Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆదివారం (19-08-2018) దినఫలాలు - మీ తెలివి తేటలకు...

మేషం: మీ ముఖ్యుల కోసం ధనం బాగా వెచ్చించవలసి ఉంటుంది. సోదరులు మీతో అన్ని విషయాల్లోను ఏకీభవిస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు వచ్చినప్పటికి వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతారు. డాక్టర్లు శస్త్రచికిత్సలు

Advertiesment
Daily Horoscope
, ఆదివారం, 19 ఆగస్టు 2018 (09:54 IST)
మేషం: మీ ముఖ్యుల కోసం ధనం బాగా వెచ్చించవలసి ఉంటుంది. సోదరులు మీతో అన్ని విషయాల్లోను ఏకీభవిస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు వచ్చినప్పటికి వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతారు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. అయిన వారిని ఆప్తులను విందు భోజనానికి ఆహ్వానిస్తారు.
 
వృషభం: మత్స్య, కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. వీలైనంత వరకు మీ పనులు మీరే చూసుకోవడం ఉత్తమం. కొన్ని సమస్యలు చిన్నవే అయిన మనశ్శాంతి దూరంచేస్తారు. రాజకీయనాయకులకు ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం.
 
మిధునం: మీరు ఊహించిన దానికంటే అధికంగా వ్యయం అవుతుంది. గతంలో ఒకరిక్చిన హామీ వలన వర్తమానంలో ఇబ్బందులు ఎదుర్కుంటారు. ఉద్యోగ యత్నంలో నిరుద్యోగులకు బిడియం కూడదు. మీమాటతీరు. పద్ధతి ఎదుటివారిని ఆకట్టుకుంటాయి. మీ సృజనాత్మక శక్తికి, మీ తెలివి తేటలకు మంచి గుర్తింపు లభిస్తుంది. 
 
కర్కాటకం: హోటల్, క్యాటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కుంటారు. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. మీ బంధువులను సహాయం అర్ధించ్ బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవడం ఉత్తమం. ప్రముఖ ఆలయాల్లో దైవదర్శనాలు అతికష్టంమ్మీద అనుకూలిస్తాయి.   
 
సింహం: వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండడం శ్రేయస్కరం. దైవ, సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. ఊహించని ఖర్చులు, పెరిగిన అవసరాల వల స్వల్ప ఇబ్బందులను ఎదుర్కుంటారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాలవారికి సామాన్యంగా ఉంటుంది. 
 
కన్య: అందరితో కలిసివిందు, వినోదాలలో పాల్గొంటారు. మీరు చేసే పనులకు బంధువుల నుండి విమర్శలు, వ్యతిరేకత ఎదుర్కోక తప్పదు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. వాతావరణంలో మార్పుల వలన మీ పనులు మందకొడిగా సాగుతాయి. అనవసరపు వివాదాల్లో తలదూర్చి ఇబ్బందులకు గురికాకండి.  
 
తుల: కిరాణా, ఫ్యాన్సీ, మందులు, రసాయన, సుగంధ ద్రవ్య వ్యాపారులకు సంతృప్తికరంగా ఉంటుంది. స్త్రీలకు చుట్టుపక్కల వారిధోరణి ఆశ్చర్యం కలిగిస్తుంది. తల, కాళ్లు, చేతులు, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. ప్రింటింగ్, స్టేషనరీ రంగంలో వారు అచ్చుతప్పులు పడుట వలన మాటపడవలసి వస్తుంది.
 
వృశ్చికం: ఆర్థిక విషయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. ముఖ్యంగా ప్రింటింగ్, మిడియాలో ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. మీ సంతానంతో ఉల్లాసంగా గడుపుతారు. స్త్రీలకు పనివారలతో ఇబ్బందులు తప్పవు. వ్యాపార రీత్యా దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి.  
 
ధనస్సు: స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, అందుకు తగిన ప్రోత్సాహం లభిస్తాయి. ద్విచక్రవాహనం పై దూరప్రయాణాలు మంచిదికాదని గమనించండి. విద్యార్థులు క్రీడా రంగాలలో బాగా రాణిస్తారు. మీ ఉన్నతిని చాటుకోవడం కోసం ధనం బాగా ఖర్చుచేస్తారు. శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయడం మంచిది.
 
మకరం: మీ సంతానానికి ఇంజనీరింగ్, టెక్నికల్ కోర్సులలో అవకాశం లభిస్తుంది. పుణ్య కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందజేస్తారు. కుటుంబీకులతో ఏకీభవించలేక పోతారు. పాతమిత్రులను కలుసుకుంటారు. నిరద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత చాలా అవసరం. అందరితో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు.
 
కుంభం: కుటుంబీకులను పట్టించుకునేందుకు క్షణఁ తీరిక ఉండదు. గతంతో పోల్చుకుంటే ప్రస్తుత ఆర్థికస్థితి కొంత మెరుగనిపిస్తుంది. వాహన విషయంలో సంతృప్తి కానవస్తుంది. రచయితలకు, పత్రికా రంగంలో వారికి ప్రోత్సాహం కానవస్తుంది. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. 
 
మీనం: రాజకీయనాయకులకు కొంత అనుకూల వాతావరణం నెలకొంటుంది. బంధుమిత్రులతో కలిసి దైవ, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. రావలసిన ధనం అందకపోవటంతో ఇబ్బందులు తప్పవు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. మీ ప్రేమ మీ జీవితంలో మరింత ఆనందాన్ని నింపుతుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

19-08-2018 నుండి 25-08-2018 వరకు మీ వార రాశి ఫలితాలు