Webdunia - Bharat's app for daily news and videos

Install App

బుధవారం (22-08-2018) దినఫలాలు - కీడు తలపెట్టే స్నేహానికి...

మేషం: విద్యార్థులకు దూర ప్రాంతాల్లో ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. ధనం ఏ కొంతైనా నిల్వ చేయడం వలన సంతృప్తి కానవస్తుంది. ఉద్యోగరీత్యా దూరప్రయాణాలలో మెళకువ అవసరం. రాజకీయాలలో వారు కొన్ని అంశాలపై చర్య జరుప

Webdunia
బుధవారం, 22 ఆగస్టు 2018 (08:53 IST)
మేషం: విద్యార్థులకు దూర ప్రాంతాల్లో ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. ధనం ఏ కొంతైనా నిల్వ చేయడం వలన సంతృప్తి కానవస్తుంది. ఉద్యోగరీత్యా దూరప్రయాణాలలో మెళకువ అవసరం. రాజకీయాలలో వారు కొన్ని అంశాలపై చర్య జరుపుటవలన జయం చేకూరుతుంది. దైవ, సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు.
 
వృషభం: స్త్రీలకు అకాలభోజనం వలన ఆరోగ్యంలో ఇబ్బందులు తప్పవు. గతంలో నిలిపివేసిన పనులు పునఃప్రారంభిస్తారు. సినిమా, విద్యా, సాంస్కృతిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాల్లో ఏకాగ్రత అవసరం. 
 
మిధునం: కీడు తలపెట్టే స్నేహానికి దూరంగా ఉండండి. మీ శ్రీమతి మెుండివైఖరి చికాకు, ఆందోళనకు గురవుతారు. మీ యత్నాలకు సన్నిహితులు, కుటుంబీకుల నుండి ప్రోత్సాహం లభిస్తుంది. నిరుద్యోగులకు చేతిదాకా వచ్చిన అవకాశాలు చేజారిపోతాయి. ఉద్యోగ యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. 
 
కర్కాటకం: ఫర్నిచర్ అమరికలకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కుంటారు. మీ ప్రియతముల కోసం పిల్లల కోసం ధనం బాగుగా వెచ్చిస్తారు. నిరుద్యోగులు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం శ్రేయస్కరం. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. 
 
సింహం: మీ ప్రయత్నాలకు కుటుంబ సభ్యులు ప్రోత్సాహం లభిస్తుంది. ఎదుటివారికి వాహనం ఇచ్చి ఇబ్బందులకు గురికాకండి. సోదరీసోదరులు మీ యత్నాలకు చేయూతనిస్తారు. మీ మంచితనమే మీకు శ్రీరామ రక్షగా ఉంటుంది. కాంట్రాక్టర్లకు మంచి మంచి అవకాశాలు లభించిన సద్వినియోగం చేసుకోలేరు. 
 
కన్య: దానధర్మాలు చేయడం వలన మీ కీర్తి, ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. మీ వాక్‌చాతుర్యానికి, మంచి తనానికి గుర్తింపు లభిస్తుంది. రవాణా రంగాల వారికి మెళకువ అవసరం. స్త్రీల మనో భావాలు వ్యక్తం చేయడం వలన అశాంతికి గురవుతారు. ఆటోమోబైల్, ట్రాన్‌పోర్ట్, మోకానికల్ రంగాలలో వారికి చికాకులు తప్పవు.
 
తుల: ఆర్థిక విషయాల్లో ఒకడుగు ముందుకు వేస్తారు. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన బలపడుతుంది. బంధువుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. పొదుపు పథకాల దిశగా మీ ఆలోచనలు ఉంటాయి. ఉద్యోగస్తులకు హోదా పెరిగే సూచనలున్నాయి. మీ భవిష్యత్ ప్రణాళికలను ఎవరితోను చర్చించవద్దు.
 
వృశ్చికం: బ్యాంకింగ్ వ్యవహారాలలో అరపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. గతంలో ఒకరికిచ్చిన హామీ వలన వర్తమానంలో ఇబ్బందులెదుర్కుంటారు. పండ్ల, పూల, కూరగాయ రంగాలలో వారికి అనుకూలమైన కాలం. చేసే పనిలో ఏకాగ్రత, పట్టుదల ఎంతో ముఖ్యమని గమనించండి. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
ధనస్సు: రాజకీయాలలో వారికి ఊహించని అవరోధాలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. కళాశాలలో ప్రవేశాలకు, కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు అనుకూలం సమయం. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదా పడుతాయి. రుణ విముక్తులు కావడంతో పాటు రుణాలు అనుకూలిస్తాయి. బంధువులను కలుసుకుంటారు. 
 
మకరం: ఆర్థిక విషయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. ప్రత్తి, పొగాకు రంగాలలో వారికి అనుకూలమైన కాలం. మీపై అధికారుల ధోరణిలో మార్పు కనిపిస్తుంది. హోటలు తినుబండ వ్యాపారస్తులకు సంతృప్తి కానవచ్చును. పరిస్థితులను జాగ్రత్తగా వ్యవహిరించండి. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి.  
 
కుంభం: వృత్తి విద్యా కోర్సులలో రాణిస్తారు. ఇతరులు మిమ్మల్ని చూసి అపోహపడే ఆస్కారం ఉంది. ఒంటరిగానే లక్ష్యాలను సాధిస్తారు. పెన్షన్, భఈమా సమస్యలు పరిష్కారమవుతాయి. చిన్నారుల, విద్య, ఖరీదైన వస్తువుల కొనుగోలు విషయాల్లో ఖర్చులు అంచనాలు మించుతాయి. పాత మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. 
 
మీనం: ఆర్థిక లావాదేవీలు, కుటుంబ సమస్యలు సమర్థంగా పరిష్కరిస్తారు. ఉద్యోగంలో శ్రమకు మంచి గుర్తింపు లభిస్తుంది. వైద్యులకు శస్త్రచికిత్స చేయునపుడు మెళకువ అవసరం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు వచ్చినప్పటికి వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతారు. రావలసిన బాకీలు వసూలవుతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లయిన 21 రోజులకే నవ వరుడు ఆత్మహత్య!

అప్పుల సేద్యం వద్దు నాన్నా.. ఉన్న సంపాదనతో బతుకుదాం.. అనంతలో విషాదం!

తిరుమలలో తొక్కిసలాట జరగలేదు.. వాళ్లంత వాళ్లే పడిపోయారు... చింతా మోహన్ (Video)

సూత్రధారి సజ్జల భార్గవరెడ్డి .. డబ్బంతా ఆయనే తీసుకున్నారు : వర్రా రవీంద్ర రెడ్డి

ఉత్తర ద్వారం నుంచే విష్ణుమూర్తిని చూడాలా, ద్వారాలు బద్ధలవ్వాలా?: భక్తులకు సూటిగా గరికపాటి (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

Tortoise: క్రిస్టల్ తాబేలును ఇంట్లో వుంచుకుంటే ఏం జరుగుతుంది? (video)

Durga Ashtami Vrat: జనవరి 7, 2025 : అష్టమి తిథి నేడు.. అదీ మంగళవారం.. దుర్గాష్టమి.. ఇలా పూజ చేస్తే?

07-01-2025 మంగళవారం దినఫలితాలు : స్వయంకృషితో లక్ష్యం సాధిస్తారు...

Guru Gobind Singh Jayanti 2025: గురు గోవింద్ సింగ్ జయంతి.. కోట్స్ ఇవే

06-01-2025 సోమవారం దినఫలితాలు : ప్రలోభాలకు లొంగవద్దు...

తర్వాతి కథనం
Show comments