గురువారం (19-07-2018) దినఫలాలు - నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు

మేషం: కమ్యూనికేషన్, కంప్యూటర్, వైజ్ఞానిక రంగాల వారికి నూతన ఆలోచనలు స్పురిస్తాయి. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కుంటారు. బంధువుల రాక మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభ

Webdunia
గురువారం, 19 జులై 2018 (09:12 IST)
మేషం: కమ్యూనికేషన్, కంప్యూటర్, వైజ్ఞానిక రంగాల వారికి నూతన ఆలోచనలు స్పురిస్తాయి. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కుంటారు. బంధువుల రాక మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించిన జారవిడుచుకుంటారు. మీ సంతానం కోసం ధనం వెచ్చిస్తారు.
 
వృషభం: దంపతుల మధ్య పరస్పర అవగాహనా లోపం. ప్రేమికుల మధ్య మనర్పర్ధళు తొలగిపోతాయి. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి ఒత్తిడి చికాకులు తప్పవు. ప్రయాణాలలో ఇబ్బందులను ఎదుర్కుంటారు. కొబ్బరి, పండ్లు, పూల, కూరగాయ రంగాలలో వారికి అనుకూలమైన కాలం.   
 
మిధునం: స్త్రీలకు ఉపాధి పథకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. బ్యాంకు లావాదేవీలు ఋణ ప్రయత్నాలకు అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది. అలౌకిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. పెద్దలను, ప్రముఖులను కలుసుకోగలుగుతారు. ఒంటరిగానే లక్ష్యాలను సాధిస్తారు. ఇతరులకు వాహనం ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు.  
 
కర్కాటకం: గౌరవ ప్రతిష్టలు పెరిగే అవకాశం ఉంది. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. బంధువుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. వృత్తుల వారికి ఎంత శ్రమించినా ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. 
 
సింహం: వైద్యులకు శస్త్రచికిత్స చేయునపుడు మెళకువ అవసరం. ప్రభుత్వ సంస్థలతో పనులు పూర్తవుతాయి. అధికారులతో సంభాషించేటప్పుడు జాగ్రత్త వహించండి. స్త్రీలు వాహనం నడుపునపుడు జాగ్రత్త వహించవలెను. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విలువైన పత్రాలు అందుకుంటారు. 
 
కన్య: మీ పరోపకార బుద్ధి మీకు సమస్యలను తెచ్చిపెడుతుంది. సహోద్యోగులతో కళా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లోను, వస్తు నాణ్యతలోను మెళకువ అవసరం. మీ అభిప్రాయాలు, భావాలను సున్నితంగా వ్యక్తం చేయండి. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. 
 
తుల: నిరుద్యోగులకు సదవకాశాలు లభిస్తాయి. స్త్రీల మాటకు వ్యతిరేకత ఎదురుకావడంతే కుటుంబ సౌఖ్యం లోపిస్తుంది. రుణం ఏ కొంతైనా తీర్చాలన్న మీ సంకల్పం నెరవేరుతుంది. శ్రీవారు, శ్రీమతి విషయాలలో శుభపరిణామాలు సంభవం. బదిలీలు, మార్పులు, చేర్పులకు సంబంధించి ప్రణాళికలు రూపొందించుకుంటారు.  
 
వృశ్చికం: విద్యార్థుల్లో మందకొడితనం నిర్లక్ష్యం చోటుచేసుకుంటాయి. గత కొంత కాలంగా అనుభవిస్తున్న చికాకులు తొలగిపోయి ప్రశాంతత చేకూరుతుంది. బంధువుల నుండి ఒత్తిడి, మెుహమ్మాటాలు ఎదుర్కుంటారు. కొంతమంది మీ పలుకుబడిని దుర్వినియోగం చేయడం వలన మాటపడవలసి వస్తుంది.   
 
ధనస్సు: భవిష్యత్తులో ఖర్చులు, ఇతరత్రా చెల్లింపులు అధికంగా ఉంటాయి. బంధువులపై మీరు పెట్టుకున్న ఆశలు అడియాసలవుతాయి. స్త్రీలకు అకాల భోజనం, శారీరశ్రమ వలన ఆరోగ్యం మందగిస్తుంది. వాయిదా పడిన మెుక్కుబడులు తీర్చుకుంటారు. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. 
 
మకరం: పత్రిక, వార్తా మీడియా వారికి ఊహించని చికాకులు లెదురవుతాయి. రావలసిన ధనం గురించి ఆలోచనలు చేస్తారు. పొదుపు ఆవశ్యకతను గుర్తిస్తారు. వాతావరణంలో మార్పుతో స్వల్ప అస్వస్థతకు గురువుతారు. చేపట్టిన పనులు వేగవంతమవుతాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు. 
 
కుంభం: ఉపాధ్యాయులకు ఆర్థిక ప్రగతితో కూడిన అవకాశాలు లభిస్తాయి. గృహమునకు కావలసిన వస్తువులు అమర్చుకోగలుగుతారు. దంపతుల మధ్య మనస్పర్థలు తలెత్తుతాయి. విందులలో పరిమితి పాటించండి. ఏదో ఒక స్థిరాస్తి విక్రయించాలనే ఆలోచన స్పురిస్తుంది. సోదరీ, సోదరుల మధ్య ప్రేమానుబంధాలు బలపడుతాయి.
 
మీనం: ఆర్థికంగా నిలదొక్కుకోవడంతో పాటు రుణాలు తీరుస్తారు. మీ సంకల్పానికి నిరంతర శ్రమ, పట్టుదల చాలా అవసరమని గమనించండి. మీ కళత్ర విపరీతధోరణి చికాకు పరుస్తుంది. నిరుద్యోగులు, వృత్తుల వారికి అన్ని విధాలా కలిసిరాగలదు. మీ చిన్నారుల కోసం నూతన పథకాలు వేసి జయం పొందగలుగుతారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మంటగలిసిపోతున్న కుటుంబ విలువలు.. భార్యాబిడ్డల్ని హత్యచేసి వ్యక్తి ఆత్మహత్య

తెలంగాణలోని పలు జిల్లాల్లో రాత్రంతా కురిసిన వర్షాలు.. ప్రజలకు వేడి నుంచి ఉపశమనం

ప్రియుడు గదికి కుమార్తెను బలవంతంగా పంపిన తల్లి... ఎక్కడ?

చంద్రునిపై అన్వేషణ మిషన్లకు మద్దతుగా రోబోటిక్ ల్యాండర్లు, రోవర్లు, డ్రోన్‌లు

అక్రమ సంబంధం.. రూ.2 కోట్ల బీమా సొమ్ము కోసం భర్తను హత్య చేయించిన భార్య

అన్నీ చూడండి

లేటెస్ట్

మూడేళ్లకు ఒకసారి వచ్చే పద్మిని ఏకాదశి.. తులసి దళాలతో అర్చన చేస్తే?

27-05-2026 బుధవారం ఫలితాలు- దంపతుల మధ్య అకారణ కలహం

Eid Al-Adha 2026 date: తెలుగు రాష్ట్రాల్లో మే 28, 2026 గురువారం బక్రీద్.. సెలవు దినం

26-05-2026 మంగళవారం ఫలితాలు - ధనసహాయం తగదు

25-05-2026 సోమవారం ఫలితాలు - ఖర్చులు అదుపులో ఉండవు.. ముఖ్యుల కలయిక వీలుపడదు...

తర్వాతి కథనం
Show comments