Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

20-02-2020 - గురువారం మీ రాశి ఫలితాలు-సాయిబాబాను దర్శించినట్లైతే? (video)

Advertiesment
20-02-2020 - గురువారం మీ రాశి ఫలితాలు-సాయిబాబాను దర్శించినట్లైతే? (video)
, గురువారం, 20 ఫిబ్రవరి 2020 (05:00 IST)
గురువారం సాయిబాబాను దర్శించినట్లైతే సర్వదా శుభం కలుగుతుంది. 
 
మేషం: వైద్య, ఇంజనీరింగ్ రంగాలవారికి పురోభివృద్ధి. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. మీ ఆలోచనకు, ఆచరణకు మధ్య నుండే ఎడం తగ్గించుకోవాలి. చేపట్టిన పనులు ముగింపు దశలో ఆసక్తి వుండదు. పెద్దల ఆరోగ్య సమస్యలను అశ్రద్ధ చేయరాదు. మీ వాక్చాతుర్యం అందరినీ ఆకట్టుకుంటుంది.
 
వృషభం: స్త్రీలకు షాపింగ్‌లోను, వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత ముఖ్యం. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. పత్రిక, మీడియా సంస్థల వారు అకారణంగా మాటపడవలసి వస్తుంది. పైనాన్స్, చిట్స్ రంగాల్లో వారికి ఒత్తిడి పెరుగుతుంది. కోర్టు వాదోపవాదాల్లో ప్లీడర్లకు గుర్తింపు లభిస్తుంది. 
 
మిథునం: వ్యాపారవేత్తలు ప్రస్తుత పరిస్థితిని కొనసాగించడం మంచిది. ఆత్మీయులకు విలువైన కానుకలు అందిస్తారు. స్త్రీలకు పరిచయాలు, ఇతర వ్యాపకాలు అధికం కావడంతో చికాకులు తప్పవు. బంధువుల రాకతో ఖర్చులు అధికం. షాపు గుమాస్తాలు, పనివారలను ఓ కంట కనిపెట్టండి. బ్యాంకు పనులు అనుకూలం.
 
కర్కాటకం: ఉద్యోగస్తులకు అనుకోని ప్రయాణాలు ఎదురుకావచ్చు. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. వస్త్ర, బంగారం, వెండి, లోహ వ్యాపారస్తులకు పనివారితో సమస్యలు అధికం అవుతాయి. ఏ యత్నం కలిసిరాక నిరుద్యోగులు అనుక్షణం అశాంతికి లోనవుతారు. 
 
సింహం: బ్యాంకు వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. మీ మాటలు ఇతరులకు జారవేసే వ్యక్తుల వల్ల ఇబ్బందులు తప్పవు. మీ శ్రీమతిలో వచ్చిన మర్పు సంతృప్తినిస్తుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి సదవకాశాలు లభిస్తాయి. కళలు, రాజకీయ ప్రజా సంబంధాల రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది.
 
కన్య: భాగస్వామి వ్యాపారాల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. విద్యార్థులు భయాందోళనలు వీడి శ్రమించినట్లైతే సత్ఫలితాలు లభిస్తాయి. ఉద్యోగస్తులు అనవసర బాధ్యతలు చేపట్టి ఇబ్బందులెదుర్కుంటారు. స్త్రీలు విలువైన వస్తువులు, గృహోపకరణాలు అమర్చుకుంటారు. బాకీలు, ఇంటి అద్దెల వసూలులో సౌమ్యంగా మెలగాలి.
 
తుల: ఉపాధ్యాయులు పై అధికారులతో సంభాషించేటప్పుడు మెళకువ అవసరం. సన్నిహితులకు మీరిచ్చిన సలహాలు, సూచనలు బాగా ఉపకరిస్తాయి. బ్యాంకు పనుల్లో జాప్యం, చికాకులు ఎదుర్కొంటారు. కొన్ని అనుకోని సంఘటనలు దిగ్భ్రాంతికి గురిచేస్తాయి. వ్యాపారాల్లో కొత్త కొత్త పథకాలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు.
 
వృశ్చికం: ఆర్థిక లావాదేవీలు, ఒప్పందాల్లో ఏకాగ్రత ముఖ్యం. నిరుద్యోగులు ఉపాధి పథకాల్లో క్రమంగా నిలదొక్కుకుంటారు. చేపట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. ఉపాధ్యాయ రంగాల్లో వారికి అభిప్రాయ బేధాలు తలెత్తవచ్చు. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రుల కోసం ధనం అధికంగా వ్యయం చేస్తారు.
 
ధనస్సు: రిప్రజెంటేటివ్‌లు, ప్రైవేట్ సంస్థల్లోని వారికి ప్రగతితో కూడిన అవకాశాలు లభిస్తాయి. ఆదాయ వ్యయాలకు చక్కని ప్రణాళికలు రూపొందిస్తారు. ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల సమస్యలు తలెత్తే  ఆస్కారం వుంది జాగ్రత్త వహించండి. స్త్రీలు ఇతరులతో సంభాషించేటప్పుడు ఏకాగ్రత, మెళకువ అవసరం.
 
మకరం: కుటుంబంలో ఖర్చుల నిమిత్తం ఎక్కువ ధనం వెచ్చించాల్సి వుంటుంది. రిప్రజెంటేటివ్‌లు, ప్రైవేట్ సంస్థల్లోని వారికి ప్రగతితో కూడిన అవకాశాలు లభిస్తాయి. మీ అభిప్రాయాలను నిర్మొహమాటంగా తెలియజేయండి. సిమెంట్, ఐరన్, కలప, ఇటుక వ్యాపారులకు పురోభివృద్ధి. వాహనం నడుపుతున్నప్పుడు మెళకువ అవసరం. 
 
కుంభం: బ్యాంకింగ్ రంగాల వారికి పనిభారం అధికమవుతుంది. ఒక స్థిరాస్తిని అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. కోర్టు వ్యాజ్యాలను ఉపసంహరించుకుంటారు. బంధువుల ద్వారా కొత్త విషయాలు గ్రహిస్తారు. సంఘంలో మీ మాటకు మంచి గుర్తింపు లభిస్తుంది. దూర ప్రయాణాల్లో వస్తువుల పట్ల మెళకువ అవసరం.
 
మీనం: ఆర్థిక లావాదేవీలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. విద్యార్థినుల్లో మానసిక ధైర్యం, సంతృప్తి చోటుచేసుకుంటాయి. కిరణా, ఫ్యాన్సీ, నిత్యవసర వస్తు వ్యాపారులకు స్టాకిస్టులకు కలిసిరాగలదు. వైద్య, ఇంజనీరింగ్ రంగాల్లో వారికి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏకాదశి వ్రతం లాగానే శివరాత్రి వ్రతం కూడా...? ఉపవాసం, జాగరణ (Video)