 
తుల : ఈ రోజు వ్యాపార, వ్యవహారాల్లో నిర్మొహమాటంగా వ్యవహరించండి. ఆత్మవిశ్వాసంతో మీ యత్నాలు సాగించండి. మీ సమస్యలు, చికాకులు క్రమంగా సర్దుకుంటాయి. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. స్త్రీలకు పొరుగువారి నుంచి ఆహ్వానం అందుతుంది. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. 
 
వృశ్చికం : ఈ రోజు అద్దెలు, ఇతరాత్రా రావలసిన బకాయిల వసూలులో దూకుడుగా వ్యవహరించకండి. సానుకూల ధోరణితోనే మీ సమస్యలు పరిష్కారమవుతాయి. కోర్టు వాదోపవాదాల్లో ప్లీడర్లకు చుక్కెదురవుతుంది. వ్యవసాయ రంగాల వారికి ఎరువుల కొనుగోలులో చికాకులు తప్పవు. స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. 
 
ధనస్సు : ఈ రోజు స్త్రీలతో మితంగా సంభాషించడం అన్ని విధాలా శ్రేయస్కరం. ఓర్పు, పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. మీ ప్రయాణాలు, కార్యక్రమాలు వాయిదా వేసుకోవలసి వస్తుంది. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. వ్యాపారాల్లో నష్టాలను కొంతవరకు పూడ్చుకోగలగుతారు. గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి. 
 
మకరం : ఈ రోజు ఆర్థిక లావాదేవీల్లో ఏకాగ్రత అవసరం. దైవకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తుల సమర్థత, అంకితభావం అధికారులను ఆకట్టుకుంటాయి. నిరుద్యోగులు ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాల అభివృద్ధికి కొత్తకొత్త పథకాలు రూపొందిస్తారు. చిన్నతరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులకు ఆశాజనకం. 
 
కుంభం : ఈ రోజు స్త్రీల పేరిట స్థిరాస్తుల కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. హామీలు, మధ్యవర్తిత్వాలు దూరంగా ఉండటం మంచిది. బంధువులు, సోదరీ సోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. మీ మాటకు ఇంటా బయటా గౌరవం లభిస్తుంది. ఏ వ్యక్తినీ తక్కువగా అంచనా వేయకండి. 
 
మీనం : ఈ రోజు ప్రేమికులు అతిగా వ్యవహరించడం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. గృహ మార్పుల కోసం యత్నాలు సాగిస్తారు. ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో తోటివారి సహకారం లభిస్తుంది. ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు అధికారుల నుంచి అభ్యంతరాలెదురవుతాయి. పత్రికా, ప్రైవేట్ సంస్థలలోని వారికి ఒత్తిడి, పనిభారం అధికం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రిఫ్రిజిరేటర్‌లో మహిళ మృతదేహం.. చీర కట్టుకుని, ఆభరణాలు ధరించి, మెడకు ఉచ్చు..

Sankranthi: సంక్రాంతి రద్దీ.. టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్

తెలంగాణలో క్రిప్టోకరెన్సీ మోసం.. రూ.95 కోట్ల మోసం.. వ్యక్తి అరెస్ట్

స్కూలు బ్యాగు తగిలించుకుని కుర్చీలో కూర్చున్నఫళంగా గుండెపోటుతో 8 ఏళ్ల చిన్నారి మృతి (Video)

సారీ చెబితే తిరుపతి తొక్కిసలాటలో చనిపోయినవారు తిరిగొస్తారా? (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కల్యాణోత్సవం

అవి ఉన్నవారికే వైకుంఠ ద్వార దర్శనం : తితిదే ఈవో శ్యామల రావు

08-01-2025 బుధవారం దినఫలితాలు : అజ్ఞాతవ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది...

హనుమాన్ చాలీసాతో అంతా జయమే

Tortoise: క్రిస్టల్ తాబేలును ఇంట్లో వుంచుకుంటే ఏం జరుగుతుంది? (video)

తర్వాతి కథనం
Show comments