Webdunia - Bharat's app for daily news and videos

Install App

21-02-2020 శుక్రవారం దినఫలాలు - ఈశ్వరునికి అభిషేకం చేయించి...

Webdunia
శుక్రవారం, 21 ఫిబ్రవరి 2020 (05:00 IST)
మేషం : ఉద్యోగులకు వేతన సమస్యలు తలెత్తుతాయి. దంపతులకు ఏ విషయంలోనూ పొత్తు కుదరదు. సొంతంగా వ్యాపారం చేయాలనే మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. స్త్రీల మనోభావాలు వ్యక్తం చేయడం వల్ల అశాంతికి లోనవుతారు. దైవారాధన పట్ల ఆసక్తి పెరుగుతుంది. బ్యాంకు వ్యవహారాలలో ఒత్తిడి అధికమవుతుంది. 
 
వృషభం : సోదరీ, సోదరుల మధ్య సఖ్యత నెలకొంటుంది. విద్యార్థుల అతి ఉత్సాహం ప్రదర్శించడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. నిరుద్యోగులకు చిన్న సదావకాశం లభించినా సద్వినియోగం చేసుకోవడం మంచిది. కాంట్రాక్టర్లు పనివారివల్ల సమస్యలకు, ఇబ్బంది లోనవుతారు. కోర్టు వ్యవహారాలు వాయిదాపడటం మంచిది. 
 
మిథునం : ద్విచక్రవాహనంపై దూరప్రయాణాలు మంచిదికాదని గమనించండి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు అనుకూలిస్తాయి. దంపతుల మధ్య ఏకీభావం లోపిస్తుంది. స్త్రీలు చుట్టుపక్కల వారి నుంచి అవమానాలు ఎదుర్కొంటారు. ఖర్చులు అదుపుచేయలేకపోవడం వల్ల ఆందోళనకు గురవుతారు. 
 
కర్కాటకం : విద్యార్థినులకు ఏకాగ్రతా లోపం అధికమవుతుంది. ఉపాధ్యాయులకు ఒత్తిడి, విశ్రాంతి లోపం వంటి చికాకులు అధికమవుతాయి. అలంకారాలు, వస్త్రాలు, విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ సంతానం కోసం ధన వ్యయం చేస్తారు. బ్యాంకింగ్ రంగాలలోని వారికి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. 
 
సింహం : రిప్రజెంటేటివ్‌లకు, ప్రైవేటు సంస్థలలోని వారికి ఊహించని చికాకులు తలెత్తుతాయి. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాలు మీకు అనుకూలిస్తాయి. విద్యార్థినులు కొత్త విషయాల పట్ల ఏకాగ్రత, ఉత్సాహం కనపరుస్తారు. స్త్రీలు తమ వాక్చాతుర్యంతో, తెలివితేటలతో అందరినీ ఆకర్షించగలుగుతారు. 
 
కన్య : కొబ్బరి, పండ్లు, చిరు వ్యాపారులకు లాభదాయకం. ముందుగా ఊహించిన ఖర్చులు కావడంతో ఆర్థిక ఇబ్బందులు ఏమాత్రం ఉండవు. బంధువుల రాకవల్ల గృహంలో అసౌకర్యానికి లోనవుతారు. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు, తరచూ విందులు వంటి శుభ సంకేతాలున్నాయి. 
 
తుల : వస్త్ర, కళంకారి, బంగారు, వెండి, చిన్నతరహా పరిశ్రమల వారికి పురోభివృద్ధి. రాజకీయాలలోని వారికి కార్యకర్తల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. బంధువులను కలుసుకుంటారు. నిరుద్యోగులకు నిరుత్సాహం, నిర్లిప్తత వంటి చికాకులు తప్పవు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. 
 
వృశ్చికం : ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. దైవ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. దూరప్రయాణాలు వాయిదాపడతాయి. మీ సంతానం కోసం ధనం వ్యయ చేస్తారు. నూతన వ్యక్తుల పరిచయం మీకెంతో సంతృప్తినిస్తుంది. ఓర్పుతో వ్యవహరించడం వల్ల ఒక సమస్యపరిష్కారమవుతుంది. 
 
ధనస్సు : ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు ఎదుర్కొంటారు. సంఘంలో ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు మీ పురోభివృద్ధికి నాంది పలుకుతాయి. రుణ విముక్తులు కావడంతో మానసికంగా కుదుటపడతారు. మిత్రులను కలుసుకుంటారు. కొంతమంది మిమ్మల్ని ఆర్థిక, మాట సహాయం అర్థిస్తారు. 
 
మకరం : ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి. చేపట్టిన పనులు కొంత ఆలస్యంగానైనా సంతృప్తికరంగా పూర్తిచేస్తారు. గొప్ప గొప్ప ఆలోచనలు, ఆశయాలు స్ఫురిస్తాయి. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సామాన్య ఫలితాలనే ఇస్తాయి. పెద్దల మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. 
 
కుంభం : విద్యార్థులు విద్యా విషయాల పట్ల ఏకాగ్రత వహించిన సత్ఫలితాలు పొందగలుగుతారు. గృహోపకరణాలు అమర్చుకుంటారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి ఆశాజనకం. స్త్రీలకు పనివారలతో చికాకులు తప్పవు. మీ ఆశయానికి, అభిరుచులకు తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. 
 
మీనం : ఫ్లీడర్లకు, ఫ్లీడరు గుమస్తాలకు నిరుత్సాహం తప్పదు. ప్రముఖులతో ముఖ్యమైన కార్యక్రమాలలో పాల్గొంటారు. కొంతమంది మిమ్మల్ని ఆర్థిక, మాట సహాయం అర్థిస్తారు. స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. ఉద్యోగస్తులు అధికారుల తీరును గమనించి మెలగవలసి ఉంటుంది. రావలసిన మొండిబాకీలు సైతం వసూలు కాగలవు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మనిషి మర్చిపోవడం సహజం.. కానీ ఎవరైతే అన్నం పెట్టారో : డిప్యూ సీఎం పవన్ (Video)

రేపు లోక్‌సభలో వన్ నేషన్ - వన్ ఎలక్షన్ బిల్లు!!

ఢిల్లీ ఎన్నికలు : కేజ్రీవాల్‌పై మాజీ సీఎం కొడుకు పోటీ!!

గతంలో తెలుగు భాషపై దాడి జరిగింది : మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ

రాంగ్ ఫోన్ కాల్ వాజేడు ఎస్ఐ హరీశ్ ప్రాణం తీసింది.. : యువతి అరెస్టు

అన్నీ చూడండి

లేటెస్ట్

Sagittarius 2025: ధనుస్సు రాశికి 2025 ఎలా వుంటుంది? విష్ణుసహస్రనామ పారాయణ చేస్తే?

Karthika Deepam 2025: 365 వత్తులతో దీపాన్ని వెలిగిస్తే?

Today Daily Astro 13-12-2024 శుక్రవారం దినఫలితాలు

ప్రతిదీ అసాధ్యం అని చెప్పే వారిని నమ్మవద్దు: స్వామి వివేకానంద

January horoscope 2025 in Telugu: జనవరిలో ఏ రాశుల వారికి అనుకూలమో తెలుసా?

తర్వాతి కథనం
Show comments