Webdunia - Bharat's app for daily news and videos

Install App

గురువారం (23-08-2018) దినఫలాలు - స్థిర బుద్ది లేకపోవడం వల్ల....

మేషం: ఉన్నత విద్యా, విదేశీ వ్యవహారాలకు అవసరమైన నిధులు సమకూర్చుకుంటారు. దూరప్రయాణాలకై చేయు ప్రయత్నాలలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఓ కార్యక్రమంలో మీ ప్రతిష్టకు భంగం కలిగించే ప్రయత్నాలు జరుగుతాయి. ఎంత ధనం వె

Webdunia
గురువారం, 23 ఆగస్టు 2018 (08:46 IST)
మేషం: ఉన్నత విద్యా, విదేశీ వ్యవహారాలకు అవసరమైన నిధులు సమకూర్చుకుంటారు. దూరప్రయాణాలకై చేయు ప్రయత్నాలలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఓ కార్యక్రమంలో మీ ప్రతిష్టకు భంగం కలిగించే ప్రయత్నాలు జరుగుతాయి. ఎంత ధనం వెచ్చించైనా కోరుకున్న వస్తువు దక్కించుకుంటారు.
 
వృషభం: స్త్రీలు షాపింగ్, విందు వినోదాలలో ఉల్లాసంగా పాల్గొంటారు. ట్రాన్స్‌పోర్ట్, ట్రావెలింగ్ రంగాల వారికి సామాన్యం. వస్త్ర, బంగారం, వెండి, లోహ వ్యాపారస్తులకు శ్రమాధిక్యత తప్పదు. సత్పలితలా పొంద గలుగుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. స్పెక్యులేషన్ లాభదాయకం. రుణాల కోసం అన్వేషిస్తారు. 
 
మిధునం: విద్యార్థులు సన్నిహితుల వలన ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ రంగాల్లో వారికి పురోభివృద్ధి. ఉద్యోగస్తులకు ఆకస్మిక మార్పులు సంభవిస్తాయి. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి తగు ప్రోత్సాహం లభిస్తుంది. ఖర్చులు, అవసరాలు పెరగటంతో అదనపు రాబడికై యత్నిస్తారు. 
 
కర్కాటకం: మార్కెటింగ్, ప్రైవేటు, పత్రిగా రంగంలోనివారి శ్రమకు మంచి గుర్తింపు లభిస్తుంది. స్థిర బుద్ది లేకపోవడం వలన ఇబ్బందులను ఎదుర్కుంటారు. సమయానికి మిత్రులు సహకరించక పోవడంతో అసహానానికి గురవుతారు. స్త్రీలకు అకాలభోజనం, శ్రమాధిక్యత వలన స్వల్ప అస్వస్థతకు గురవుతారు. 
 
సింహం: ఐరన్, సిమెంట్, కలప, ఇనుము, ఇసుక, ఇటుక వ్యాపారస్తులకు లాభదాయకం. స్వతంత్ర్య నిర్ణయాలు తీసుకోనుట వలన శుభం చేకూరగలదు చిన్నారులు, ప్రియతముల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. మీ కళత్ర మెుండి వైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. 
 
కన్య: ఏజెంట్లకు, బ్రోకర్లకు, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కొత్త ఆలోచనలు స్పురిస్తాయి. రాజకీయాలలో వారికి అవకాశవాదులు అధికమవుతున్నారని గమనించండి. స్త్రీలు తొందరపాటుతనం వలన ప్రియతమనులను దూరం చేసుకుంటారు. స్వశక్తితో పైకొచ్చిన మీరు, మరింత ముందు కెళ్లాలంటే తగిన సమయాన్ని వెచ్చించవలసి ఉంటుంది. 
 
తుల: ఆర్థిక లావాదేవీల్లో ఒడిదుకులు ఎదురైనా అధిగమిస్తారు. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనలు, పరిచయం లేని వ్యక్తుల పట్ల జాగ్రత్త అవసరం. ఇతరుల కుటుంబ విషయాలలో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. పెద్దల ఆరోగ్యంలో శ్రద్ధ వహించండి. దైవ, పుణ్య, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
వృశ్చికం: స్త్రీలు పనివారలతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. విదేశీయత్నాల్లో శ్రమాధిక్యత, ప్రయాసలకు లోనవుతారు. రవాణా రంగాల వారికి చికాకులు అధికమవుతాయి. సంఘంలో గుర్తింపు లభిస్తుంది. కార్మికులకు, తాపీ పనివారికి సమస్యలు తప్పవు. ఎంతో కొంత పొదుపు చేయాలన్న మీ యత్నం ఫలించదు. 
 
ధనస్సు: ప్రభుత్వ కార్యలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. బ్యాంకింగ్ వ్యవహారాలలోను, ప్రయాణాలలోను అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలోని వారికి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. 
 
మకరం: చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు ఖాతాదారులతో సమస్యలు తప్పవు. స్త్రీల ప్రతిభా పాటవాలకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. మీ సమర్థతపై ఎదుటివారికి విశ్వాసం ఏర్పడుతుంది. ఖర్చులు పెరిగినా ప్రయోజనకరంగా ఉంటాయి. ఉపాధ్యాయులకు అదనపు బాధ్యతలు, పనిభారం వంటి చికాకులు తప్పవు.  
 
కుంభం: రాజకీయనాయకులకు ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. సోదరీసోదరులతో ఏకీభవించలేరు. స్త్రీలకు చుట్టప్రక్కల వారి నుండి గౌరవం, ఆదరణ లభిస్తుంది. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. నిరుద్యోగులకు ఒక ప్రకటన ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. సాహస ప్రయత్నాలు విరమించండి.
 
మీనం: మీ మెుండివైఖరి వదిలి ప్రశాంత వహించుట మంచిది. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాలు మీకు అనుకూలిస్తాయి. విద్యార్థులకు తమ ధ్యేయం పట్ల ఆసక్తి, పట్టుదల అధికమవుతాయి. స్థిరాస్తికి సంబంధించిన చర్చలు సత్ఫలితాలనివ్వవు. మీ పాత సమస్య ఒకటి పరిష్కారం కాగలదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Devaansh: నారా లోకేష్ కుమారుడు దేవాన్ష్ అదుర్స్.. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం (video)

సినీ ఇండస్ట్రీ ఏపీకి వస్తే బాగుంటుంది.. పవన్ చెప్పారు.. పల్లా శ్రీనివాస్

Hyderabad : కూతుర్ని కిడ్నాప్ చేశాడు.. ఆటో డ్రైవర్‌ను హతమార్చిన దంపతులు

Allu Arjun: రేవతి మరణానికి అల్లు అర్జునే కారణం.. రాళ్లు రువ్విన జాక్ (video)

King cobra : నన్నే పట్టుకుంటావట్రా..చుక్కలు చూపెట్టిన కోబ్రా. పాము కాటు నుంచి పిల్లి ఎస్కేప్ (వీడియోలు)

అన్నీ చూడండి

లేటెస్ట్

తిరుమలలో ముమ్మరంగా వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లు

18-12-2024 బుధవారం దినఫలితాలు : కార్యసాధనకు ఓర్పు ప్రధానం...

Akhuratha Sankashti Chaturthi 2024: డిసెంబర్ 18న గణపతిని పూజిస్తే?

17-12-2024 మంగళవారం దినఫలితాలు : చిత్తశుద్ధితో శ్రమిస్తే విజయం తథ్యం...

కలలో గణేషుడు కనబడితే ఏం జరుగుతుంది?

తర్వాతి కథనం
Show comments