Webdunia - Bharat's app for daily news and videos

Install App

26-02-2019 మంగళవారం దినఫలాలు - వార్తా సంస్థల్లోని వారికి ఊహించని..

Webdunia
మంగళవారం, 26 ఫిబ్రవరి 2019 (08:54 IST)
మేషం: ప్రముఖులకు విలువైన కానుకలందించి వారిని ఆకట్టుకుంటారు. పోస్టల్, కొరియర్ రంగాల వారికి శ్రమాధిక్యత తప్పదు. విద్యార్ధినులలో మానసిక ప్రశాంతత చోటు చేసుకుంటుంది. ఆత్మీయులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. సహోద్యోగులతో అభిప్రాయబేధాలు తలెత్తే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి.
 
వృషభం: బ్యాంకు రుణాలు తీరుస్తారు. సోదరీసోదరుల మధ్య ప్రేమానుబంధాలు బలపడుతాయి. వైద్యరంగాల వారికి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. టెక్నికల్, ఎలక్ట్రానికల్ రంగాల్లో వారికి శుభదాయకం. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లకు ఒత్తిడి చికాకులు తప్పవు. విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి.
 
మిధునం: పత్రికా, వార్తా సంస్థల్లోని వారికి ఊహించని చికాకులను ఎదుర్కుంటారు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. స్త్రీలు షాపింగ్‌ల కోసం ధనం వెచ్చిస్తారు. విద్యార్థినుల తొందరపాటుతనం వలన చికాకులు తప్పవు. చిరువ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి.
 
కర్కాటకం: ప్రైవేటు సంస్థలలోని వారు ఓర్పు, అంకితభావంతో పనిచేసి ప్రశంసలు పొందుతారు. చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు ఖాతాదారుల నుండి ఒత్తిడి అధికమవుతుంది. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లుల వసూళ్ళల్లో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. ఒక స్థిరాస్తి కొనుగోలు చేయాలనే ఆలోచన స్పురిస్తుంది.
 
సింహం: మీ శ్రీమతి సలహా పాటించడం వలన ఒక సమస్య నుండి గట్టెక్కుతారు. ద్విచక్రవాహనంపై దూరప్రయాణాలు మంచిది కాదని గమనించండి. కాంట్రాక్టర్లకు పనివారి వలన సమస్యలకు, ఇబ్బందికి లోనవుతారు. ఉద్యోగస్తులకు అధికారుల నుండి గుర్తింపు లభిస్తుంది. ముఖ్యులతో సంభాషించేటపుడు మెలకువ వహించండి.
 
కన్య: అధికారులు ధన ప్రలోభాలకు దూరంగా ఉండడం క్షేమదాయకం. ఏదైనా స్థిరాస్తి అమ్మకం చేయాలనే ఆలోచన స్పురిస్తుంది. రావలసిన ధనం చేతికందుతుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. స్త్రీల సృజనాత్మకతకు తగిన గుర్తింపు లభిస్తుంది. మీ సంతానం మొండితనం వలన అసహానానికి గురవుతారు. 
 
తుల: ఉపాధ్యాయులకు విద్యార్థుల వలన సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. ఆకస్మిక ప్రయాణాలు చేయవలసివస్తుంది. బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. బ్యాంకు వ్యవహారాలలో అపరచిత వ్యక్తులతో ఆచితూచి సంభాషించండి. ఎదురయ్యే ప్రతి విషయంలో ఫలితాలు సామాన్యంగా ఉంటాయి. 
 
వృశ్చికం: ఇతరుల కుటుంబ విషయాలలో మధ్యవర్తిత్వం వలన ఇబ్బంది పడతారు. ప్రింటింగ్ రంగాల్లో వారికి అచ్చుతప్పులు దొర్లుట వలన పై అధికారుల చేత మాటపడాల్సి వస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. ఖర్చులు అదుపు చేయాలన్న మీ ఆశయం నెరవేరదు. 
 
ధనస్సు: మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. రాజకీయ నాయకులు సభ, సమావేశాలలో పాల్గొంటారు. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కసరం. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల సహాయం అందుతుంది. బంధువులకు హామీల విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. 
 
మకరం: విద్యార్థులకు పాఠ్యాంశాల పట్ల ఆసక్తి సన్నగిల్లుతుంది. మీ ఆశయ సాధనకు నిరంతర కృషి అవసరమని గమనించండి. ప్రభుత్వ కార్యాలయాలలోని పనులు సకాలంలో పూర్తవుతాయి. మీ సంతానం మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. స్త్రీల కళాత్మతకు, నైపుణ్యతకు మంచి గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తుంది. 
 
కుంభం: ముఖ్యుల వైఖరి మీకెంతో ఆందోళన కలిగిస్తుంది. స్త్రీలకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి. ఉపాధ్యాయులకు బరువు బాధ్యతలు అధికమవుతాయి. ఏ మాత్రం పొదుపు సాధ్యం కాదు. దైవదర్శనం వలన మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. చెల్లింపులు వాయిదా వేస్తారు. 
 
మీనం: భాగస్వామిక చర్చలు అర్ధాంతరంగా ముగుస్తాయి. స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. ఉద్యోగ, వ్యాపారాల్లో ఆటుపోట్లు ఎదుర్కోవలసి వస్తుంది. వాహన చోదకులకు జరిమానాలు చెల్లించవలసి వస్తుంది. రాబడికి మించిన ఖర్చుల వలన స్వల్ప ఇబ్బందులు ఎదుర్కుంటారు. ప్రముఖులతో పరిచయాలు మీ ఉన్నతిని పెంచుతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: భూ వివాదం ఒక ప్రాణాన్ని బలిగొంది.. నలుగురు కుమారుల మధ్య..?

భర్త తప్పిపోయాడని క్షుద్ర వైద్యుడి దగ్గరికి వెళ్తే.. అసభ్యంగా ప్రవర్తించాడు.. ఏం చేశాడంటే?

కర్నూలులో వరుస హత్యలు.. భయాందోళనలో ప్రజలు

Heavy rainfall: బంగాళాఖాతంలో అల్పపీడనం- తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్

Kavitha: కవితకు బిగ్ షాకిచ్చిన కేటీఆర్‌.. పార్టీ నుంచి సస్పెండ్.. హరీష్ ఆరడుగుల బుల్లెట్

అన్నీ చూడండి

లేటెస్ట్

31-08-2002 నుంచి 06-09-2025 వరకు మీ వార ఫలితాలు

31-08-2025 ఆదివారం రాశిఫలాలు - ఖర్చులు అధికం.. ప్రయోజనకరం...

30-08-2025 శనివారం ఫలితాలు - పిల్లల దూకుడును అదుపు చేయండి.

గణపతి ఉత్సవాల కోలాహలం: మంగళహారతి పాడుదాం రండి

Saturday Saturn Remedies: శనివారం నల్లనువ్వులు, ఆవనూనెతో ఇలా చేస్తే.. రావిచెట్టులో శనిగ్రహం..?

తర్వాతి కథనం
Show comments