Webdunia - Bharat's app for daily news and videos

Install App

30-03-2019 శనివారం దినఫలాలు - రాజకీయాల్లో వారికి విరోధులు వేసే...

Webdunia
శనివారం, 30 మార్చి 2019 (09:04 IST)
మేషం: విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఎండుమిర్చి కంది, పసుపు, ఉల్లి, బెల్లం వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు పురోభివృద్ధి. కొబ్బరి, పండ్లు, పూలు, చిరువ్యాపారులకు లాభదాయకం. ఉద్యోగస్తులకు ప్రమోషన్, బదిలీ ఉత్తర్వులు అందుతాయి. రిప్రజెంటేటివ్‌‌లు మార్పులకై చేయు ప్రయత్నాలు వాయిదా పడుతాయి.
 
వృషభం: ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన నెమ్మదిగా సమసిపోతాయి. మీ జీవిత భాగస్వామితో కీలకమైన విషయాలు చర్చకు జరుపుతారు. రాజకీయాల్లో వారికి విరోధులు వేసే పథకాలు ఎంతో ఆందోళన కలిగిస్తాయి. గృహ నిర్మాణాలలో వ్యయం మీ అంచనాలను మించుతుంది. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది.
 
మిధునం: చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో పూర్తి చేయవలసి ఉంటుంది. వైద్యులకు శస్త్రచికిత్స చేయునపుడు ఏకాగ్రత చాలా అవసరం. పత్రికా, ప్రైవేటు సంస్థల్లోని వారికి యాజమాన్యం తీరు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. సిమెంటు, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు మందకొడిగా ఉంటుంది.
 
కర్కాటకం: విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. బంధువులు మీ స్థోమతకు తగిన వివాహ సమాచారం అందిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ అవసరాలకు కావలసిన ధనం సర్దుబాటు చేసుకోగల్గుతారు. మొహమ్మాటాలు, ఒత్తిళ్ళు వలన ఇబ్బందులు ఎదుర్కోవలసివస్తుంది.
 
సింహం: విద్యార్థులు తొందరపాటు తనం వదిలి ఏకాగ్రతతో చదివిన సత్ఫలితాలను పొందగలరు. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికం కావడంతో శ్రమాధిక్యత తప్పదు. బ్యాంకు వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, అందుకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది.
 
కన్య: ట్రాన్స్‌పోర్ట్, ఆటోమోబైల్, రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. మిత్రుల నుండి ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. తలపెట్టిన పనులు మొక్కుబడిగా పూర్తిచేస్తారు. ఉపాధ్యాయులకు బరువు బాధ్యతలు అధికం. కోర్టు వ్యవహారాలు వాయిదాపడుట మంచిది. ప్రముఖుల సహకారంతో మీ పాత సమస్యలు ఒక కొలిక్కివస్తాయి. 
 
తుల: ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మిక ప్రయాణం తలపెడతారు. ఉద్యోగస్తులకు ఆకస్మిక బదిలీ, బాధ్యతల మార్పులు ఉంటాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు బాగా శ్రమించాలి. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల సహకారం మీకు లభిస్తుంది. స్వయంకృషితో రాణిస్తారన్న విషయం గ్రహించండి.
 
వృశ్చికం: వ్యాపారాల్లో నిలదొక్కుకోవడంతో పాటు అనుభవం గడిస్తారు. ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు. స్త్రీలకు కొత్త పరిచయాలు, వ్యాపకాలు పెంపొందుతాయి. గృహంలో ఏదైనా వస్తువు పోయేందుకు ఆస్కారం ఉంది మెళకువ వహించండి. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు నిర్మాణ పనుల్లో ఏకాగ్రత ముఖ్యం. 
 
ధనస్సు: ఉద్యోగస్తులు పెండింగ్ పనులు పూర్తిచేసి అధికారులను ప్రసన్నం చేసుకోగల్గుతారు. ఆపద సమయంలో సన్నిహితులు అండగా నిలుస్తారు. స్టాక్ మార్కెట్ రంగాల వారి అంచనాలు నిరుత్సాహపరుస్తాయి. దైవ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడడం మంచిదేనని భావించండి. 
 
మకరం: కొబ్బరి, పండ్లు, పానీయ, పూల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. స్త్రీలతో మితంగా సంభాషించండి. సోదరీసోదరులతో ఏకీభవించలేకపోతారు. వాహనం నడుపునపుడు మెళకువ అవసరం. పెంపుడు జంతువుల పట్ల ఆందోళన చెందుతారు. కుటుంబీకుల కోసం ధనం బాగా వ్యయం చేయవలసివస్తుంది. 
 
కుంభం: ఆర్థిక లావాదేవీలు గోప్యంగా ఉంచండి. కోర్టు వ్యవహారాలు, ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. స్త్రీలకు కాళ్ళు, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కుంటారు. ఉన్నత స్థాయి అధికారులు ప్రలోభాలకు దూరంగా ఉండడం మంచిది. కాంట్రాక్టర్లకు నూతన టెండర్లు ఏమాత్రం అనుకూలించవు. 
 
మీనం: గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. బంధువులకు ధన సహాయం చేయడం వలన ఇబ్బందులను ఎదుర్కుంటారు. చిన్నారుల మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి శ్రమ అధికమవుతుంది. శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కుంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సంక్రాంతికి సిద్ధం అవుతున్న పవన్ కల్యాణ్ ప్రభలు, ఉత్తరాంధ్రలో ఉరుకుతున్న జనం (Video)

Truck: ట్రక్కు కింద ఇద్దరు మోటర్ సైకిలిస్టులు.. చూడకుండానే లాక్కెళ్లిన డ్రైవర్ (video)

NTR: ఎందుకొచ్చిన గొడవ- అభిమాని ఆస్పత్రి బిల్ సెటిల్ చేసిన జూనియర్ ఎన్టీఆర్.. (video)

అరకు వ్యాలీలో అద్దంలాంటి రహదారులు... డిప్యూటీ సీఎంపై ప్రశంసలు

ఏపీ ఫైబర్‌ నెట్ నుంచి 410 మంది ఉద్యోగులపై వేటు.. జీవీ రెడ్డి (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

తిరుమల కోసం స్వర్ణ ఆంధ్ర విజన్-2047: టీటీడీ ప్రారంభం

19-12-2024 గురువారం దినఫలితాలు : పందాలు, బెట్టింగులకు దూరంగా ఉండండి..

తిరుమలలో ముమ్మరంగా వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లు

18-12-2024 బుధవారం దినఫలితాలు : కార్యసాధనకు ఓర్పు ప్రధానం...

Akhuratha Sankashti Chaturthi 2024: డిసెంబర్ 18న గణపతిని పూజిస్తే?

తర్వాతి కథనం
Show comments